iDreamPost
android-app
ios-app

లక్షల మంది ఎదురు చూస్తున్న ఫోన్ వచ్చేసింది.. సేల్స్ స్టార్ట్ అయ్యాయి..

CMF Phone 1 Sales Started-Where To Buy This Phone With Discount: యూనిక్ స్మార్ట్ ఫోన్ గా భారత మార్కెట్లో లాంఛ్ అయిన నథింగ్ కంపెనీ సీఎంఎఫ్ ఫోన్ 1 సేల్స్ ఎట్టకేలకు ప్రారంభమయ్యాయి. ప్రముఖ ఈ కామర్స్ వెబ్ సైట్ లో అందుబాటులోకి వచ్చాయి. మరి ఈ ఫోన్ ని తక్కువ ధరకు ఎలా దక్కించుకోవాలి? ఏమేమీ ఆఫర్లు ఉన్నాయి? వంటి వివరాలు మీ కోసం.

CMF Phone 1 Sales Started-Where To Buy This Phone With Discount: యూనిక్ స్మార్ట్ ఫోన్ గా భారత మార్కెట్లో లాంఛ్ అయిన నథింగ్ కంపెనీ సీఎంఎఫ్ ఫోన్ 1 సేల్స్ ఎట్టకేలకు ప్రారంభమయ్యాయి. ప్రముఖ ఈ కామర్స్ వెబ్ సైట్ లో అందుబాటులోకి వచ్చాయి. మరి ఈ ఫోన్ ని తక్కువ ధరకు ఎలా దక్కించుకోవాలి? ఏమేమీ ఆఫర్లు ఉన్నాయి? వంటి వివరాలు మీ కోసం.

లక్షల మంది ఎదురు చూస్తున్న ఫోన్ వచ్చేసింది.. సేల్స్ స్టార్ట్ అయ్యాయి..

నథింగ్ కంపెనీ కనీవినీ ఎరుగని రీతిలో.. ఎవరూ ఊహించని విధంగా సరికొత్త ఫోన్ ని లాంఛ్ చేసింది. నాలుగు రోజుల క్రితం అంటే జూలై 8న నథింగ్ కంపెనీ సీఎంఎఫ్ ఫోన్ 1 భారత మార్కెట్లో పరిచయం చేసింది. ఈ ఫోన్ కోసం లక్షల మంది యూజర్లు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే ఇదొక గేమ్ ఛేంజర్ ఫోన్. ఇప్పటి వరకూ ఇలాంటి ఫోన్ రాలేదు. ఇందులో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. వాటిలో మొదటిది ఇది బ్యాక్ ప్యానెల్స్ ని మార్చుకునే ఆప్షన్ తో వస్తుంది. అంటే ఫోన్ వెనుక భాగంలో ఉండే బ్యాక్ కవర్ ని నచ్చిన రంగులో ఉండేలా ప్లాన్ చేసుకోవచ్చు. మీరు ఏ కలర్ ఫోన్ కొన్నా గానీ ఆ తర్వాత బ్యాక్ ప్యానెల్ ని ఆరెంజ్ కలర్, నీలం రంగు, నలుపు రంగు, లైట్ గ్రీన్ కలర్స్ లో మార్చుకోవచ్చు. బ్యాక్ ప్యానెల్ ని మార్చుకునేందుకు ఒక మినీ స్క్రూడ్రైవర్ ని కూడా ఇచ్చారు.

అలానే ఈ ఫోన్ కి ఒక స్టాండ్ ని కూడా ఇచ్చారు. టేబుల్ మీద లేదా వంట గదిలో ఒక చోట పెట్టుకుని ఏదైనా వర్క్ చేసుకుంటూ ఫోన్ లో వీడియో కాల్ మాట్లాడుకోవడానికైనా, వీడియోలు చూడ్డానికైనా ఈ స్టాండ్ ఉపయోగపడుతుంది. ఈ స్టాండ్ అవసరం లేదనుకుంటే మినీ స్క్రూడ్రైవర్ తో తీసేయవచ్చు. అలానే ఫోన్ చేతిలోంచి జారి పడిపోతుందేమో అన్న టెన్షన్ లేకుండా దీనికొక ల్యాన్ యార్డ్ ని ప్రొవైడ్ చేశారు. ఇది మెడలో వేసుకోవడం వల్ల మీ ఫోన్ కింద పడిపోతుందన్న టెన్షన్ ఉండదు. టూవీలర్స్ కి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇందులో ఉన్న మరో ప్రత్యేకత ఏంటంటే.. క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు వంటివి క్యారీ చేయడానికి ఫోన్ వెనుక ఒక కార్డు కేసుని ఇచ్చారు. ఇందులో 3 కార్డుల వరకూ పెట్టుకోవచ్చు. ఎమర్జెన్సీ సమయంలో ఉపయోగపడతాయి. డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ వంటివి కూడా పెట్టుకోవచ్చు. ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయి కాబట్టే ఈ ఫోన్ ని కొనేందుకు జనాలు ఎగబడుతున్నారు.

ఇది ప్రముఖ ఈ కామర్స్ వెబ్ సైట్ అయిన ఫ్లిప్ కార్ట్ లో అందుబాటులో ఉంది. దీని అసలు ధర రూ. 19,999 కాగా లాంఛింగ్ ఆఫర్ లో భాగంగా రూ. 15,999కే లభిస్తుంది. ఫ్లిప్ కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే 5 శాతం క్యాష్ బ్యాక్ వస్తుంది. యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు, క్రెడిట్ కార్డు ఈఎంఐ మీద 1000 రూపాయల ఫ్లాట్ డిస్కౌంట్ లభిస్తుంది. హెచ్డీఎఫ్సీ క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డుతో కొనుగోలు చేస్తే 1000 రూపాయల తగ్గింపు లభిస్తుంది. మీ దగ్గర ఫ్లిప్ కార్ట్ యాక్సిస్ క్రెడిట్ కార్డు ఉంటే ఫోన్ మీద 799 రూపాయలు తగ్గుతుంది. అదే డైరెక్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు లేదా హెచ్డీఎఫ్సీ క్రెడిట్ కార్డు ఉంటే కనుక 1000 రూపాయల తగ్గింపు లభిస్తుంది. దీంతో మీరు ఈ నథింగ్ సీఎంఎఫ్ ఫోన్ 1ని 14,999 రూపాయలకే సొంతం చేసుకోవచ్చు.

ఇక ఆఫర్ లో భాగంగా మీకు రెండు కూపన్ కోడ్స్ కూడా వస్తాయి. సీఎంఎఫ్ వాచ్ ప్రో మీద 1000 రూపాయల కూపన్, అలానే నథింగ్ బడ్స్ ప్రో2 మీద 1000 రూపాయల కూపన్లు వస్తాయి. అంటే మీరు నథింగ్ బడ్స్ ని లేదా వాచ్ ప్రో గానీ కొనుగోలు చేస్తే 1000 రూపాయలు తగ్గింపు పొందవచ్చు. నథింగ్ బడ్స్ ప్రో 2 ధర రూ. 3,499 ఉండగా.. వాచ్ ప్రో ధర రూ. 4,499గా ఉంది. ఈ రెండిటి మీద చెరో 1000 రూపాయలు తగ్గింపు పొందవచ్చు. ఆన్ లైన్ లో ఇప్పుడు ఈ ఫోన్ ని కొనుగోలు చేస్తే రూ. 2,999 విలువైన సీఎంఎఫ్ ఛార్జర్ ని రూ. 1,999కే పొందవచ్చు. అలానే రూ. 799 విలువైన సీఎంఎఫ్ కార్డు హోల్డర్ ని రూ. 499కే సొంతం చేసుకోవచ్చు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి