iDreamPost
android-app
ios-app

Yuvraj Singh: ఆ టీమ్​కు హెడ్​ కోచ్​గా యువరాజ్? మొత్తానికి లెజెండ్​ను ఒప్పించారు!

  • Published Jul 23, 2024 | 7:44 PMUpdated Jul 23, 2024 | 7:44 PM

Team India: టీమిండియా లెజెండ్ యువరాజ్ సింగ్​ త్వరలో కొత్త రోల్​లో కనిపించనున్నాడు. ఆ టీమ్​కు హెడ్ కోచ్​గా యువీ రావడం ఖాయమైందని తెలుస్తోంది.

Team India: టీమిండియా లెజెండ్ యువరాజ్ సింగ్​ త్వరలో కొత్త రోల్​లో కనిపించనున్నాడు. ఆ టీమ్​కు హెడ్ కోచ్​గా యువీ రావడం ఖాయమైందని తెలుస్తోంది.

  • Published Jul 23, 2024 | 7:44 PMUpdated Jul 23, 2024 | 7:44 PM
Yuvraj Singh: ఆ టీమ్​కు హెడ్​ కోచ్​గా యువరాజ్? మొత్తానికి లెజెండ్​ను ఒప్పించారు!

యువరాజ్ సింగ్.. క్రికెట్ లవర్స్​కు పరిచయం అక్కర్లేని పేరిది. బ్యాటర్​గా, బౌలర్​గా ఒంటిచేత్తో ఎన్నో కీలక మ్యాచుల్లో టీమిండియాను గెలిపించిన హీరో అతడు. టీ20 వరల్డ్ కప్-2007తో పాటు వన్డే ప్రపంచ కప్-2011ను భారత్ సొంతం చేసుకోవడంలో అత్యంత ముఖ్య భూమిక పోషించాడు యువీ. క్యాన్సర్​ మహమ్మారితో పోరాడుతూ​ దేశానికి కప్ అందించిన యోధుడతను. క్రికెట్​లో ఎన్నో ట్రోఫీలు గెలిచి కెరీర్​ను చిరస్మరణీయం చేసుకున్నాడతను. రిటైర్మెంట్ తర్వాత క్రికెటింగ్ వ్యవహారాలకు దూరంగా ఉంటున్న ఈ దిగ్గజం.. ఇప్పుడో జట్టుకు కోచ్​గా రానున్నాడని తెలుస్తోంది. ఎన్ని టీమ్స్ ఊరించే ఆఫర్లు ఇచ్చినా కోచింగ్​కు ఒప్పుకోని యువీ.. ఎట్టకేలకు ఇప్పుడు ఎస్ చెప్పాడని వినిపిస్తోంది.

ఐపీఎల్​లో అత్యంత సక్సెస్​ఫుల్ టీమ్స్​లో ఒకటైన గుజరాత్ టైటాన్స్​కు యువరాజ్ హెడ్ కోచ్​గా రావడం దాదాపుగా ఖాయమైందని సమాచారం. యువీతో ఆ ఫ్రాంచైజీ ఓనర్స్ చర్చలు జరుపుతున్నారని.. అది ఓ కొలిక్కి వస్తే అధికారిక ప్రకటన వెలువడుతుందని టాక్ నడుస్తోంది. గుజరాత్ జట్టుకు ప్రస్తుతం హెడ్ కోచ్​గా ఉన్న ఆశిష్ నెహ్రా ఆ ఫ్రాంచైజీని వీడటం పక్కా అని క్రికెట్ వర్గాల్లో వినిపిస్తోంది. నెహ్రాతో పాటు జీటీ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్​గా ఉన్న విక్రమ్ సోలంకీ కూడా బయటకు వెళ్లడం గ్యారెంటీనట. ఇప్పటికే గుజరాత్ బ్యాటింగ్ కోచ్, మెంటార్ గ్యారీ కిర్​స్టెన్ ఆ ఫ్రాంచైజీని వీడాడు. పాకిస్థాన్ నేషనల్ టీమ్​కు కోచ్​గా ఆఫర్ రావడంతో కిర్​స్టెన్ వెళ్లిపోయాడు.

అటు కిర్​స్టెన్ వెళ్లిపోవడం.. ఇప్పుడు నెహ్రా, విక్రమ్ సోలంకీ కూడా టీమ్​ను వీడేందుకు సిద్ధమవడంతో గుజరాత్ కొత్త కోచ్​ను అన్వేషిస్తోందట. ఆ రోల్ కోసం ఎలాగోలా కష్టపడి యువరాజ్​ను ఒప్పించిందని వినికిడి. అయితే ఇంకా ఏదీ ఫైనలైజ్ కాలేదని.. కానీ యువీ ఎస్ చెప్పే ఛాన్స్ ఉందని సమాచారం. గుజరాత్ కెప్టెన్ శుబ్​మన్ గిల్​ను తయారు చేసి, ఈ రేంజ్​కు చేర్చింది యువీనే అనే విషయం తెలిసిందే. అటు గిల్​తో ఉన్న సాన్నిహిత్యం, ఇటు జీటీ బిగ్ ఆఫర్​తో పాటు టీమ్​పై అథారిటీ, ఫుల్ ఫ్రీడమ్, పవర్స్ ఇవ్వడంతో యువీ కాదనలేకపోతున్నాడని ఎక్స్​పర్ట్స్ అంటున్నారు. ఒకవేళ అతడు ఓకే అంటే మాత్రం ప్రొఫెషనల్ క్రికెట్​లో యువీ కోచ్​గా రావడం ఇదే తొలిసారి అవుతుంది. ఇక, నెహ్రా కోచింగ్​లో 2022లో గుజరాత్ ఛాంపియన్స్​గా నిలిచింది. ఆ తర్వాతి సీజన్​ రన్నరప్​తో సరిపెట్టుకుంది. కానీ ఈసారి మాత్రం లీగ్ స్టేజ్​కే పరిమితమైంది. మరి.. యువీని కోచ్​గా చూడాలని మీరు అనుకుంటే కామెంట్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి