iDreamPost
android-app
ios-app

స్పామ్ కాల్స్‌తో విసుగు చెందారా? ఇలా ఆపొచ్చు! ఆ నెట్వర్క్ యూజర్స్ కి మాత్రమే!

ప్రతిరోజు ఇన్సూరెన్స్ కంపెనీలు, బ్యాంకులు తమ బిజినెస్ లో భాగంగా కస్టమర్లకు కాల్స్ చేస్తూ విసిగిస్తుంటాయి. క్రెడిట్ కార్డ్, పర్సనల్ లోన్స్, ఇన్సూరెన్స్ వంటివి ఆఫర్ చేస్తూ నిత్యం ఫోన్స్ చేస్తుంటాయి.

ప్రతిరోజు ఇన్సూరెన్స్ కంపెనీలు, బ్యాంకులు తమ బిజినెస్ లో భాగంగా కస్టమర్లకు కాల్స్ చేస్తూ విసిగిస్తుంటాయి. క్రెడిట్ కార్డ్, పర్సనల్ లోన్స్, ఇన్సూరెన్స్ వంటివి ఆఫర్ చేస్తూ నిత్యం ఫోన్స్ చేస్తుంటాయి.

స్పామ్ కాల్స్‌తో విసుగు చెందారా? ఇలా ఆపొచ్చు! ఆ నెట్వర్క్ యూజర్స్ కి మాత్రమే!

ప్రస్తుత రోజుల్లో స్మార్ట్ ఫోన్ నిత్యావసర వస్తువుగా మారిపోయింది. ఒకరి నుంచి ఇంకొకరికి సమాచారం చేరవేయాలన్నా లేదా సమాచారం పొందాలన్నా క్షణాల్లో స్మార్ట్ ఫోన్ ద్వారా వారి పనులను పూర్తి చేసుకుంటున్నారు. ఏదైనా తెలియని విషయాలను గురించి తెలుసుకోవడానికి ఇంటర్నెట్ ను ఉపయోగించి రెప్పపాటులో మనకు కావాల్సిన విషయాలను పొందుతున్నాము. అయితే స్మార్ట్ ఫోన్ యూజర్లకు కొన్ని విషయాలు తలనొప్పిగా మారాయి. అవసరానికి వచ్చే కాల్స్ కాక స్పామ్ కాల్స్ బెడద ఎక్కువై పోయింది. ముఖ్యమైన పనుల్లో ఉన్నప్పుడు వచ్చే ఈ స్పామ్ కాల్స్, మెసేజ్ లు యూజర్లను తీవ్ర అసహనానికి గురిచేస్తున్నాయి. అయితే ఈ స్పామ్ కాల్స్, మెసేజ్ లకు ఈ విధంగా చెక్ పెట్టొచ్చు.

ప్రతిరోజు ఇన్సూరెన్స్ కంపెనీలు, బ్యాంకులు తమ బిజినెస్ లో భాగంగా కస్టమర్లకు కాల్స్ చేస్తూ విసిగిస్తుంటాయి. క్రెడిట్ కార్డ్, పర్సనల్ లోన్స్, ఇన్సూరెన్స్ వంటివి ఆఫర్ చేస్తూ నిత్యం ఫోన్స్ చేస్తుంటాయి. ఆఫీస్ మీటింగ్ లో ఉన్నప్పుడు లేదా ఇతర ముఖ్యమైన పనుల్లో బిజీగా ఉన్నప్పుడు ఇలాంటి స్పామ్ కాల్స్ యూజర్లకు ఇబ్బంది కలిగిస్తుంటాయి. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) గత కొన్ని సంవత్సరాలుగా అనేక చర్యలు తీసుకున్నప్పటికీ, ఇబ్బందికరమైన టెలిమార్కెటింగ్ కాల్స్, మెసేజ్ సమస్య అలాగే ఉంది. అయితే ఈ స్పామ్ కాల్స్, మెసేజ్ లను ఇలా చేయడం ద్వారా చెక్ పెట్టొచ్చు.

స్పామ్ కాల్స్, మెసేజ్ లకు ఇలా చెక్ పెట్టండి

మీ ఫోన్‌లో డిఫాల్ట్ మెసేజింగ్ యాప్‌ని ఓపెన్ చేయాలి.
తర్వాత న్యూ మెసేజ్ టైప్ చేయాలి. FULLY BLOCK అని కేపిటల్ లెటర్స్ లో టైప్ చేసి, టోల్ ఫ్రీ నంబర్ 1909కి పంపించాలి.
ఆ తర్వాత మీ ఫోన్ కు కన్ఫర్ మేషన్ మెసేజ్ వస్తుంది. 24 గంటల్లో స్పామ్ కాల్స్, మెసేజ్ లకు అడ్డుకట్ట పడుతుంది.
బ్యాంకింగ్, ఇన్యూరెన్స్, క్రెడిట్ కార్డు, ఆర్థికపరమైన ఉత్పత్తులకు సంబంధించిన ప్రోమోషనల్ మెసేజ్ లు కాల్స్ ను బ్లాక్ చేయడానికి BLOCK 1 అని టైప్ చేసి 1909కి పంపించాలి.
రియల్ ఎస్టేట్ కు సంబంధించిన కాల్స్ రాకుండా ఉండాలంటే BLOCK 2 అని టైప్ చేయాలి. విద్యాపరమైన స్పామ్ కాల్స్ ను నిరోధించడానికి BLOCK 3, హెల్త్ విషయమైన కాల్స్ ని బ్లాక్ చేయడానికి BLOCK 4, ఆటోమొబైల్, ఐటీ, వినోదానికి సంబంధించిన ప్రోమోషల్ కాల్స్ నిరోధించడానికి BLOCK 5 అని టైప్ చేసి మెసేజ్ పంపాల్సి ఉంటుంది.
అలాగే బ్రాడ్ కాస్టింగ్, కమ్యూనికేషన్ వంటి వాటిపై BLOCK 6 అని, టూరిజమ్, బెవరేజెస్ వంటి వాటిని బ్లాక్ చేయడానికి BLOCK 8 అని టైప్ చేసి 1909 నంబర్ కి మెసేజ్ చేయాలి.

కాగా స్పామ్ కాల్స్, మెసేజ్ లకు చెక్ పెట్టే సదుపాయం ఎయిర్ టెల్ కస్టమర్లకు మాత్రమే పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ స్పామ్ కాల్స్ కు సంబంధించి ఇంటర్నెట్ లో లభించిన సమాచారం ఆధారంగా ఇవ్వబడింది. ఈ విషయాన్ని యూజర్లు గమనించాల్సి ఉంటుంది.