iDreamPost
android-app
ios-app

Flipkartలో ఆఫర్ల జాతర.. కాస్ట్ లీ ఫోన్ లపై కళ్ళు చెదిరే డిస్కౌంట్స్.. త్వరపడండి..!

  • Published Oct 28, 2024 | 3:43 PM Updated Updated Oct 28, 2024 | 3:43 PM

Flipkart: ఫ్లిప్ కార్ట్ తాజాగా బిగ్ దివాళి సేల్ ని ప్రకటించింది. ఈ సేల్ లో స్మార్ట్ ఫోన్లపై భారీ ఆఫర్లను అందిస్తుంది.

Flipkart: ఫ్లిప్ కార్ట్ తాజాగా బిగ్ దివాళి సేల్ ని ప్రకటించింది. ఈ సేల్ లో స్మార్ట్ ఫోన్లపై భారీ ఆఫర్లను అందిస్తుంది.

Flipkartలో ఆఫర్ల జాతర.. కాస్ట్ లీ ఫోన్ లపై కళ్ళు చెదిరే డిస్కౌంట్స్.. త్వరపడండి..!

ఫ్లిప్ కార్ట్ ఎప్పటికప్పుడు కొత్త కొత్త సేల్‌తో తన కస్టమర్లను అట్రాక్ట్ చేస్తుంది. ఫెస్టివల్ సీజన్ వచ్చిందంటే చాలు ఆఫర్ల జాతర మొదలు పెడుతుంది. భారీ ఆఫర్లు ప్రకటించి అదరగొట్టేస్తుంది. రీసెంట్ గా దసరా సందర్భంగా స్మార్ట్‌ఫోన్లు, ఫ్యాషన్, ఇతర వస్తువులపై అదిరిపోయే డిస్కౌంట్లు అందించింది. అయితే ఇప్పుడు అంతకు మించి అనేలా సూపర్ ఆఫర్లు ఇస్తుంది. ఇందులో భాగంగా మరో అదిరిపోయే సేల్ తీసుకొచ్చింది. దీపావళి పండుగ సందర్భంగా ‘బిగ్ దివాళి సేల్’ను ప్రకటించింది ఫ్లిప్ కార్ట్. ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు, ఫ్యాషన్, బ్యూటీ, హోమ్ అండ్ కిచెన్‌ ప్రాడక్ట్ లపై సూపర్ డిస్కౌంట్లు అందిస్తుంది. ముఖ్యంగా కొత్తగా స్మార్ట్ ఫోన్స్ కొనాలనుకునే వారికి దీనికి మించి సేల్ లేదనేలా భారీ డిస్కౌంట్స్ ఇస్తుంది. ఇక ఇప్పుడు ఏ ఫోన్ పై ఎంత డిస్కౌంట్ ఉందో పూర్తిగా తెలుసుకుందాం.

మీరు ఐఫోన్ లవర్స్ అయితే ఈ సేల్ ని అస్సలు మిస్ కావొద్దు. ఎందుకంటే ఈ సేల్ లో ఐఫోన్ 15 ప్లస్ స్మార్ట్‌ఫోన్ పై భారీ డిస్కౌంట్ ఉంది. దీని అసలు ధర రూ.79,999 ఉండగా.. ఈ సేల్‌లో అన్నీ ఆఫర్లతో కలిపి కేవలం రూ.59,249కే కొనుక్కోవచ్చు. అంటే మీకు ఏకంగా 20 వేలకు పైగా మీకు డిస్కౌంట్ లభిస్తుంది. ఇన్‌ఫినిక్స్ హాట్ 50 5జీ (8/128జీబీ) ధర రూ.14,999 కాగా ఈ సే ల్ లో అన్నీ ఆఫర్లతో కలిపి కేవలం రూ.8,699కి పొందొచ్చు. శాంసంగ్ ఏ14 5జీ (4/128జీబీ) రూ.22,999 ఉండగా అన్నీ ఆఫర్లతో కలిపి కేవలం రూ.9,499కి కొనుక్కోవచ్చు. ఇక పోకో ఎం6 5జీ ఫోన్‌ రూ.11,999 ఉండగా అన్నీ ఆఫర్లు కలుపుకొని కేవలం రూ.7,199కి సొంతం చేసుకోవచ్చు. ఇక వివో టి3 లైట్ 5జీ ఫోన్ 15499/- ఉండగా దీనిని అన్నీ ఆఫర్లతో కలిపి కేవలం రూ.9,499కే కొనుగోలు చేసుకోవచ్చు. సిఎంఎఫ్ 1 (6/128జీబీ) ఫోన్ అసలు ధర రూ.19,999 కాగా ఈ సేల్ లో కేవలం రూ.12,999కే పొందొచ్చు. ఒప్పో కె12ఎక్స్ 5జీ ధర రూ.16,999 కాగా దీన్ని కేవలం రూ.10,999కే సొంతం చేసుకోవచ్చు. రూ.17,999 విలువ గల రియల్‌మి 12ఎక్స్ 5జీ (6/128జీబీ) స్మార్ట్ ఫోన్ ని ఈ సేల్‌లో రూ.11,499కి కొనుక్కోవచ్చు.

గూగుల్ పిక్సెల్ 8 (8/256జీబీ) రూ.75,999 ఉండగా దీన్ని అన్నీ ఆఫర్లతో కలిపి భారీ డిస్కౌంట్ తో కేవలం రూ.36,499కి కొనుక్కోవచ్చు. మోటో ఎడ్జ్ 50 ప్రో 12జీబీ వేరియంట్ రూ.41,999 కాగా ఈ సేల్ లో అన్నీ ఆఫర్లు కలుపుకొని కేవలం రూ.27,999లకే సొంతం చేసుకోవచ్చు. అలాగే వివో టీ3ఎక్స్ 5జీ ఫోన్‌ రూ.17,499 కాగా దీన్ని మనం కేవలం రూ.11,249కి కొనుక్కోవచ్చు. ఇక మోటో ఎడ్జ్50 ఫ్యూజన్ 8జీబీ వేరియంట్ అసలు ధర రూ.25,999 ఉండగా ఈ సేల్‌లో రూ.19,999కే సొంతం చేసుకోవచ్చు. ఈ సేల్‌లో శాంసంగ్ గెలాక్సీ ఎస్23 ఎఫ్ఈ స్మార్ట్‌ఫోన్‌ పై దిమ్మతిరిగే డిస్కౌంట్ ఆఫర్ ఉంది. దీని అసలు ధర రూ.79,999 ఉండగా.. ఇప్పుడు అన్నీ ఆఫర్లతో కలిపి కేవలం రూ.28,999లకే కొనుక్కోవచ్చు. నిజంగా కొత్త స్మార్ట్ ఫోన్ కొనాలనుకునేవారికి ఇంతకంటే మంచి సేల్ ఇంకోటి ఉండదనే చెప్పాలి. కాబట్టి ఇప్పుడే త్వరపడండి. మీ ఫేవరెట్ స్మార్ట్ ఫోన్ ని కొనుగోలు చెయ్యండి. ఈ సేల్ ని మిస్ కాకండి. ఇక ఈ ఫ్లిప్ కార్ట్ బిగ్ దివాలి సేల్ ఆఫర్స్ గురించి మీరేమి అనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişivermectin tabletMadridbetMadridbetMadridbetmeritbetCasibom GirişmeritbetbetvoleKingroyal girişcasibomgalabetJojobetHoliganbetJojobet GirişJojobet GirişCasibomjojobetjojobetcasibomcasibomjojobetJojobetMatadorbetMeritking