iDreamPost
android-app
ios-app

వీడియో: మంటల్లో కాలిబూడిదైన మరో ఎలక్ట్రిక్ బైక్!

ఈ మధ్యకాలంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం బాగా పెరిగిపోయింది. అయితే తరచూ ఏదో ఒక ప్రాంతంలో ఈ వాహనాలు మంటల్లో కాలిపోతున్నాయి. ఈ ఘటనలతో జనాల గుండెల్లో గుబులు పుడుతోంది. తాజాగా అలాంటి ఘటన మరొకటి చోటుచేసుకుంది.

ఈ మధ్యకాలంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం బాగా పెరిగిపోయింది. అయితే తరచూ ఏదో ఒక ప్రాంతంలో ఈ వాహనాలు మంటల్లో కాలిపోతున్నాయి. ఈ ఘటనలతో జనాల గుండెల్లో గుబులు పుడుతోంది. తాజాగా అలాంటి ఘటన మరొకటి చోటుచేసుకుంది.

వీడియో: మంటల్లో కాలిబూడిదైన మరో ఎలక్ట్రిక్ బైక్!

నేటికాలంలో కాలుష్యాన్ని తగ్గించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకుంటున్నాయి. అందులో భాగంగానే ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించాలని వినియోదారులకు సూచిస్తున్నాయి. పెరుగుతున్న వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి..అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీని ఉపయోగించుకోవడానికి ప్రభుత్వాలు చెబుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఇటీవల ఎలక్ట్రిక్ వాహనాలు వినియోగం బాగా పెరిగింది. అయితే అప్పుడప్పుడు ఈ వాహనాలు పేలిపోతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. దీంతో ఎలక్ట్రిక్ వాహనాలను కొనాలనుకునే వారు భయ పడుతున్నారు. తాజాగా ఓ ఎలక్ట్రిక్ స్కూటర్ నడిరోడ్డుపై మంటల్లో కాలిబూడిదైంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ప్రస్తుతం వాయు కాలుష్యం బాగా పెరిగిపోయింది. ఇంధనం ద్వారా నడిచే వాహనాల వినియోగం పెరగడంతో కూడా ఈ కాలుష్యానికి ఒక కారణం. అలానే పెట్రోల్, డీజిల్ వంటి ఇంధన ధరలు కూడా సామాన్యుడికి చుక్కులు చూపిస్తున్నాయి.  ఈ నేపథ్యంలోనే ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లో అందుబాటులోకి వచ్చాయి. మొదట్లో వీటిని కొనుగోలు చేసేందుకు జనాలు ఆసక్తి  చూపించారు. ఇంధన ధరల కంటే.. వీటి వినియోగంతో ఖర్చు తక్కువ అవుతుందనే అభిప్రాయం ఉంది.  అయితే ఇటీవల మాత్రం ఈవీ స్కూటర్లను కొనేందుకు వినియోగదారులు వెనుకడుగు వేస్తున్నారు.

కారణం.. తరచూ ఏదో ఒక ప్రాంతంలో ఈవీ వాహనాలు పేలిపోవడం, మంటలు చెలరేగి కాలిపోతున్నాయి. ఈ ఘటనల్లో పలువురు మృతి చెందడంతో పాటు మరెందరో తీవ్రగాయాల పాలవుతున్నారు. ఇలా అనుకోకుండా విద్యుత్ వాహనాల్లో చెలరేగే మంటలు వినియోగదారుల్లో భయాన్ని కలిగిస్తున్నాయి. గత కొన్ని రోజులకు క్రితం ఓలా ఎలక్ట్రిక్ బైక్ నడిరోడ్డుపై కాలిపోయింది. ఆ ఘటన మరువక ముందే ఆంపియర్ మాగ్నస్ ఈఎక్స్ మోడల్ కి చెందిన మరో ఈవీ బైక్ మంటల్లో చిక్కుకున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన వీడో ఎలక్ట్రిక్ స్కూటర్ మంటల్లో చిక్కుకున్నట్లు తెలుస్తోంది.

దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. నాగిన  నేషనల్ గ్రీన్ ఆటోమొబైల్ వినియోగదారుడు తన సోషల్ మీడియా ఖాతాలో ద్వారా షేర్ చేశారు. ఆ వీడియోలో ఆంపియర్ మాగ్నస్ ఈఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ లో పెద్దగా మంటలు వచ్చాయి. నడిరోడ్డులో కాలుతున్న బైక్ లో చెలరేగిన మంటలు స్థానికులు అదుపుచేయడానికి ప్రయత్నించారు. అయినా కూడా ఫలితం లేకుండా పోయింది. ఈ ఘటన మహారాష్ట్రలోని పూణేలో జరిగినట్లు తెలుస్తోంది. ఈవీ బైక్స్ మంటల్లో కాలిపోవడం అనే వార్త ఇదే మొదటి సారి కాదు.

గతంలో పలు బ్రాండ్ వాహనాలు మంటల్లో చిక్కుకున్న సంఘటనలు చాలానే వెలుగులోకి వచ్చాయి. ఈ సంఘటనల మీద కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించింది. అంతేకాక కంపెనీ అధికారులతో చర్చలు జరిపింది. ప్రస్తుతం జరిగిన ఈ సంఘటన మీద కంపెనీ స్పందించ లేదని తెలుస్తోంది. ఈ ఈవీ బైక్  కాలిపోవడానికి ప్రధాన కారణాలు తెలియాల్సి ఉంది. మరి… ఎలక్ట్రిక్ వాహనాలు పేలిపోతున్న ఘటనల కారణాలు ఏమిటి? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.