P Venkatesh
పల్సర్ లవర్స్ కు అదిరిపోయే బైక్ అందుబాటులోకి వచ్చింది. బజాజ్ కంపెనీ సరికొత్త బైక్ ను మార్కెట్ లోకి లాంచ్ చేసింది. అత్యాధునిక టెక్నాలజీతో ఎన్ఎస్400జెడ్ రిలీజ్ అయ్యింది.
పల్సర్ లవర్స్ కు అదిరిపోయే బైక్ అందుబాటులోకి వచ్చింది. బజాజ్ కంపెనీ సరికొత్త బైక్ ను మార్కెట్ లోకి లాంచ్ చేసింది. అత్యాధునిక టెక్నాలజీతో ఎన్ఎస్400జెడ్ రిలీజ్ అయ్యింది.
P Venkatesh
బజాజ్ పల్సర్ బైకులకు మార్కెట్ లో ఉండే క్రేజే వేరు. రైడింగ్ లో రారాజైన ఈ బైక్ లకు యూత్ ఫిదా అయిపోతుంటారు. మార్కెట్ లో ఎన్ని రకాల బైకులున్నప్పటికీ పల్సర్ బైకులు ఎప్పటికీ ప్రత్యేకమే. అయితే ఇప్పుడు పల్సర్ బైక్ ప్రియులకు మరో గుడ్ న్యూస్. బజాజ్ కంపెనీ సరికొత్త పల్సర్ బైక్ తో ముందుకొచ్చింది. 400సీసీ ఇంజిన్ సామార్ధ్యంతో, 40హెచ్ పీ పవర్ తో ఎన్ఎస్400జెడ్ అనే కొత్త బైక్ ను మార్కెట్ లోకి లాంఛ్ చేసింది. 6 గేర్ బాక్స్, డ్యూయల్ ఏబీఎస్, ట్రాక్షన్ కంట్రోల్, ఎల్ఈడీ హెడ్ ల్యాంప్, బ్లూటూత్, టర్న్ బై టర్న్ నావిగేషన్, మ్యూజిక్ కంట్రోల్,వంటి క్రేజీ ఫీచర్లను పొందుపరిచారు. గంటకు 154 కి.మీల వేగంతో ప్రయాణిస్తుందని బజాజ్ వెల్లడించింది. ఈ బైక్ ఎక్స్ షోరూం ధర రూ. 1.85 లక్షలుగా నిర్ణయించినట్లుగా కంపెనీ తెలిపింది.
ఎన్ఎస్400జెడ్ బైక్ లోని కొత్త ఫీచర్లు యూత్ ను కట్టిపడేస్తున్నాయి. ఇది లుక్ పరంగా ఎన్ఎస్200 బైక్ మాదిరిగా కనిపిస్తున్నప్పటికీ నయా టెక్నాలజీతో రూపుదిద్దుకుంది. సెంటర్‌లో ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్, టూ న్యూ లైటింగ్ బోల్ట్ ఎల్ఈడీ డీఆర్ఎల్స్‌తోపాటు బోల్డర్ హెడ్ ల్యాంప్ డిజైన్ కలిగి ఉంటుంది. స్పోర్టీ లుక్ కలిగిన ఈ పల్సర్ బైక్ ‘ఎన్ఎస్’ డెకల్స్‌తోపాటు ప్రముఖంగా ఫ్యుయల్ ట్యాంకు, పొడవైన రేడియటర్ శ్రౌడ్స్, సైడ్ ప్యానెల్స్, స్ప్లిట్ సీట్స్, రీస్టైల్డ్ టెయిల్ సెక్షన్, స్ప్లిట్ టెయిల్ లైట్స్, స్ప్లిట్ గ్రాబ్ హ్యాండిల్స్, ఎల్ఈడీ టర్న్ ఇండికేటర్లతోపాటు టైల్ టీడీ ఉంటుంది.
373సీసీ ఇంజిన్ ను బజాజ్ పల్సర్ ఎన్ఎస్400జడ్ మోటారు సైకిల్‌లో ఉపయోగించారు. ఈ ఇంజిన్ గరిష్టంగా 39 బీహెచ్పీ, 35ఎన్ఎం టార్క్ వెలువరిస్తుంది. స్లిప్ అండ్ అసిస్ట్ క్లచ్, 6-స్పీడ్ గేర్ బాక్స్ తో రూపుదిద్దుకుంది ఈ బైక్. స్పోర్ట్స్ రోడ్, రైన్, ఆఫ్, రోడ్ వంటి రైడింగ్ మోడ్స్‌లో అందుబాటులో ఉంది. ఆసక్తిగల వారు రూ.5000 చెల్లించి ఎన్ఎస్400జెడ్ బైక్ ను బుక్ చేసుకోవచ్చు. వచ్చేనెల మొదటి వారంలో బుకింగ్స్ ప్రారంభం అవుతాయని కంపెనీ వెల్లడించింది.