Nidhan
టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ పొజిషన్‌పై ఇప్పుడు చర్చ నడుస్తోంది. టీ20 వరల్డ్ కప్‌లో కింగ్‌ను ఏ స్థానంలో ఆడించాలనేది ఇంట్రెస్టింగ్గా మారింది. దీనిపై తాజాగా లెజెండ్ సౌరవ్ గంగూలీ రియాక్ట్ అయ్యాడు.
టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ పొజిషన్‌పై ఇప్పుడు చర్చ నడుస్తోంది. టీ20 వరల్డ్ కప్‌లో కింగ్‌ను ఏ స్థానంలో ఆడించాలనేది ఇంట్రెస్టింగ్గా మారింది. దీనిపై తాజాగా లెజెండ్ సౌరవ్ గంగూలీ రియాక్ట్ అయ్యాడు.
Nidhan
టీ20 వరల్డ్ కప్-2024 సంరంభం మొదలవడానికి ఇంకా ఒక్క రోజు సమయం మాత్రమే ఉంది. ఎంతగానో ఎదురుచూసిన క్షణాలు రావడంతో అభిమానుల సంతోషానికి హద్దుల్లేకుండా పోయాయి. మెగా టోర్నీలో అన్ని మ్యాచుల కంటే ఇండో-పాక్ సమరం కోసం ఇప్పుడు అందరూ కళ్లలో ఒత్తులు వేసుకొని వెయిట్ చేస్తున్నారు. ఈ మ్యాచ్ అనే కాదు.. ఈసారి ప్రపంచ కప్‌లో టీమిండియా ఎంతవరకు వెళ్తుంది? కప్ కొడుతుందా? లేదా అనేది చర్చనీయాంశంగా మారింది. వన్డే వరల్డ్ కప్-2023 కోల్పోయిన బాధలో ఉన్న రోహిత్ సేన.. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ కప్పును వదలొద్దని ఫిక్స్ అయింది. అందుకే కసిగా ప్రాక్టీస్ చేస్తోంది. ఎవరెదురొచ్చినా తొక్కిపడేయాలని చూస్తోంది. కప్‌ను కైవసం చేసుకొని ఫ్యాన్స్‌ను సంతోషంలో ముంచెత్తాలని అనుకుంటోంది.
మెగా టోర్నీకి అన్ని రకాలుగా ప్రిపేర్ అయి వచ్చింది టీమిండియా. ఐపీఎల్-2024 వల్ల టీ20లకు బాగా అలవాటు పడ్డారు మన క్రికెటర్లు. అయితే ప్రతి పొజిషన్‌కు ఒకటికి మించి ఆప్షన్లు ఉండటంతో టీమ్ కాంబినేషన్ ఎలా ఉండబోతోందనేది ఆసక్తికరంగా మారింది. ఏయే స్థానాల్లో ఎవర్ని ఆడిస్తారు? ముఖ్యంగా ఓపెనర్లుగా ఎవరు దిగుతారు? అనేది ఇంట్రెస్టింగ్గా మారింది. కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు యంగ్ బ్యాటర్ యశస్వి జైస్వాల్ ఓపెనర్లుగా దిగే అవకాశాలు ఉన్నాయి. అయితే ఐపీఎల్లో ఆర్సీబీ తరఫున ఇదే స్లాట్‌లో దిగి పరుగుల వరద పారించాడు కింగ్ కోహ్లీ. దీంతో అతడ్ని అదే స్థానంలో ఆడించాలనే డిమాండ్లు పెరిగాయి. తాజాగా భారత దిగ్గజం, బీసీసీఐ మాజీ బాస్ సౌరవ్ గంగూలీ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. విరాట్‌ను ఓపెనర్‌గా దించాలని హిట్‌మ్యాన్‌కు సూచించాడు.
‘టీ20 వరల్డ్ కప్‌లో విరాట్ కోహ్లీని ఓపెనర్‌గా ఆడించాలి. ఐపీఎల్లో ఆర్సీబీ తరఫున ఎలాగైతే దుమ్మురేపాడో మెగా టోర్నీలో అదే స్థాయిలో కోహ్లీ చెలరేగాలని నేను కోరుకుంటున్నా. దేనికీ భయపడకుండా అతడు స్వేచ్ఛగా బ్యాటింగ్ చేయాలి. అతడో గ్రేట్ ప్లేయర్’ అంటూ కితాబిచ్చాడు దాదా. రోహిత్ ఫామ్ మీద కూడా గంగూలీ రియాక్ట్ అయ్యాడు. ఐపీఎల్లో హిట్‌మ్యాన్ 417 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో అతడు ఎలా ఆడతాడోనని ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో గంగూలీ స్పందిస్తూ.. రోహిత్ ఫామ్ గురించి దిగులు చెందాల్సిన అవసరం లేదన్నాడు. గత వన్డే వరల్డ్ కప్‌లో హిట్‌మ్యాన్ ఏ రేంజ్లో చెలరేగాడో చూశామన్నాడు. పొట్టి కప్పులో కూడా అతడు అదే రీతిలో విధ్వంసం సృష్టిస్తాడని నమ్ముతున్నానని దాదా పేర్కొన్నాడు. భారత జట్టులో క్వాలిటీ ప్లేయర్లు ఉన్నారని, టీమ్ కప్పు కొట్టకుండా ఆపడం ఎవరి వల్లా కాదన్నాడు. మరి.. కోహ్లీని ఓపెనర్‌గా దింపాలన్న దాదా సూచనపై మీ ఒపీనియన్‌ను కామెంట్ చేయండి.
Ganguly said “I would open with Virat Kohli in this T20 World Cup. I want Virat to bat the way he did for RCB, he has to bat with freedom & he is a great player”. [RevSportz] pic.twitter.com/R4upmzTnY7
— Johns. (@CricCrazyJohns) June 1, 2024