Apple Integrates With Google's Gemini AI: గూగుల్ జెమినీ ఏఐతో యాపిల్ కంపెనీ ఒప్పందం.. అందుబాటులోకి వచ్చేది అప్పుడే!

గూగుల్ జెమినీ ఏఐతో యాపిల్ కంపెనీ ఒప్పందం.. అందుబాటులోకి వచ్చేది అప్పుడే!

Apple Integrates With Google's Gemini AI: ఇప్పటికే యాపిల్ కంపెనీ సొంత యాపిల్ ఇంటెలిజెన్స్ తో పాటు ఓపెన్ ఏఐ చాట్ జీపీటీని ఐఓఎస్ 18లో తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా గూగుల్ జెమినీ ఏఐని తీసుకొస్తున్నట్లు యాపిల్ కంపెనీ ప్రకటించింది.

Apple Integrates With Google's Gemini AI: ఇప్పటికే యాపిల్ కంపెనీ సొంత యాపిల్ ఇంటెలిజెన్స్ తో పాటు ఓపెన్ ఏఐ చాట్ జీపీటీని ఐఓఎస్ 18లో తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా గూగుల్ జెమినీ ఏఐని తీసుకొస్తున్నట్లు యాపిల్ కంపెనీ ప్రకటించింది.

యాపిల్ కంపెనీ గత నెలలో ఓపెన్ ఏఐతో భాగస్వామ్యం అయ్యామని.. ఐఓఎస్ 18, మ్యాక్ ఓఎస్ సీక్వోయాలో ఓపెన్ ఏఐని పరిచయం చేస్తున్నామని ప్రకటించింది. అయితే యాపిల్ ఇంటెలిజెన్స్ కూడా యూజర్స్ కి హెల్ప్ చేయడం కోసమని కొన్ని ఏఐ ఫీచర్స్ ని తీసుకొస్తుంది. ఇంకా ఎక్కువ ఏఐ ఫీచర్స్ కోసం చాట్ జీపీటీని యాక్సెస్ చేసేలా యూజర్స్ ని అనుమతిస్తున్నట్లు తెలిపింది. అయితే ఇప్పుడు యాపిల్ కేవలం చాట్ జీపీటీతోనే పరిమితం కాలేదు. ఇప్పుడు గూగుల్ జెమినీ ఏఐని కూడా ఐఓఎస్ 18, మ్యాక్ ఓఎస్ సీక్వోయాలలో తీసుకురానుంది. యాపిల్ కంపెనీ సాఫ్ట్ వేర్ ఇంజనీరింగ్ హెడ్ క్రెయిగ్ ఫెడెరిగి రీసెంట్ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు.

ఎక్కువ ఏఐ చాట్ బాట్స్ ని సపోర్ట్ చేసేందుకు ఐఓఎస్ 18, మ్యాక్ ఓఎస్ సీక్వోయాలలో గూగుల్ జెమినీ ఏఐని కూడా భాగస్వామ్యం చేస్తున్నట్లు వెల్లడించారు. యాపిల్ ప్లాట్ ఫామ్స్ లో గూగుల్, ఆంథ్రోపిక్ అనే ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీలతో యాపిల్ సంస్థ చర్చలు జరుపుతోంది. యాపిల్ మెటా ఏఐతో కూడా సంప్రదింపులు జరిపినట్లు వార్తలు వచ్చాయి. కానీ ఆ ఒప్పందం కొనసాగదని యాపిల్ ప్రతినిధులు వెల్లడించారు. ప్రస్తుతం యాపిల్ కంపెనీ.. మెటా సర్వీసులను తమ ప్లాట్ ఫామ్స్ లో ఇంటిగ్రేట్ చేసే ఆలోచన లేదని అన్నారు. ఈ ఏడాది తర్వాత ఐఓస్ 18, ఐప్యాడ్ ఓఎస్ 18, మ్యాక్ ఓఎస్ సీక్వోయా అప్డేట్స్ లో యాపిల్ ఇంటెలిజెన్స్ ఎంట్రీ ఇస్తుంది. ప్రారంభ దశలో ఇది యూఎస్ ఇంగ్లీష్ లో అందుబాటులోకి వస్తుంది.

ఐఫోన్ 15 ప్రో, ఎం1 చిప్ ఉన్న ఐపాడ్, మ్యాక్ మోడల్స్ మాత్రమే ఈ ఫీచర్ ని సపోర్ట్ చేస్తాయి. యాపిల్ ఈ ఫీచర్స్ ని ఎక్కువ భాషల్లో విస్తరింపజేసే ప్లాన్ లో ఉంది. ప్రశ్నలకు సమాధానాలు, కొన్ని పాయింట్స్ ని టెక్స్ట్ రూపంలో ఇస్తే దాన్ని ఒక స్టోరీలా మార్చడం, ఇమేజెస్ ని జనరేట్ చేయడం వంటి ఫీచర్స్ ఈ యాపిల్ ఇంటెలిజెన్స్ లో ఉంటాయి. అయితే ఇక్కడ చాట్ జీపీటీ, గూగుల్ జెమినీ ఏఐ సహా ఇతర చాట్ బాట్స్ ని వాడుకోవాలనుకుంటే కూడా యాపిల్ ఇంటెలిజెన్స్ యూజర్స్ ని పర్మిషన్ అడుగుతుంది. యూజర్ ఎక్స్ పీరియన్స్ కోసం మోర్ ఆప్షన్స్ ని యాపిల్ ఇంటెలిజెన్స్ ప్రొవైడ్ చేస్తుంది. ఇదిలా ఉంటే ఇప్పటికే గూగుల్.. ‘గూగుల్ జెమినీ’ పేరుతో ఏఐ యాప్ ని లాంఛ్ చేసింది. ఐఫోన్, ఆండ్రాయిడ్ ఫోన్లలో ఈ యాప్ అందుబాటులో ఉంది. మీరు ట్రై చేయాలనుకుంటే ఒకసారి ట్రై చేయండి. ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ లోకి వెళ్లి గూగుల్ జెమిని అని టైప్ చేస్తే యాప్ వస్తుంది.

Show comments