iDreamPost
android-app
ios-app

ఇలాంటి ఫోన్‌ని అస్సలు ఊహించి ఉండరు.. గేమ్ ఛేంజర్ మొబైల్ ఇది..

  • Published Jul 08, 2024 | 4:39 PM Updated Updated Jul 08, 2024 | 4:39 PM

CMF Phone 1: చాలా కంపెనీలు స్మార్ట్ ఫోన్లను తయారు చేస్తాయి. కానీ యూజర్ కి కిక్ ఇచ్చే స్మార్ట్ ఫోన్లను కొన్ని కంపెనీలే తయారు చేయగలవు. వాటిలో నథింగ్ కంపెనీ ఒకటి. తాజాగా నథింగ్ కంపెనీ ఒక గేమ్ ఛేంజర్ ఫోన్ ని లాంఛ్ చేసింది. అదే సీఎంఎఫ్ ఫోన్ 1. దీని ప్రత్యేకతలు చూస్తే నిజంగా మైండ్ బ్లోయింగ్ అంతే. అంతలా ఉన్నాయి దీని ఫీచర్స్, స్పెసిఫికేషన్స్. 

CMF Phone 1: చాలా కంపెనీలు స్మార్ట్ ఫోన్లను తయారు చేస్తాయి. కానీ యూజర్ కి కిక్ ఇచ్చే స్మార్ట్ ఫోన్లను కొన్ని కంపెనీలే తయారు చేయగలవు. వాటిలో నథింగ్ కంపెనీ ఒకటి. తాజాగా నథింగ్ కంపెనీ ఒక గేమ్ ఛేంజర్ ఫోన్ ని లాంఛ్ చేసింది. అదే సీఎంఎఫ్ ఫోన్ 1. దీని ప్రత్యేకతలు చూస్తే నిజంగా మైండ్ బ్లోయింగ్ అంతే. అంతలా ఉన్నాయి దీని ఫీచర్స్, స్పెసిఫికేషన్స్. 

ఇలాంటి ఫోన్‌ని అస్సలు ఊహించి ఉండరు.. గేమ్ ఛేంజర్ మొబైల్ ఇది..

మీరు ఫోన్ కొన్న తర్వాత భద్రంగా వాడుకోవాలి, కింద పడిపోకుండా చూసుకోవాలి అని భావిస్తే కనుక ఈ ఫోన్ మీకు బెస్ట్ ఆప్షన్ గా నిలుస్తుంది. ఎందుకంటే ఇది అడ్వాన్స్డ్ గేమ్ ఛేంజర్ మొబైల్ ఇది. ఒక ఫోన్ కొన్నాక బ్యాక్ ప్యానెల్ ని మార్చుకోవడం కుదరదు. కానీ ఈ ఫోన్ కి బ్యాక్ ప్యానెల్ నచ్చిన కలర్ ది పెట్టుకోవచ్చు. అంతేనా ఇంకా ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి లోపల. మీడియా టెక్ డైమెన్సిటీ 7300 5జీ 8 కోర్ ప్రాసెసర్ తో వస్తుంది. 4 ఎన్ఎం టీఎస్ఎంసీ ప్రాసెస్ తో వస్తుంది. ఇది రెండు వేరియంట్లలో వస్తుంది. 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ స్పేస్ తో, అలానే 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ స్పేస్ తో వస్తుంది. అదనంగా 8 జీబీ ర్యామ్ బూస్టర్ కూడా ఉంటుంది. వర్చువల్ ర్యామ్ అన్న మాట. అంటే మీరు ర్యామ్ ని అదనంగా 8 జీబీ వరకూ పెంచుకోవచ్చు. ఇక స్టోరేజ్ స్పేస్ ని 2 టీబీ వరకూ పెంచుకోవచ్చు.

ఇది 9 బ్యాండ్ డ్యూయల్ 5జీ, బ్లూటూత్ 5.3, వైఫై 6, ఐపీ 52 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ వంటి ఫీచర్స్ తో వస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 14తో నథింగ్ ఓఎస్ 2.6తో వస్తుంది. రెండేళ్ల పాటు మేజర్ ఆండ్రాయిడ్ అప్డేట్స్, మూడేళ్లు సెక్యూరిటీ అప్డేట్స్ ని అందిస్తుంది కంపెనీ. ఇది 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. ఒకసారి ఛార్జ్ చేస్తే సింగిల్ ఛార్జ్ తో 23 గంటల పాటు వీడియోలు చూసుకోవచ్చు. 45.4 గంటల పాటు మ్యూజిక్ వినచ్చు. 43.6 గంటల పాటు కాల్స్ మాట్లాడుకోవచ్చు. 22.6 గంటల పాటు యూట్యూబ్ లో వీడియోలు చూసుకోవచ్చు. 15.6 గంటల పాటు ఇన్స్టాగ్రామ్ వాడుకోవచ్చు. సింగిల్ ఛార్జ్ తో రెండు రోజుల పాటు ఫోన్ ఆన్ లో ఉంటుందని కంపెనీ క్లెయిమ్ చేస్తుంది. 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ ని సపోర్ట్ చేస్తుంది. 20 నిమిషాల్లోనే 50 శాతం ఛార్జింగ్ ఎక్కేస్తుంది. 5 వాట్ రివర్స్ వైర్డ్ ఛార్జింగ్ ని సపోర్ట్ చేస్తుంది. వైర్ లెస్ ఛార్జింగ్ లేదు.

ఇది 6.67 ఇంచెస్ అమోలెడ్ డిస్ప్లేతో, 120 హెడ్జెస్ అడాప్టివ్ రీఫ్రెష్ రేటుతో వస్తుంది. 2000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఫీచర్ ని అయితే ఇందులో ఇచ్చారు. ఇందులో 50 మెగా పిక్సెల్ సోనీ రేర్ కెమెరా, 16 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. ఈ కెమెరాల్లో అల్ట్రా ఎక్స్డీఆర్, ఏఐ వివిడ్ మోడ్ ఆప్షన్స్ ఉన్నాయి. వివిధ ఫోన్ కేసులు, ఫంక్షనల్ యాక్ససరీస్ ని పెట్టుకునేలా అడాప్టబుల్ డివైజెస్ ఫీచర్ తో ఈ ఫోన్ ని రూపొందించారు. ఈ ఫోన్ లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే.. ఫోన్ ని టేబుల్ మీద పెట్టుకుని సినిమాలు చూడడానికి ఫోన్ వెనుక ఒక స్టాండ్ ని ఇచ్చారు. ల్యాండ్ స్కేప్ మోడ్ కి, పోర్ట్రైట్ మోడ్ కి రెండిటికీ సపోర్ట్ చేసేలా స్టాండ్ ని ఇచ్చారు. అలానే ఒక ల్యాన్ యార్డ్ ని ప్రొవైడ్ చేశారు.

ఇది పొడవైన తాడుతో వస్తుంది. దీన్ని ఫోన్ బ్యాక్ సైడ్ ఎటాచ్ చేసి మెడలో తగిలించుకోవచ్చు. దీని వల్ల ఫోన్ కింద పడిపోకుండా సేఫ్ గా ఉంటుంది. అలానే ఫోన్ బ్యాక్ ప్యానెల్ ని మార్చుకోవచ్చు. నచ్చిన రంగు బ్యాక్ ప్యానెల్ ని ఫిక్స్ చేసుకునేలా రిమూవబుల్ బ్యాక్ ప్యానెల్ ని ఇచ్చారు. స్క్రూ విప్పితే బ్యాక్ ప్యానెల్ బయటకు వచ్చేస్తుంది. ఇందులో ఉన్న మరో ప్రత్యేకత ఏంటంటే.. ఈ ఫోన్ వెనుక భాగంలో ఒక కార్డు కేస్ ని ఇచ్చారు. ఈ కార్డు కేసులో మూడు క్రెడిట్ కార్డులు లేదా డెబిట్ కార్డులు, లేదా లైసెన్స్, ఆర్సీ వంటివి పెట్టుకోవచ్చు. ఇది నాలుగు రంగుల్లో అందుబాటులో ఉంది. నలుపు, ఆరెంజ్, నీలం, లైట్ గ్రీన్ రంగుల్లో లభిస్తుంది. ఫ్లిప్ కార్ట్ లో దీని అసలు ధర రూ. 19,999 ఉండగా.. ఆఫర్ లో 15,999 రూపాయలుగా నిర్ణయించింది. ఈ ఫోన్ ఇంకా అందుబాటులోకి రాలేదు. త్వరలోనే మార్కెట్లోకి రాబోతుంది.

ఈ ఫోన్ కొంటే వచ్చేవి ఇవే:

  • సీఎంఎఫ్ ఫోన్ 1
  • సీఎంఎఫ్ కేబుల్ (యూఎస్బీ-సీ టూ యూఎస్బీ-సీ)
  • సేఫ్టీ ఇన్ఫర్మేషన్, వారంటీ కార్డు 
  • స్క్రీన్ ప్రొటెక్టర్ 
  • సిమ్ ట్రే ఎజెక్టర్

ఈ ఫోన్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు ఈ లింక్ పై క్లిక్ చేయండి.