iDreamPost
android-app
ios-app

17 వేల స్మార్ట్ ఫోన్.. 10 వేలకే.. పైసా వసూల్ డీల్ ఇది!

  • Published Feb 28, 2024 | 9:32 PM Updated Updated Feb 28, 2024 | 9:32 PM

Price Drop On 5G SmartPhone: బడ్జెట్ ధరలోనే 5జీ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలి అనుకునే వారికి ఇప్పుడు క్రేజీ ఆఫర్ అయితే అందుబాటులో ఉంది.

Price Drop On 5G SmartPhone: బడ్జెట్ ధరలోనే 5జీ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలి అనుకునే వారికి ఇప్పుడు క్రేజీ ఆఫర్ అయితే అందుబాటులో ఉంది.

  • Published Feb 28, 2024 | 9:32 PMUpdated Feb 28, 2024 | 9:32 PM
17 వేల స్మార్ట్ ఫోన్.. 10 వేలకే.. పైసా వసూల్ డీల్ ఇది!

స్మార్ట్ ఫోన్ కొనుక్కోవాలి అనుకునేవారంతా కచ్చితంగా 5జీ ఫోన్ అయి ఉండాలి అని కోరుకుంటున్నారు. ఎందుకంటే ఫోన్ అంటే ప్రతిసారి మార్చుకునేది కాదు కాబట్టి. ఇప్పుడు లేటెస్ట్ ఫోన్లు అన్నీ 5జీ ఫోన్లే కాబట్టి అంతా అవే కొనుక్కోవాలి అనుకుంటున్నారు. అయితే 5జీ ఫోన్ అంటే కచ్చితంగా దాని ధర రూ.15 వేలకు పైగానే ఉంటుంది. చాలామందికి అంత పెట్టి కొనుగోలు చేయాలి అంటే కష్టంగా అనిపించవచ్చు. అలాంటి వారి కోసం ఒక క్రేజీ ఆఫర్ అందుబాటులో ఉంది. మీరు కేవలం రూ.10 వేలకే అదిరిపోయే ఫీచర్లు ఉన్న 5జీ ఫోన్ ని కొనుగోలు చేయచ్చు.

మంచి ఫీచర్లతో బడ్జెట్ లో 5జీ స్మార్ట్ ఫోన్ కొనాలి అనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పాలి. ప్రస్తుతం పోకో ఎం6 ప్రో 5జీ స్మార్ట్ ఫోన్ పై ఈ క్రేజీ ఆఫర్ నడుస్తోంది. ఈ ఫోన్ మామూలుగానే బడ్జెట్ రేంజ్ లో అందుబాటులో ఉంది. ఈ వేరియంట్ 6జీబీ ర్యామ్ 128 జీబీ స్టోరేజ్ తో వస్తోంది. ఈ పోకో ఎం6 ప్రో 5జీ ఫోన్ ఎమ్మార్పీ రూ.16,999 కాగా ప్రస్తుతం డిస్కౌంట్ నడుస్తోంది. ప్రముఖ ఇ-కామర్స్ వెబ్ సైట్ లో ఈ ఫోన్ పై 35 శాతం డిస్కౌంట్ లభిస్తోంది. అంటే ఈ ఫోన్ మీకు రూ. కేవలం రూ.10,999కే లభిస్తుంది. అయితే ఈ ఫోన్ పై బ్యాంక్ ఆఫర్స్ కూడా ఉన్నాయి. మీకు ఎస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఉంటే.. మీరు ఈఎంఐ ట్రాన్సాక్షన్ మీద అదనంగా రూ.1000 డిస్కౌంట్ ని పొందచ్చు. అంటే మీకు ఈ ఫోన్ కేవలం రూ.9,999కే లభిస్తుంది. అయితే ఇంత తక్కువకు వస్తోంది కదా అని ఈ ఫోన్ లో ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ ఎలా ఉంటాయో అనే అనుమానం అక్కర్లేదు.

ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ విషయానికి వస్తే.. ఇది ప్రీమియం గ్లాస్ డిజైన్ తో వస్తోంది. ఇది స్నాప్ డ్రాగన్ 4 జెన్ 2.. ఫ్లాగ్ షిప్ లెవల్ 4ఎన్ఎం ప్రాసెసర్ తో వస్తోంది. ఈ ఫోన్ 6.79 లార్డ్ డిస్ ప్లేతో వస్తోంది. ఇందులో మీకు 90 హెట్జ్ రిఫ్రెష్ రేట్ కూడా ఉంటుంది. ఈ పోకో ఎం6 ప్రో 5జీ స్మార్ట్ ఫోన్ 5000 ఎంఏహెచ్ లార్జ్ బ్యాటరీతో వస్తుంది. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే ఒక రోజు మొత్తం వాడుకోవచ్చు. అలాగే ఇది 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ తో వస్తోంది. ఈ ఛార్జర్ తో ఫోన్ ని ఫుల్ ఛార్జ్ చేయడానికి గంట కంటే ఎక్కువ సమయం పట్టకపోవచ్చు.

ఇంక ఈ పోకో ఎం6 ప్రో 5జీ స్మార్ట్ ఫోన్లో లో వర్చువల్ ర్యామ్ ఆప్షన్ కూడా ఉంది. అంటే మీరు 6 జీబీ ర్యామ్ ఫోన్ ని కొనుగోలు చేశారు. మీరు దానికి అదనంగా ఇంకో 6 జీబీ ర్యామ్ ని వర్చువల్ గా పొందవచ్చు. అంటే మీరు మొత్తం మీ ఫోన్ లో 12 జీబీ ర్యామ్ ని కలిగి ఉన్నట్లు అనమాట. ఇంక ఈ ఫోన్ కెమెరా గురించి కూడా ప్రత్యేకందా చెప్పుకోవాలి. ఈ ఫోన్ లో బ్యాక్ సైడ్ 50 ఎంపీ ఏఐ డ్యూయల్ కెమెరాలు ఉన్నాయి. అలాగే పక్కనే ఫ్లాష్ లైట్ కూడా ఉంది. ఇంక 8 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఈ ఫోన్ కి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. ఈ ఫోన్ బ్యాక్ సైడ్ డిజైన్ చూస్తే.. అచ్చం ఐఫోన్ ని చూసినట్లే ఉంటుంది. మరి.. ఈ అదిరిపోయే పోకో ఎం6 5జీ స్మార్ట్ ఫోన్ ని కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

Jojobet GirişJojobetşanlıurfa konteynerbetciobetcioGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetStarzbetStarzbetJojobetjojobet güncel girişgrandpashabetgrandpashabetgrandpashabetganobetcasibom girişbetciojojobetgrandpashabet girişcasibom