Nidhan
T20 World Cup 2024 Final: టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో సూర్యకుమార్ యాదవ్ పట్టిన క్యాచ్ మ్యాచ్ టర్నింగ్ పాయింట్‌గా మారింది. మిస్టర్ 360 ఆ క్యాచ్ అందుకోకపోతే సౌతాఫ్రికా కప్పు ఎగరేసుకుపోయేది.
T20 World Cup 2024 Final: టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో సూర్యకుమార్ యాదవ్ పట్టిన క్యాచ్ మ్యాచ్ టర్నింగ్ పాయింట్‌గా మారింది. మిస్టర్ 360 ఆ క్యాచ్ అందుకోకపోతే సౌతాఫ్రికా కప్పు ఎగరేసుకుపోయేది.
Nidhan
క్యాచెస్ విన్ మ్యాచెస్ అనే నానుడి వినే ఉంటారు. క్రికెట్లో దీన్ని ఎక్కువగా వాడుతుంటారు. ఫీల్డింగ్ ప్రతిభతో మ్యాచ్‌లు గెలిచిన సందర్భాలు చాలా ఉన్నాయి. అందుకే అన్ని టీమ్స్ కూడా ఇందులో మెరుగవడానికి ప్రయత్నిస్తున్నాయి. భారత జట్టు కూడా దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని బెటర్ అవుతోంది. అందులో భాగంగా వరల్డ్ కప్స్ టైమ్‌లో బెస్ట్ ఫీల్డింగ్ ఎఫర్ట్‌తో టీమ్ విజయంలో కీలకపాత్ర పోషించిన వారికి లెజెండరీ ప్లేయర్ల చేతుల మీదుగా మెడల్స్ అందిస్తూ ప్రోత్సహిస్తోంది. గత వన్డే ప్రపంచ కప్-2023తో పాటు ప్రస్తుత టీ20 వరల్డ్ కప్-2024లోనూ దీన్ని కంటిన్యూ చేసింది టీమ్ మేనేజ్మెంట్. కోచ్ రాహుల్ ద్రవిడ్ తీసుకొచ్చిన ఈ విధానం సూపర్ రిజల్ట్‌ను తీసుకొచ్చింది. ఫీల్డింగ్ బలం వల్లే భారత్ పొట్టి కప్పును సొంతం చేసుకుంది. సూర్యకుమార్ యాదవ్ పట్టిన క్యాచ్ మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసింది.
నిన్న సౌతాఫ్రికాతో జరిగిన మెగా ఫైనల్లో ఓ దశలో భారత్ ఓటమి ఖాయమని అంతా భావించారు. 30 బంతుల్లో 30 రన్స్ చేయాల్సిన దశలో ప్రొటీస్‌దే కప్ అని డిసైడ్ అయ్యారు. కానీ జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, హార్దిక్ పాండ్యా అద్భుత బౌలింగ్‌తో మ్యాచ్‌ను టీమిండియా వైపు తిప్పారు. అయితే వీళ్ల కంటే కూడా ఎక్కుడ క్రెడిట్ కొట్టేశాడు సూర్యకుమార్. ఆఖరి ఓవర్లో డేవిడ్ మిల్లర్ కొట్టిన బంతి సిక్స్‌కు వెళ్తుండగా.. బౌండరీ లైన్ వద్ద అద్భుతంగా దాన్ని ఒడిసిపట్టుకున్నాడతను. బాల్ వేగం, దిశను అంచనా వేసి అందుకున్న స్కై.. రోప్ దాటుతున్నానని గమనించి బంతిని గాల్లోకి విసిరి తిరిగి లోపలికి వచ్చి క్యాచ్ పట్టాడు. దీంతో మిల్లర్ ఔట్ అవడం, ఆ తర్వాత 7 పరుగుల తేడాతో మ్యాచ్‌ను, కప్పును భారత్ సొంతం చేసుకోవడం క్షణాల్లో జరిగిపోయాయి. అయితే సూర్య క్యాచ్‌పై ఇప్పుడు కాంట్రవర్సీ నడుస్తోంది.
మిల్లర్ క్యాచ్‌ను పట్టే క్రమంలో సూర్య కాలి షూ బౌండరీ లైన్‌ను తాకిందని సౌతాఫ్రికా అభిమానులు ఆరోపిస్తున్నారు. అతడి షూ తాకడంతో రోప్ కదిలిందని అంటున్నారు. సాధారణంగా వైట్ లైన్ అంచున బౌండరీ రోప్ ఉండాలని, కానీ అలా లేదని కామెంట్స్ చేస్తున్నారు. బౌండరీ రోప్‌ను అది ఉండాల్సిన యథాస్థానానికి జరపలేదని, ఏదో తేడాగా ఉందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. క్యాచ్‌ను అంపైర్లు మూడ్నాలుగు సార్లు నిశితంగా పరిశీలించాల్సిందని, కానీ వెంటనే నిర్ణయం ప్రకటించారని ప్రొటీస్ ఫ్యాన్స్ సీరియస్ అవుతున్నారు. అయితే ఈ వాదనల్ని భారత అభిమానులు కొట్టిపారేస్తున్నారు. బౌండరీ లైన్‌కు సూర్య కాలు తగల్లేదని, ఓటమికి సాకులు చెప్పడం మాని ఇంకా బెటర్‌గా ఆడటంపై ఫోకస్ పెట్టాలని సూచిస్తున్నారు. మరి.. సూర్య క్యాచ్ కాంట్రవర్సీపై మీ ఒపీనియన్‌ను కామెంట్ చేయండి.
What a game! #INDvSA2024. So close but so far. Great effort by #ProteaFire. Credit to #India, esp @Jaspritbumrah93. But that catch by @surya_14kumar in final over had his feet over the line twice. Boundary wedge was out. It was not moved back onto the white line. Take a look. pic.twitter.com/FKoDpj5RU1
— Gareth Stead (@garethstead) June 29, 2024