iDreamPost
android-app
ios-app

ఛార్జింగ్ ఎంతుందో చూపించే పవర్ బ్యాంక్.. ఇది మీ దగ్గరుంటే నో టెన్షన్..

  • Published Jul 12, 2024 | 6:34 PM Updated Updated Jul 12, 2024 | 6:34 PM

DR VAKU 10000mAh Power Bank: ఎమర్జెన్సీ సమయంలో పవర్ బ్యాంకులు అనేవి చాలా ఉపయోగపడతాయి. ముఖ్యంగా దూర ప్రయాణాలు చేసినప్పుడు వీటి ఉపయోగం ఎంతుంటుందో వాడేవారికే తెలుస్తుంది. అయితే కొన్నిసార్లు పవర్ బ్యాంకుల వల్ల దెబ్బైపోయే అవకాశం ఉంది. ఛార్జింగ్ ఉందేమో అని వెంట తీసుకుని వెళ్తే.. ఎమర్జెన్సీ సమయంలో హ్యాండ్ ఇస్తుంది. అందుకే ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు సరికొత్త పవర్ బ్యాంక్ వచ్చింది.  

DR VAKU 10000mAh Power Bank: ఎమర్జెన్సీ సమయంలో పవర్ బ్యాంకులు అనేవి చాలా ఉపయోగపడతాయి. ముఖ్యంగా దూర ప్రయాణాలు చేసినప్పుడు వీటి ఉపయోగం ఎంతుంటుందో వాడేవారికే తెలుస్తుంది. అయితే కొన్నిసార్లు పవర్ బ్యాంకుల వల్ల దెబ్బైపోయే అవకాశం ఉంది. ఛార్జింగ్ ఉందేమో అని వెంట తీసుకుని వెళ్తే.. ఎమర్జెన్సీ సమయంలో హ్యాండ్ ఇస్తుంది. అందుకే ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు సరికొత్త పవర్ బ్యాంక్ వచ్చింది.  

ఛార్జింగ్ ఎంతుందో చూపించే పవర్ బ్యాంక్.. ఇది మీ దగ్గరుంటే నో టెన్షన్..

ఎక్కడికైనా దూర ప్రయాణాలు వెళ్ళినప్పుడు లేదా ఒక రోజంతా వేరే పని మీద వెళ్లినప్పుడు ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోవడం కష్టం అవుతుంది. బస్సు, రైలు ప్రయాణాల్లో ఉన్నప్పుడు అయితే చాలా కష్టంగా ఉంటుంది. ఈ సమస్యకు పరిష్కారంగా ఇప్పటికే అనేక కంపెనీల పవర్ బ్యాంకులు వచ్చాయి. కానీ ఫోన్ లో చూపించినట్టు పర్సంటేజ్ చూపించే పవర్ బ్యాంకులు లేవు. పాయింట్లు చూపించే పవర్ బ్యాంకులు ఉన్నాయి కానీ ఎంత పర్సంటేజ్ ఉంది అనేది చూపించదు. దీని వల్ల పవర్ బ్యాంక్ లో ఛార్జ్ ఉందేమో అని అనుకుని వెంట తీసుకెళ్తే ఇక అంతే సంగతులు. పవర్ బ్యాంక్ లో ఛార్జ్ ఉండదు. ఫోన్ లోనూ ఛార్జ్ ఉండదు. అందుకే మీకు ఈ సమస్య ఉండకూడదంటే సాదాసీదా పవర్ బ్యాంకు కాదు.. ఈ సరికొత్త పవర్ బ్యాంకు ఉండాలి.     

డాక్టర్ వాకు కంపెనీకి చెందిన పవర్ బ్యాంక్ లో పర్సంటేజ్ ఆప్షన్ ఉంది. అంటే మీరు పవర్ బ్యాంక్ ని ఛార్జింగ్ పెడితే కనుక అది ఎంత పర్సంటేజ్ ఉందో అనేది తెలుస్తుంది. దీని వల్ల మీరు ఎప్పుడైనా టూర్ ప్లాన్ చేసుకున్నప్పుడు ఈ పర్సంటేజ్ చూసుకుని రిలాక్స్డ్ గా ఉండచ్చు. ఇది 10 వేల ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. క్లియర్ బోల్ట్ పోర్టబుల్ 20 వాట్ పీడీ క్యూసీ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. బ్యాటరీ హెల్త్ ప్రొటెక్షన్ టెక్నాలజీతో దీన్ని తయారు చేశారు. దీన్ని ఈజీగా క్యారీ చేసేందుకు ఒక లూప్ ని ఇచ్చారు. రెండు 18 వాట్ క్యూసీ యూఎస్బీ అవుట్ పుట్స్ ని ఇచ్చారు. పీడీ, పీపీఎస్ ఇన్పుట్, అవుట్పుట్ టైప్ సీ పోర్ట్స్ తో వస్తుంది. సాలిడ్ ఏబీఎస్ ఎఫ్ఆర్ గ్రేడ్ స్ట్రాంగ్ బాడీతో వస్తుంది.

పర్సంటేజ్ చూపించడానికి ఇందులో డిజిటల్ ఎల్ఈడీ ఇండికేటర్ ని ఇచ్చారు. ఇంకో విశేషం ఏంటంటే.. దీన్ని టార్చ్ లైట్ గా కూడా ఉపయోగించుకోవచ్చు. ఈ లైటింగ్ ని లో లైట్, మీడియం లైట్, ఫుల్ బ్రైట్ ఇలా మూడు మోడ్స్ లో సెట్ చేసుకోవచ్చు. ఆన్ లైన్ లో దీని అసలు ధర రూ. 2,999 కాగా ఆఫర్ లో రూ. 1399 కే అందుబాటులో ఉంది. ఎంపిక చేయబడిన క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డు మీద అదనంగా రూ. 1750 వరకూ తగ్గింపు పొందవచ్చు. కొన్ని రోజులే ఉంటుంది ఈ ఆఫర్. కాబట్టి మీకు ఈ పవర్ బ్యాంక్ అవసరం అనుకుంటే వెంటనే కొనుక్కోండి. డాక్టర్ వాకు 10000 ఎంఏహెచ్ పవర్ బ్యాంక్ ని కొనుగోలు చేసేందుకు ఈ లింక్ పై క్లిక్ చేయండి.