iDreamPost
android-app
ios-app

T20 World Cup: ఇండియా-పాకిస్థాన్‌ మ్యాచ్‌ టికెట్ల సేల్‌ ఆన్‌! ధర తెలిస్తే కళ్లు బైర్లుకమ్ముతాయి!

  • Published Jun 01, 2024 | 11:11 AMUpdated Jun 01, 2024 | 11:11 AM

IND vs PAK, T20 World Cup 2024, Tickets: టీ20 వరల్డ్‌ కప్‌ 2024లో ఇండియా-పాకిస్థాన్‌ మ్యాచ్‌ కోసం అంతా ఎదురుచూస్తున్నారు. అయితే.. ఈ మ్యాచ్‌ టికెట్‌ రేట్లు చూస్తే షాక్‌ అవ్వడం ఖాయం. మరి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

IND vs PAK, T20 World Cup 2024, Tickets: టీ20 వరల్డ్‌ కప్‌ 2024లో ఇండియా-పాకిస్థాన్‌ మ్యాచ్‌ కోసం అంతా ఎదురుచూస్తున్నారు. అయితే.. ఈ మ్యాచ్‌ టికెట్‌ రేట్లు చూస్తే షాక్‌ అవ్వడం ఖాయం. మరి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

  • Published Jun 01, 2024 | 11:11 AMUpdated Jun 01, 2024 | 11:11 AM
T20 World Cup: ఇండియా-పాకిస్థాన్‌ మ్యాచ్‌ టికెట్ల సేల్‌ ఆన్‌! ధర తెలిస్తే కళ్లు బైర్లుకమ్ముతాయి!

పొట్టి ప్రపంచ కప్‌ సమరానికి సర్వం సిద్ధమైంది. ఆదివారం నుంచి టీ20 వరల్డ్‌ కప్‌ 2024 పోటీలు హోరాహోరీగా జరగనున్నాయి. టీమిండియా తమ తొలి మ్యాచ్‌ను జూన్‌ 5న ఐర్లాండ్‌తో ఆడనుంది. అయితే.. ఈ మెగా టోర్నీకే హైలెట్‌గా నిలిచే ‘ఇండియా వర్సెస్‌ పాకిస్థాన్‌’ మ్యాచ్‌ కోసం యావత్‌ క్రికెట్‌ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు లేకపోవడంతో, కేవలం ఐసీసీ ఈవెంట్స్‌లోనే ఆడుతుండటంతో భారత్‌ పాక్‌ క్రికెట్‌ మ్యాచ్‌ అంటే ఉండే పిచ్చి మరింత ఎక్కువైంది. ఈ క్రేజ్‌ను ఐసీసీ కూడా బాగా క్యాష్‌ చేసుకుంటుంది. ఏ వరల్డ్‌ కప్‌ జరిగినా ఇండియా, పాకిస్థాన్‌ జట్లు ఒకే గ్రూప్‌లో ఉండేలా ప్లాన్‌ చేస్తోంది. ఇప్పుడు టీ20 వరల్డ్ కప్‌లో కూడా ఇండియా, పాకిస్థాన్‌ గ్రూప్‌-ఏలోనే ఉన్నాయి. ఈ రెండు దేశాల మధ్య మ్యాచ్‌కు సంబంధించిన కొన్ని టికెట్ల అమ్మకం మొదలుపెట్టారు.

ఇండియా-పాకిస్థాన్‌ మ్యాచ్‌ టికెట్‌ ధరలు భారీగానే ఉంటాయనే విషయం తెలిసిందే. కానీ, అధికారికంగా ఈ సారి కళ్లు బైర్లు కమ్మే ధరలు ఉన్నా​యి. గతంలో బ్లాక్‌ మార్కెట్‌లో భారత్‌-పాక్‌ మ్యాచ్‌ టికెట్‌ ధరలు ఆకాశాన్ని అంటేవి. అంతా ఇంతా అంటూ వార్తలు కూడా వచ్చేవి. కానీ, ఇప్పుడు మాత్రం అఫీషియల్‌గానే టికెట్‌ ధర లక్షల్లో ఉంది. ఈ ధరలు చూసి.. క్రికెట్‌ అభిమానులు కళ్లు తేలేస్తున్నారు. ఎంత ఇండియా-పాకిస్థాన్‌ మ్యాచ్‌ అయితే మాత్రం ఒక్కో టికెట్‌ ధర మరి ఇంతనా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే.. ధరకు తగినట్లే ఈ లగ్జరీ సౌకర్యాలు కూడా ఉంటాయి లేండీ. మరి ఆ టికెట్లు ఏమిటీ? ధర ఎంత? కల్పించే లగ్జరీ సౌకర్యాలు ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

ఇండియా-పాకిస్థాన్‌ మ్యాచ్‌ న్యూయార్క్‌లో కొత్తగా నిర్మించిన నసావు కౌంటీ క్రికెట్‌ స్టేడియంలో జరగనున్న విషయం తెలిసిందే. 34 వేల మంది కూర్చేనే సామర్థ్యం ఉన్న ఈ స్టేడియంలో మొత్తం ఆరు రకాల టికెట్లు ఉన్నాయి. డైమండ్ క్లబ్, కాబానాస్, ప్రీమియం క్లబ్ లాంజ్‌లు, కార్నర్ క్లబ్, పెవిలియన్ క్లబ్, బౌండరీ క్లబ్. ఇండియా-పాకిస్థాన్‌ మ్యాచ్‌ కోసం వీటిలో ఇప్పుడు మూడు ప్యాకేజీలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అందులో డైమండ్‌ క్లబ్‌ గురించి మాట్లాడుకుంటే.. ఇది నసావు స్టేడియానికి జ్యూవెల్‌. అత్యంత ఖరీదైన టికెట్‌ ఇదే. ఈ డైమండ్‌ క్లబ్‌లో కూర్చోని మ్యాచ్‌ చూడాలంటే ఒక్కో టికెట్‌కు 10 వేల డాలర్లు అంటే మన కరెన్సీలో రూ.8,34,323 చెల్లించాలి. డైమండ్‌ క్లబ్‌ నుంచి మ్యాచ్‌ చూసేందుకు చాలా అనువుగా ఉంటుంది. టికెట్‌ ధరలోనే మంచి ఆహరం, డ్రింక్స్‌ కూడా ఇస్తారు. బాక్స్‌ మొత్తం ఏసీ ఉంటుంది. పైగా మాజీ క్రికెటర్లతో కలిసి కూర్చునే అవకాశం ఉంటుంది. మరి ఇండియా-పాకిస్థాన్‌ మ్యాచ్‌ కోసం ఈ డైమండ్‌ క్లబ్‌ టికెట్‌ ధర, అందించే సౌకర్యాలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి