SNP
ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్ట్‌లో టీమిండియా యువ ఓపెనర్ జైస్వాల్ సెంచరీతో కదంతొక్కాడు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తర్వగానే అవుటైనా.. అగ్రెసివ్ బ్యాటింగ్‌తో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ సెంచరీ గురించి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్ట్‌లో టీమిండియా యువ ఓపెనర్ జైస్వాల్ సెంచరీతో కదంతొక్కాడు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తర్వగానే అవుటైనా.. అగ్రెసివ్ బ్యాటింగ్‌తో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ సెంచరీ గురించి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
SNP
ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్ట్‌లో టీమిండియా యువ క్రికెటర్ యశస్వి జైస్వాల్ ఊరమాస్ బ్యాటింగ్‌తో ఇంగ్లండ్ జట్టును వణికించాడు. 35 పరుగుల వరకు చాలా నిదానంగా ఆడిన జైస్వాల్.. అక్కడి నుంచి ఏదో పూనకం వచ్చినట్లు ఊగిపోయాడు. 73 బంతులాడి 35 పరుగులు చేసిన జైస్వాల్.. తర్వాత కేవలం 7 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్క్ అందుకున్నాడు. ఇంగ్లండ్ సీనియర్ పేసర్ జెమ్స్ అండర్సన్ వేసిన ఇన్నింగ్స్ 27వ ఓవర్‌లో చివరి మూడు బంతుల్లో 6, 4, 4 బాది ఒక్కసారిగా గేర్ మార్చేశాడు. అప్పటి వరకు కూల్‌గా ఆడుతున్న జైస్వాల్.. ఇలా ఒక్కసారిగా జూలువిల్చిన సింహంలా రెచ్చిపోవడంతో అసలేం జరుగుతుందో కూడా ఇంగ్లండ్ బౌలర్లకు అర్థం కాలేదు.
అండర్సన్ ఓవర్‌లో 6, 4, 4 బాది జైస్వాల్ ఆ తర్వాత హార్ట్లీ వేసిన ఓవర్‌లో వరుసగా రెండు సిక్సులు బాదాడు. తర్వాత రెహాన్ అహ్మద్ వేసిన ఇన్నింగ్స్ 31వ ఓవర్‌లో మరో సిక్స్ బాదాడు. మొత్తంగా బజ్‌బాల్ క్రికెట్ అంటూ బొక్కబోర్లా పడ్డ ఇంగ్లండ్‌కు జైస్వాల్.. అసలైన బజ్‌బాల్ ఏంటో రుచిచూపించాడు. జైస్వాల్ ఒక్కసారిగా గేర్ మార్చి బ్యాటింగ్ చేస్తుంటే.. డ్రెస్సింగ్ రూమ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రవిడ్ షాకై చూస్తుండిపోయారు. జైస్వాల్ ఎందుకిలా ఆడుతున్నాడో వారికి కూడా అర్థం కాలేదు. చూస్తుండగానే.. 122 బంతుల్లో 9 ఫోర్లు 5 సిక్సులతో సెంచరీ మార్క్ అందుకున్నాడు.
ఇప్పటికే ఈ సిరీస్‌లో జైస్వాల్ తొలి టెస్ట్‌లో ఒక హాఫ్ సెంచరీ, రెండో టెస్టులో ఒక డబుల్ సెంచరీ అదరగొట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ సెంచరీతో.. ఈ సిరీస్‌లో ఇప్పటి వరకు అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా జైస్వాల్ నిలిచాడు. 400 పైచిలుకు పరుగులు చేశాడు ఈ యువ ఓపెనర్. మూడో టెస్ట్‌లో టీమిండియా గెలవాలంటే.. ఇంగ్లండ్ ముందు కనీసం 450 నుంచి 500 పరుగుల టార్గెట్‌ను ఉంచాల్సిందే. ఇలాంటి టైమ్‌లో జైస్వాల్ సెంచరీతో చెలరేగడం ఇండియాకు ఎంతో కలిసొచ్చే అంశం. మరి అగ్రెసివ్ బ్యాటింగ్‌తో సెంచరీ పూర్తి చేసుకున్న జైస్వాల్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.