iDreamPost
android-app
ios-app

Axar Patel: సూర్యను ఊరికే కెప్టెన్ చేయలేదు.. ఆ టాలెంట్ వల్లే సారథ్యం దక్కింది: అక్షర్

  • Published Jul 23, 2024 | 6:30 PMUpdated Jul 23, 2024 | 6:30 PM

Suryakumar Yadav: టీమిండియా టీ20 నయా కెప్టెన్​గా సూర్యకుమార్​ యాదవ్ నియమితుడైన సంగతి తెలిసిందే. స్టార్ ఆల్​రౌండర్ హార్దిక్ పాండ్యాతో పోటీ నెలకొన్నా మిస్టర్ 360కే సారథ్య పగ్గాలు దక్కాయి.

Suryakumar Yadav: టీమిండియా టీ20 నయా కెప్టెన్​గా సూర్యకుమార్​ యాదవ్ నియమితుడైన సంగతి తెలిసిందే. స్టార్ ఆల్​రౌండర్ హార్దిక్ పాండ్యాతో పోటీ నెలకొన్నా మిస్టర్ 360కే సారథ్య పగ్గాలు దక్కాయి.

  • Published Jul 23, 2024 | 6:30 PMUpdated Jul 23, 2024 | 6:30 PM
Axar Patel: సూర్యను ఊరికే కెప్టెన్ చేయలేదు.. ఆ టాలెంట్ వల్లే సారథ్యం దక్కింది: అక్షర్

టీమిండియా టీ20 నయా కెప్టెన్​గా సూర్యకుమార్​ నియమితుడైన సంగతి తెలిసిందే. స్టార్ ఆల్​రౌండర్ హార్దిక్ పాండ్యాతో పోటీ నెలకొన్నా మిస్టర్ 360కే సారథ్య పగ్గాలు దక్కాయి. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ పొట్టి ప్రపంచ కప్-2024తో టీ20 క్రికెట్​కు గుడ్​బై చెప్పేశాడు. దీంతో కొత్త సారథి కోసం వెతుకులాట మొదలుపెట్టిన భారత క్రికెట్ బోర్డు.. తొలుత హార్దిక్​ను ఆ రోల్​కు ఖరారు చేసిందంటూ వార్తలు వచ్చాయి. టీ20 వరల్డ్ కప్​లో వైస్ కెప్టెన్​గా చేయడం, జట్టు ట్రోఫీ గెలవడంలో కీలక పాత్ర పోషించడం, సీనియర్ కూడా కావడంతో అతడే నెక్స్ట్ కెప్టెన్ అని అంతా ఫిక్స్ అయ్యారు. కానీ అనూహ్యంగా సూర్యకుమార్ పేరు తెర పైకి వచ్చింది. ఆఖరికి అతడ్నే కెప్టెన్​గా నియమించింది బీసీసీఐ.

గతంలో పలు సిరీస్​లకు సారథిగా ఉండటం, కూల్ యాటిట్యూడ్, నంబర్ వన్ బ్యాటర్ కావడం సూర్యకు ప్లస్​గా మారింది. ఫిట్​నెస్ ఇష్యూస్​ పాండ్యాకు మైనస్​గా మారింది. స్వయంగా కోచ్ గంభీర్ కూడా ఇదే విషయం చెప్పాడు. ఫిట్​నెస్​ ఇబ్బందుల కారణంగానే అతడికి కెప్టెన్సీ దక్కలేదన్నాడు. ప్రతి మ్యాచ్​కు అందుబాటులో ఉండే సారథి కావాలనే ఉద్దేశంతోనే సూర్యను ఆ రోల్​కు సెలెక్ట్ చేశామన్నాడు. అయితే పాండ్యాకు అన్యాయం చేశారని.. సూర్య కంటే కెప్టెన్సీకి అతడే బెటర్ అని కొందరు నెటిజన్స్ విమర్శిస్తున్నారు. తాజాగా ఈ కాంట్రవర్సీపై టీమిండియా స్పిన్ ఆల్​రౌండర్ అక్షర్ పటేల్ రియాక్ట్ అయ్యాడు. మిస్టర్ 360కి సారథ్య పగ్గాలు ఊరికే రాలేదని.. అతడిలోని టాలెంట్ చూసే ఆ పదవి దక్కిందన్నాడు.

‘టీ20 కెప్టెన్సీ పోస్ట్​కు సూర్యకుమార్ వందశాతం అర్హుడు. డ్రెస్సింగ్ రూమ్​ నుంచి కూడా అతడికి పూర్తి మద్దతు ఉంది. అతడికి సూపర్బ్ క్రికెటింగ్ బ్రెయిన్ ఉంది. వరల్డ్ టీ20 బెస్ట్ బ్యాటర్స్​లో అతడు ఎప్పుడూ ముందు వరుసలోనే ఉంటాడు’ అని అక్షర్ చెప్పుకొచ్చాడు. మంచి క్రికెటింగ్ బ్రెయిన్ ఉండటం సూర్యకు ఉన్న మరో టాలెంట్ అని.. అతడికి సారథ్య పగ్గాలు దక్కడానికి ఇదో రీజన్ అన్నాడు. సూర్యతో తాను చాలా సమయం గడిపానని.. అతడు ఎప్పుడూ హ్యాపీగా ఉంటాడని అక్షర్ తెలిపాడు. తాను సంతోషంగా ఉంటూ, మిగతా వారిని కూడా ఆనందంగా ఉంచేందుకు ప్రయత్నిస్తాడని మెచ్చుకున్నాడు. సరదా ఉండటం, మిమిక్రీ చేయడం, అందరితో కలసిపోవడం, జట్టు వాతావరణాన్ని ఆహ్లాదంగా ఉంచడంలో సూర్య సూపర్ అంటూ ప్రశంసల జల్లులు కురిపించాడు అక్షర్. మరి.. కెప్టెన్సీ బాధ్యతల్ని మోయడంలో సూర్య సక్సెస్ అవుతాడని మీరు భావిస్తే కామెంట్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి