SNP
SNP
వన్డే వరల్డ్ కప్‌లోనే అత్యంత హైఓల్టేజ్ మ్యాచ్‌కు అంతా సిద్ధమైంది. అహ్మాదాబాద్‌లోని నరేంద్ర మోదీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్‌కు సర్వం సెట్ అయింది. ఈ మ్యాచ్ కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే.. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓ మార్పుతో బరిలోకి దిగే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. యువ స్టార్ ఓపెనర్ శుబ్‌మన్ గిల్ పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో బరిలోకి దిగే అవకాశం ఉంది. వరల్డ్ కప్‌కి ముందు భీకర ఫామ్‌లో ఉన్న గిల్.. వరల్డ్ కప్‌లో కీ ప్లేయర్‌గా మారుతాడని అనుకుంటున్న సమయంలో డెంగ్యూ ఫీవర్‌తో గిల్ తొలి రెండు మ్యాచ్‌లకు దూరమైన విషయం తెలిసిందే.
ఆస్ట్రేలియాతో పాటు ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లకు గిల్ అందుబాటులో లేడు. ప్రస్తుతం జ్వరం నుంచి కోలుకుంటున్న గిల్.. శనివారం పాక్‌తో మ్యాచ్‌లో బరిలోకి దిగనున్నాడు. అయితే.. డెంగ్యూ నుంచి కోలుకున్నా.. దాని ప్రభావం ఇంకా పూర్తిగా తగ్గలేదని సమాచారం. జ్వరం తర్వాత ఉండే కీళ్లనొప్పులు, అలసట ఉన్నట్లు తెలుస్తుంది. అయినా కూడా పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎంతో కీలక కనుక గిల్ బరిలోకి దిగాలనే బలంగా ఫిక్స్ అయినట్లు సమాచారం. ఇలా గిల్ డెంగ్యూతోనే మ్యాచ్‌కు సిద్దం అవుతున్న తరుణంలో టీమిండియా మాజీ క్రికెటర్, 2011 ప్రపంచ కప్ హీరో యువరాజ్ సింగ్, గిల్‌కు అండగా నిలబడ్డాడు.
జ్వరంతో బాధపడుతున్న గిల్‌తో మాట్లాడినట్లు యువీ వెల్లడించాడు. తాను డెంగ్యూతో చాలా మ్యాచ్‌లు అలాగే కేన్సర్‌తో వన్డే వరల్డ్ కప్ ఆడానని, గిల్ కూడా డెంగ్యూతో పాక్‌పై బరిలోకి దిగినా.. రాణిస్తాడని అన్నాడు. కాగా, 2011లో యువరాజ్ సింగ్ కేన్సర్‌తో బాధపడుతూనే టీమిండియాకు ఆడిన విషయం తెలిసిందే. ఆ వరల్డ్ కప్‌లో యువీ ఏకంగా మ్యాచ్ మధ్యలోనే గ్రౌండ్‌లో రక్తం కక్కుకున్నాడు. అయినా కూడా భారత్‌కు వరల్డ్ కప్ అందించాలనే లక్ష్యంతో ఆడిన యువీ.. ఆ వరల్డ్ కప్‌లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచాడు. ఇప్పుడు గిల్.. డెంగ్యూతో బాధపడుతున్న క్రమంలో.. అతని ఆత్మవిశ్వాసం పెంచేందుకు యువీ గిల్‌తో మాట్లాడి.. అతన్ని మానసికంగా స్ట్రాంగ్‌గా చేసినట్లు తెలుస్తుంది. మరి టీమిండియా యువ క్రికెటర్ గిల్ గురించి యువీ ఇంతలా కేర్ తీసుకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Yuvraj Singh said, “I’ve solidly built Shubman Gill. I’ve told him that I’ve played matches dengue and the World Cup with cancer. Hopefully he’ll be perfectly fine for the match against Pakistan”. (ANI). pic.twitter.com/Q5KqGW9Mdv
— Mufaddal Vohra (@mufaddal_vohra) October 13, 2023
ఇదీ చదవండి: ఇండియా-పాక్ మ్యాచ్! ఆస్పత్రుల్లో బెడ్స్ ఫుల్! కారణం?