iDreamPost
android-app
ios-app

ఇండియా-పాక్ మ్యాచ్! ఆస్పత్రుల్లో బెడ్స్ ఫుల్! కారణం?

  • Author singhj Published - 10:35 AM, Fri - 13 October 23
  • Author singhj Published - 10:35 AM, Fri - 13 October 23
ఇండియా-పాక్ మ్యాచ్! ఆస్పత్రుల్లో బెడ్స్ ఫుల్! కారణం?

వన్డే వరల్డ్ కప్​-2023 మ్యాచులకు క్రేజ్ రోజురోజుకీ మరింత పెరుగుతోంది. టోర్నీ ఆరంభంలో స్టేడియాలు ఖాళీగా కనిపించడంతో అసలు జరుగుతోంది ప్రపంచ కప్పేనా? అనే సందేహం చాలా మందిలో కలిగింది. కానీ మ్యాచ్​లు ఆసక్తిగా జరుగుతుండటంతో అందరి ఫోకస్ మెగా టోర్నీపై పడింది. స్వదేశంలో జరుగుతున్న టోర్నీలో భారత్ వరుస విజయాలతో దూసుకెళ్తుండటం, ఆస్ట్రేలియా లాంటి ఛాంపియన్ టీమ్​ వరుసగా ఓడిపోవడం కూడా టోర్నీపై ఫ్యాన్స్​లో ఇంట్రెస్ట్​ను మరింత పెంచేసింది. అయితే వరల్డ్ కప్​పై క్రేజ్, పాపులారిటీని మరింత పెంచేందుకు ఒక బిగ్ గేమ్ వచ్చేస్తోంది. అదే భారత్-పాకిస్థాన్​ మ్యాచ్.

క్రికెట్​లో ఇండియా-పాక్ మ్యాచ్​ చాలా స్పెషల్ అనేది తెలిసిందే. ఈ చిరకాల ప్రత్యర్థులు గ్రౌండ్​లో కొదమసింహాల్లా తలపడుతుంటే చూసి ఎంజాయ్ చేయాలని అభిమానులు కోరుకుంటారు. ఎట్టకేలకు ఆ తరుణం వచ్చేసింది. ఈ వరల్డ్ కప్​లో భాగంగా దాయాదుల పోరుకు అంతా రెడీ అయింది. ఈ మ్యాచ్​తో వరల్డ్ కప్ ఫీవర్ నెక్స్ట్ లెవల్​కు వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. భారత్-పాక్ మ్యాచ్​కు టికెట్లన్నీ ఎప్పుడో బుక్ అయిపోయాయి. ఈ మ్యాచ్​కు అహ్మదాబాద్​లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదిక కానున్న సంగతి తెలిసిందే. అహ్మాదాబాద్​కు క్రికెట్ ఫ్యాన్స్ పోటెత్తుతున్నారు. అక్కడ హోటల్ రూమ్స్​కు మస్త్ డిమాండ్ ఏర్పడింది.

అహ్మదాబాద్​లో రూ.వేలు పలికే ఒక్కో రూమ్ రేట్ కాస్తా ఇప్పుడు రూ.లక్షల్లో పలుకుతోందట. దీంతో హోటల్ రూమ్స్​ దొరకనివాళ్లు, అంత ధర పెట్టి రూమ్స్​లో ఉండలేని వాళ్లు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. హాస్పిటల్స్​లో బెడ్స్​ను బుక్ చేసుకుంటున్నారు. దీంతో అహ్మదాబాద్​లో హాస్పిటల్స్​ అన్నీ ఫుల్ అయిపోయాయి. ఒక క్రికెట్ మ్యాచ్ కోసం ఇలా ఆస్పత్రుల్లోని బెడ్స్​ బుక్ చేయడం బహుశా హిస్టరీలో ఇదే తొలిసారి కావొచ్చు. దీనిపై అహ్మదాబాద్ హాస్పిటల్స్ అండ్ నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్ సీరియస్ అయ్యింది. పేషెంట్ల కోసమే ఆస్పత్రులు ఉన్నాయని.. రోగులు కాని వారి కోసం కాదని స్పష్టం చేసింది. మరి.. మ్యాచ్ కోసం ఆస్పత్రుల్లో బెడ్స్ బుక్ చేసుకోవడంపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: టీమిండియా డ్రెస్సింగ్ రూమ్​లో సామాన్యుడికి సత్కారం.. ఎవరితను?

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet