iDreamPost

South Africa: తొలి కప్పు గెలుద్దాం అనుకున్న సౌతాఫ్రికాను పాత రోగం ఏడిపించింది!

  • Published Jun 30, 2024 | 11:19 AMUpdated Jun 30, 2024 | 11:19 AM

T20 World Cup Final: సౌతాఫ్రికా జట్టుది మళ్లీ అదే కథ. తొలి కప్పు గెలిచి చరిత్ర సృష్టిద్దామనుకున్న ప్రొటీస్​కు నిరాశే మిగిలింది. ఆ టీమ్​ను పాత రోగం ఏడిపించింది.

T20 World Cup Final: సౌతాఫ్రికా జట్టుది మళ్లీ అదే కథ. తొలి కప్పు గెలిచి చరిత్ర సృష్టిద్దామనుకున్న ప్రొటీస్​కు నిరాశే మిగిలింది. ఆ టీమ్​ను పాత రోగం ఏడిపించింది.

  • Published Jun 30, 2024 | 11:19 AMUpdated Jun 30, 2024 | 11:19 AM
South Africa: తొలి కప్పు గెలుద్దాం అనుకున్న సౌతాఫ్రికాను పాత రోగం ఏడిపించింది!

టీ20 వరల్డ్ కప్-2024 ముగిసింది. పొట్టి ఫార్మాట్​లో టీమిండియా సరికొత్త ఛాంపియన్​గా అవతరించింది. నిన్న జరిగిన ఫైనల్ ఫైట్​లో తొలుత బ్యాటింగ్​కు దిగిన రోహిత్ సేన.. ఓవర్లన్నీ ఆడి 7 వికెట్లకు 176 పరుగులు చేసింది. ఆ తర్వాత ఛేజింగ్ మొదలుపెట్టిన ప్రొటీస్ అన్ని ఓవర్లు ఆడి 8 వికెట్ల నష్టానికి 169 పరుగులు మాత్రమే చేయగలిగింది. 7 పరుగుల తేడాతో మ్యాచ్​తో పాటు కప్పును కూడా కోల్పోయింది. టైటిల్​ను గెలిచిన భారత ఆటగాళ్లు సంబురాల్లో మునిగిపోయారు. కేరింతలు కొడుతూ తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. మరోవైపు తొలి కప్పు కొడదామని అనుకున్న సౌతాఫ్రికా ప్లేయర్లు.. ఆ ఆశ నెరవేరకపోవడంతో నిరాశలో కూరుకుపోయారు. కెప్టెన్ మార్క్రమ్ సహా పలువురు ఆటగాళ్లు ఓటమి బాధను తట్టుకోలేక కన్నీళ్లు పెట్టుకున్నారు.

వన్డేలు, టీ20లు.. ఫార్మాట్ ఏదైనా ఇప్పటివరకు సౌతాఫ్రికా వరల్డ్ కప్స్​లో విజేతగా నిలిచిందే లేదు. దాదాపుగా ప్రతిసారి సెమీస్ వరకు రావడం అక్కడ ఓడి ఇంటికి వెళ్లిపోవడం సఫారీలకు అలవాటుగా మారింది. ఒత్తిడికి గురవడం వల్ల కొన్నిసార్లు, బ్యాడ్ లక్ వెంటాడటం వల్ల మరికొన్ని సార్లు ఫైనల్​కు రాకుండానే ఇంటిదారి పట్టేది ప్రొటీస్. కానీ రాకరాక తొలిసారి ఫైనల్స్​కు చేరుకుందా జట్టు. దీంతో కప్పు కొడుతుందని ఫ్యాన్స్ గంపెడాశలు పెట్టుకున్నారు. బౌలింగ్, బ్యాటింగ్​లో దుర్భేద్యంగా ఉన్న తమ టీమ్​ను భారత్ ఆపలేదని అనుకున్నారు. అంచనాలకు తగ్గట్లే మెగా ఫైనల్ ఆఖరి వరకు ఉత్కంఠగా సాగింది. కానీ చివరకు టీమిండియా విజేతగా నిలిచింది. ఒక దశలో మ్యాచ్​లో సౌతాఫ్రికాదే గెలుపని అంతా భావించారు.

ఫైనల్​లో గెలుపునకు 30 బంతుల్లో 30 రన్స్ చేయాలి. చేతిలో 6 వికెట్లు ఉన్నాయి. దీంతో సౌతాఫ్రికా ఈజీగా నెగ్గుతుందని అందరూ అనుకున్నారు. క్రీజులో డేంజరస్ క్లాసెన్, మిల్లర్ ఉండటంతో భారత్ పనైపోయినట్లేనని భావించారు. అయితే ఇంపార్టెంట్ టైమ్​లో తడబడిన మార్క్రమ్ సేన మ్యాచ్​ను టీమిండియాకు అప్పగించింది. 30 బంతుల్లో 30 పరుగులు చేయాల్సిన జట్టు కాస్తా ఆఖర్లో 6 బంతుల్లో 16 పరుగులు చేయాల్సిన స్థితికి వెళ్లిపోయింది. చివరికి 7 పరుగుల తేడాతో ఓటమిపాలై చోకర్స్ అనే అపఖ్యాతిని మరోమారు మూటగట్టుకుంది. అప్పటివరకు ధనాధన్ షాట్లతో అదరగొట్టిన క్లాసెన్, మిల్లర్ ప్రెజర్​లో పడి వికెట్లను పారేసుకోవడంతో సౌతాఫ్రికాకు ఓటమి తప్పలేదు. నాకౌట్ మ్యాచుల్లో ఒత్తిడికి చిత్తవడం ఆ జట్టుకు ఉన్న రోగం. అదే వాళ్లను మళ్లీ ఏడిపించింది. కీలక టైమ్​లో ఇద్దరు ప్రధాన బ్యాటర్లు ఔట్ అవడం, అదృష్టం కూడా వెక్కిరించడంతో ప్రొటీస్ కప్పుకు ఆమడ దూరంలోనే ఆగిపోయింది.

ఇదీ చదవండి: వీడియో: కప్పు కొట్టిన తర్వాత పిచ్‌పై మట్టి తిన్న రోహిత్‌! ఎందుకలా చేశాడంటే..?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి