iDreamPost
android-app
ios-app

విలేజ్ కుకింగ్ ఛానెల్ వీడియోస్ షూట్ చేసే కెమెరా కాస్ట్ తెలుసా? కలలో కూడా ఊహించలేరు!

  • Published Jul 09, 2024 | 10:01 PM Updated Updated Jul 09, 2024 | 10:01 PM

యూట్యూబర్స్ తమ వీడియోలు క్వాలిటీగా వచ్చేందుకు 4కే రెసొల్యూషన్, ఐఫోన్ కెమెరాలను యూజ్ చేస్తుంటారు. మరి విలేజ్ కుకింగ్ ఛానెల్ వీడియోస్ షూట్ చేసే కెమెరా కాస్ట్ తెలుసా?

యూట్యూబర్స్ తమ వీడియోలు క్వాలిటీగా వచ్చేందుకు 4కే రెసొల్యూషన్, ఐఫోన్ కెమెరాలను యూజ్ చేస్తుంటారు. మరి విలేజ్ కుకింగ్ ఛానెల్ వీడియోస్ షూట్ చేసే కెమెరా కాస్ట్ తెలుసా?

విలేజ్ కుకింగ్ ఛానెల్ వీడియోస్ షూట్ చేసే కెమెరా కాస్ట్ తెలుసా? కలలో కూడా ఊహించలేరు!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక టాలెంట్ నిరూపించుకునేందుకు వేదిక దొరికినట్లైంది. క్రియేటివ్ కంటెంట్ తో వీడియోలు రూపొందించి సోషల్ మీడియాలో లక్షల్లో వ్యూస్ పొందుతున్నారు. అంతే కాదు సోషల్ మీడియా ద్వారా ఉపాధి పొందుతున్నారు. ఇన్స్టా, యూట్యూబ్ యూజర్లు లక్షల రూపాయలను సంపాదిస్తున్నారు. ఇదే రీతిలో విలేజ్ కుకింగ్ యూట్యూబ్ ఛానెల్ వారు తమ డిఫరెంట్ టైప్ ఆఫ్ వంటలతో ప్రత్యేకతను చాటుకున్నారు. మొదటి డైమండ్ క్రియేటర్ అవార్డును అందుకున్న మొదటి తమిళ యూట్యూబ్ ఛానెల్‌గా నిలిచింది. వంటలపై వీరు చేసిన వీడియోలు 100 మిలియన్ల వ్యూస్ సాధించి సరికొత్త రికార్డును సాధించాయి. అయితే ఈ యూట్యూబ్ ఛానల్ వారు యూజ్ చేసే కెమెరా కాస్ట్ తెలిస్తే మాత్రం ఆశ్యర్యపోకుండా ఉండలేరు. ఇంతకీ వారు యూజ్ చేసే కెమెరా ఏంటీ? దాని ధర ఎంతంటే?

వీడియోలు తీసుకునేందుకు కొందరు ఐఫోన్లు యూజ్ చేస్తుంటారు. 4కే రెజల్యూషన్ తో కూడిన కెమెరాలను వాడుతుంటారు. కెమెరాల్లో చాలా రకాలు ఉంటాయి. డిఎస్ఎల్ ఆర్ కెమెరాలు, ఫిల్మ్ కెమెరాలు, డిజిటల్ సినిమా కెమెరాలు, ఇన్ స్టంట్ కెమెరాలను ఉపయోగిస్తుంటారు. అయితే వీడియోలు మరింత ఎఫెక్టివ్ గా ఉండేందుకు సినిమాటిక్ లుక్ ఉండేలా కొంతమంది 8కే రిజల్యూషన్ కెమెరాలను వాడుతుంటారు. విలేజ్ కుకింగ్ యూట్యూబ్ ఛానల్ వారు 8కే రిజల్యూషన్ కలిగిన రెడ్ రాప్టర్ కెమెరాను వినియోగిస్తున్నారు. దీని ధర దాదాపు రూ. 40 లక్షలుగా ఉంది. సినిమా షూట్ చేసేందుకు వాడే కెమెరాను ఈ యూట్యూబ్ ఛానల్ వారు యూజ్ చేస్తున్నారు.

రాప్టర్ 8కే అనేది అత్యంత శక్తివంతమైన, అధునాతనమైన సినిమా కెమెరా. 8కే లార్జ్ ఫార్మాట్ లేదా 6కే ఎస్35 షూట్ చేయగల అద్భుతమైన మల్టీ-ఫార్మాట్ 8కే సెన్సార్‌ను కలిగి ఉంది. దీంతో వీడియో క్వాలిటీ సినిమా రేంజ్ లో ఉంటుంది. వీడియో క్వాలిటీ బాగుంటేనే వ్యూస్ ఎక్కువగా వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అందుకే యూట్యూబర్లు, వ్లాగర్స్ హై క్వాలిటీ కెమెరాలను వినియోగిస్తుంటారు. విలేజ్ కుకింగ్ ఛానెల్ వీడియోస్ షూట్ చేసే వారు 22 మిలియన్లకు పైగా సబ్ స్క్రైబర్లను కలిగి ఉన్నారు. దీంతో వీరు లక్షల రూపాయలను పొందుతున్నారు.