iDreamPost
android-app
ios-app

ప్రపంచంలోనే తొలిసారిగా.. సోలార్ సైకిల్స్ వచ్చేస్తున్నాయ్!

Solar Powered Cycle: ఇప్పటివరకు విద్యుత్ వాహనాలనే చూశారు. కానీ, అతి త్వరలో సోలార్ సైకిల్ వచ్చేస్తున్నాయి.

Solar Powered Cycle: ఇప్పటివరకు విద్యుత్ వాహనాలనే చూశారు. కానీ, అతి త్వరలో సోలార్ సైకిల్ వచ్చేస్తున్నాయి.

ప్రపంచంలోనే తొలిసారిగా.. సోలార్ సైకిల్స్ వచ్చేస్తున్నాయ్!

ప్రస్తుతం అందరూ పెట్రోల్, డీజిల్ వంటి ఇంధనాలపై నడిచే వాహనాలను వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. దాదాపుగా అంతా ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేసేందుకే మొగ్గు చూపుతున్నారు. భారీగా పెరుగుతున్న ఇంధన ధరలు కావచ్చు, పర్యావరణహితం కోసం కావచ్చు విద్యుత్ వాహనాలు కొనుగోలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు అలాంటి వారికి సోలార్ సైకిల్స్ రూపంలో మరో ఆప్షన్ వస్తోంది. సిటీల్లో ఉండి రోజుకు 10 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేసే వారికి ఈ సోలార్ సైకిల్స్ బెస్ట్ ఆప్షన్ గా కూడా చెప్పచ్చు. ప్రపంచంలోనే తొలిసారి ఈ సోలార్ సైకిల్స్ ని తీసుకురాబోతున్నారు. అది కూడా మన ఇండియాలోనే అది ఆవిష్కృతం కాబోతోంది.

ప్రపంచంలోనే తొలిసారి సోలార్ శక్తితో నడిచే సైకిల్స్ రాబోతున్నాయి. ఈ సైకిల్స్ ను మీరు విద్యుత్ వాహనంలా కూడా వాడుకోవచ్చు. ఈ అద్భుతాన్ని బరోడా ఎలక్ట్రిక్ మీటర్స్ లిమిటెడ్ కంపెనీ రూపొందిస్తోంది. గతంలో ఈ కంపెనీ వాళ్లు గుజరాత్ లోని ఇళ్లకు అమర్చిన ఎనర్జీ మీటర్లను కూడా తయారు చేసింది. అయితే ఈ ప్రాజెక్టులో బరోడా కంపెనీ మాత్రమే కాకుండా.. వల్లభ్ విద్యానగర్ లోని బిర్లా విశ్వకర్మ మహా విద్యాలయం స్టూడెంట్స్ కీ రోల్ ప్లే చేశారు. ఆ విద్యార్థుల కృషితోనే ఈ సోలార్ సైకిల్ ప్రాజెక్ట్ ఒక స్టార్టప్ గా ప్రాణం పోసుకుంది.

వరల్డ్ వైడ్ ఫస్ట్ సోలార్ సైకిల్ రోలౌట్, డిస్ట్రప్టివ్ ఇన్నోవేషన్ ఇన్ ఎలక్ట్రిక్ మొబిలిటీ పేరుతో దీనిని ప్రారంభించారు. ఈ ప్రాజెక్టుకి సంబంధించి నమూనాలను.. పితార్థ్ సోలంకి, రుషీ షా, మెహతా, ముస్తఫా మున్షీ అనే నలుగురు విద్యార్థులు రూపొందించారు. సామాన్యులు మాత్రమే కాకుండా.. ఈ సోలార్ సైకిల్ ప్రాజెక్ట్ పై పర్యారవణ వేత్తలు, ప్రభుత్వ అధికారులు ప్రశంసలు కురిపించారు. ఈ నలుగురు విద్యార్థుల కృషిని, ఆలోచనలను, తెలివితేటలను ప్రత్యేకంగా కొనియాడారు. ఈ సోలార్ సైకిల్ మైక్రో కంట్రోలర్ ఆధారిత బ్యాటరీ ఛార్జ్ కంట్రోలర్ ను అమర్చారు. అంతేకాకుండా 40 వాట్స్ సోలార్ ప్యానెల్స్ ఫిక్స్ చేశారు.

ఈ సోలార్ సైకిల్ 12 వోల్ట్స్, 40 వోల్ట్స్ వంటి తక్కువ వోల్టేజీలతో పని చేస్తుంది. ఈ సైకిల్ లో 180 వోల్ట్స్ బ్యాటరీని పూర్తిగా ఛార్చ్ చేసేందుకు గరిష్టంగా 5 గంటల వరకు సమయం పడుతుంది. ఈ సైకిల్స్ ని తయారు చేయడానికి విద్యార్థులకు రెండేళ్ల సమయం పట్టిందన్నారు. ఈ సోలార్ సైకిల్స్ పై భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ వల్ల పర్యావరణాన్ని కాపాడుకోవచ్చు అని అందరూ నమ్ముతున్నారు. ఈ సోలార్ సైకిల్ క్లిక్ అయితే సమీప దూరాలకు వీటినే వినియోగిస్తారు. అలాంటప్పుడు సిటీల్లో చాలావరకు బైకుల వాడకం తగ్గిపోతుంది. తద్వారా పొల్యూషన్ కూడా తగ్గుతుంది అంటూ పర్యావరణ శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ సోలార్ సైకిల్స్ కి ఆర్డర్స్ కూడా భారీ సంఖ్యలోనే వస్తాయని అంచనాలు వేస్తున్నారు. మరి.. సోలార్ శక్తితో నడిచే ఈ సైకిల్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి