Dharani
Budget Smartphone: తక్కువ ధరలో బెస్ట్ ఫీచర్స్ ఉన్న స్మార్ట్ ఫోన్ కోసం ఎదురు చూస్తున్నారా.. అయితే ఇది మీ కోసమే. ఏడు వేల రూపాయల్లోపు బెస్ట్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్స్ లిస్ట్ మీకోసం ఇచ్చాం. దీనిపై ఓ లుక్కేయండి
Budget Smartphone: తక్కువ ధరలో బెస్ట్ ఫీచర్స్ ఉన్న స్మార్ట్ ఫోన్ కోసం ఎదురు చూస్తున్నారా.. అయితే ఇది మీ కోసమే. ఏడు వేల రూపాయల్లోపు బెస్ట్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్స్ లిస్ట్ మీకోసం ఇచ్చాం. దీనిపై ఓ లుక్కేయండి
Dharani
నేటి కాలంలో స్మార్ట్ ఫోన్ అనేది నిత్యవసరాల్లో భాగంగా మారింది. అసలు మొబైల్ లేకుండా ఒక్క రోజు కాదు కదా.. కనీసం గంట సేపు కూడా ఉండలేనంతగా కొందరు దీనికి అలవాటు పడ్డారు. ఇక స్మార్ట్ ఫోన్ వల్ల లాభాలు ఎన్ని ఉన్నాయో.. నష్టాలు కూడా అదే స్థాయిలో ఉంటాయి. మంచికి వాడితే.. స్మార్ట్ ఫోన్‌తో జీవితంలో ఉన్నత శిఖరాలు చేరవచ్చు.. లేదంటే.. పాతాళానికి పడిపోతాం. ఇక లాభనష్టాల సంగతి పక్కకు పెడితే.. స్మార్ట్ ఫోన్ ప్రతి ఒక్కరికి అవసరం అయిన నేపథ్యంలో.. బడ్జెట్ ధరలో అద్భుతైమన ఫీచర్లు ఉండే స్మార్ట్ ఫోన్స్ అందుబాటులో ఉన్నాయి. ఏడు వేల లోపే ఈ మొబైల్స్ వస్తున్నాయి. మరి అవి ఏంటో మీరు ఓ లుక్కేయండి.
రూ. 7వేల బడ్జెట్‌లో అందుబాటులో ఉన్న వాటిల్లో ఉత్తమమైన స్మార్ట్ ఫోన్ అంటే.. మోటోరోలా మోటోజీ04 అంటున్నారు టెక్ నిపుణులు. ఇక ఈ ఫోన్ ధర రూ. 6,999గా ఉంది. ఫీచర్ల విషయానికొస్తే ఈ ఫోన్‌లో 6.6 ఇంచెస్‌తో కూడిన హెచ్‌డీ ప్లస్ స్క్రీన్, 90 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌ను అందించారు. ఈ మొబైల్ డ్యూయల్ కెమెరా సెటప్‌తో రానుంది. ఇక ఇందులో యూనిసాక్ టీ606 చిప్‌సెట్ ప్రాసెసర్‌ను అందించారు. 10 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5000 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీతో ఈ స్మార్ట్ ఫోన్ రానుంది. ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో మోటోజీ04 స్మార్ట్ ఫోన్ పని చేస్తుంది.
తక్కువ బడ్జెట్‌లో అందుబాటులో ఉన్న మరో బెస్ట్ స్మార్ట్ అంటే.. సామ్‌సంగ్ గ్యాలక్సీ ఎఫ్04 ఒకటి అంటున్నారు టెక్ నిపుణులు. ఈ ఫోన్ ధర రూ. 5,999గా ఉంది. ఇక ఈ మొబైల్ ఫీచర్ల విషయానికొస్తే దీనిలో 6.5 ఇంచెస్‌తో కూడిన ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లేను అందించారు. 13 ఎంపీ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్, హీలియో పీ35 ఎస్‌ఓసీ చిప్‌సెట్‌తో రానుంది. ఇక ఇందులో 5000ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు.
ఇక ఏడు వేల రూపాయల ధరలో బెస్ట్ స్మార్ట్ ఫోన్ అంటే.. టెక్నో స్పార్క్ జీ0 2024 కూడా ఉంటుంది. దీని ధర రూ. 6,799గా నిర్ణయించారు. ఈ ఫోన్‌లో 6.56 ఇంచెస్‌తో కూడిన డిస్‌ప్లే ఉంటుంది. 90హెచ్‌జడ్ రిఫ్రెష్ రేట్‌తో రానుంది. ఈ మొబైల్‌లో 13 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరాతో పాటు యూనిసాక్ టీ606 చిప్‌సెట్‌ను అందించారు. ఈ స్మార్ట్ ఫోన్‌లో 10 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5000 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీని ఇచ్చారు.
మరో బెస్ట్ బడ్జెట్ ఫోన్ అంటే.. ఇన్‌ఫినిక్స్ స్మార్ట్ 8 హెచ్‌డీ స్మార్ట్ ఫోన్. ఈమొబైల్ ధర రూ. 6,399గా నిర్ణయించారు. ఈ స్మార్ట్ ఫోన్‌లో 6.6 ఇంచెస్‌తో కూడిన హెచ్‌డీ ప్లస్ స్క్రీన్‌ను అందించారు. ఇది కూడా 90హెచ్‌జడ్ రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేస్తుంది. ఇక ఈ ఫోన్‌లో 13 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరాను అందించారు. అలాగే ఈ మొబైల్‌తో 10 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5000 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీని అందించారు.
ఏడు వేల రూపాయల ధరల్లో వచ్చే బెస్ట్ స్మార్ట్ ఫోన్ అంటే.. పోకో సీ55 కూడా. ఇక ఈ స్మార్ట్ ఫోన్ ధరను రూ. 5,999గా నిర్ణయించారు. పోకో సీ55 ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.71 ఇంచెస్‌తో కూడిన హెచ్‌డీ ప్లస్ స్క్రీన్, 50 ఎంపీ డ్యూయల్ రియర్ కెమెరాతో వస్తుంది. ఇందులో హెలియో జీ85 చిప్‌సెట్‌ను అందించారు. అలాగే ఈ స్మార్ట్ ఫోన్‌తో 10 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5000 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీని అందించారు.