Tirupathi Rao
Apple Days Sale- Huge Discounts On iPhones And Apple Products: యాపిల్ ఐఫోన్, యాపిల్ వాచ్, ఐప్యాడ్, మ్యాక్ బుక్ వంటి ప్రోడక్ట్స్ కొనాలి అనుకునే వారికి ఇదే మంచి సమయం. ఎందకుంటే ఇప్పుడు యాపిల్ ఉత్పత్తులపై అద్భుతమైన ఆఫర్స్ ఉన్నాయి.
Apple Days Sale- Huge Discounts On iPhones And Apple Products: యాపిల్ ఐఫోన్, యాపిల్ వాచ్, ఐప్యాడ్, మ్యాక్ బుక్ వంటి ప్రోడక్ట్స్ కొనాలి అనుకునే వారికి ఇదే మంచి సమయం. ఎందకుంటే ఇప్పుడు యాపిల్ ఉత్పత్తులపై అద్భుతమైన ఆఫర్స్ ఉన్నాయి.
Tirupathi Rao
యాపిల్ ఐఫోన్ అంటే ఇష్టపడని వాళ్లు ఉండరేమో? ముఖ్యంగా యువతకు యాపిల్ ప్రోడక్టులంటే ఎక్కడలేని ఆసక్తి ఉంటుంది. కానీ, కొనాలి అంటే మాత్రం పర్సుకు కాస్త కష్టంగానే ఉంటుంది. ఎందుకంటే ఐఫోన్ ధరలు అలాగే ఉంటాయి మరి. అయితే ఇప్పుడు ఐఫోన్లపై భారీ డిస్కౌంట్స్ వచ్చేశాయి. ఇప్పుడు మిస్ అయితే మళ్లీ అలాంటి డిస్కౌంట్స్ రావడం కాస్త కష్టం అనే చెప్పాలేమో. ఎందుకంటే యాపిల్ డే సేల్ సందర్భంగా ఇప్పుడు యాపిల్ ఐఫోన్లపై భారీ డిస్కౌంట్స్ ప్రకటించారు. అన్నీ ఐఫోన్ మోడళ్లపై భారీ భారీ డిస్కౌంట్స్ అందుతున్నాయి. నిజానికి ఐఫోన్లపై సాధారణంగా డిస్కౌంట్ లభించదు. అందుకే ఇప్పుడు మిస్ అయితే ఇంక కష్టమే.
ఐఫోన్ 15 సిరీస్ పై కూడా డిస్కౌంట్స్ లభిస్తున్నాయి. ఐఫోన్ 15 స్టార్టింగ్ ప్రైస్ రూ.64,900గా ఉంది. అదే ఐఫోన్ 15 ప్లస్ ధర అయితే 74,290గా ఉంది. వీటిపై మీకు ఐసీఐసీఐ, ఎస్బీఐ బ్యాంకు కార్డులపై రూ.6 వేలు ఇన్ స్టెంట్ డిస్కౌంట్ లభిస్తోంది. ఐఫోన్ 15 ప్రో ధర రూ.1,23,990కే అందిస్తున్నారు. అలాగే ఐఫోన్ 15 ప్రో ప్లస్ మోడల్ ను రూ.1,45,990కి విక్రయిస్తున్నారు. ఇంక ఈ 15ప్రో సిరీస్ పై రూ.3 వేలు ఇన్ స్టెంట్ డిస్కౌంట్ లభిస్తుంది.
అటు ఐఫోన్ 13, ఐఫోన్ 14లపై కూడా ఇప్పుడు ఆఫర్స్ నడుస్తున్నాయి. ఐఫోన్ 13ను కేవలం రూ.50,999కే మీరు పొందవచ్చు. అలాగే ఐఫోన్ 14ను మీరు రూ.57,990కే పొందే అవకాశం ఇప్పుడు కల్పిస్తున్నారు. అలాగే వీటిపై బ్యాంకు ఆఫర్స్ మాత్రమే కాకుండా.. ఎక్స్ ఛేంజ్ ఛాన్స్ కూడా ఉంది. మీ పాత ఫోనుకు మీరు అద్భుతమైన ప్రైస్ ని పొందవచ్చు. అలాగే నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. కొన్ని సెలక్టివ్ బ్యాంక్సు ద్వారా మీరు ఈ నో కాస్ట్ ఈఎంఐ సదుపాయాన్ని పొందచ్చు.
ఐప్యాడ్లు, మ్యాక్ బుక్స్ పై కూడా మీకు ఇప్పుడు ఆఫర్స్ నడుస్తున్నాయి. ఐప్యాడ్ ఎయిర్, ఐప్యాడ్ ప్రో, ఐప్యాడ్ 9వ జనరేషన్ వంటి వివిధ మోడల్స్ పై మంచి ఆఫర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఐప్యాడ్ ధర రూ.24,990 నుంచే ప్రారంభం అవుతుంది. అలాగే మ్యాక్ బుక్స్ మీద కూడా క్రేజీ ఆఫర్స్ ఉన్నాయి. మ్యాక్ బుక్ ఎయిర్, మ్యాక్ బుక్ ప్రో ధర రూ.67,490 నుంచి ప్రారంభం అవుతుంది. వీటిలో పవర్ ఫుల్ ఎం1, ఎం2, ఎం3 చిప్స్ ఉంటాయి. యాపిల్ వాచెస్ ధర రూ.25,900 నుంచి ప్రారంభం అవుతోంది. ఈ యాపిల్ డే సేల్ ఆఫర్స్ జూన్ 8 నుంచి జూన్ 17 వరకు కొనసాగుతాయని వెల్లడించారు.