Nidhan
Virat Kohli, Rohit Sharma, Yashasvi Jaiswal: టీమిండియా యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ అరుదైన ఘనతకు అడుగు దూరంలో ఉన్నాడు. బంగ్లాదేశ్‌తో జరిగే తొలి టెస్ట్‌లోనే అతడు ఈ ఫీట్ నమోదు చేయడం ఖాయంగా కనిపిస్తోంది.
Virat Kohli, Rohit Sharma, Yashasvi Jaiswal: టీమిండియా యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ అరుదైన ఘనతకు అడుగు దూరంలో ఉన్నాడు. బంగ్లాదేశ్‌తో జరిగే తొలి టెస్ట్‌లోనే అతడు ఈ ఫీట్ నమోదు చేయడం ఖాయంగా కనిపిస్తోంది.
Nidhan
ఈ మధ్య కాలంలో భారత క్రికెట్లో రివ్వున దూసుకొచ్చిన ఆటగాళ్ల ప్రస్తావన తీసుకొస్తే.. అందులో ముందంజలో ఉంటాడు యశస్వి జైస్వాల్. ఈ యంగ్ ఓపెనర్ అద్భుతమైన ఆటతీరుతో మూడు ఫార్మాట్లలోనూ కీలక ప్లేయర్‌గా ఎదుగుతున్నాడు. టీ20లు, టెస్టుల్లో అతడు బాగా రాణిస్తున్నాడు. ముఖ్యంగా లాంగ్ ఫార్మాట్లో అతడి బ్యాటింగ్ నెక్స్ట్ లెవల్లో ఉంది. కెప్టెన్ రోహిత్ శర్మతో కలసి ఓపెనింగ్ చేస్తున్న ఈ యువ కెరటం భారీ ఇన్నింగ్స్‌లతో ప్రత్యర్థులకు వణుకు పుట్టిస్తున్నాడు. మెరుపు సెంచరీలు బాదుతూ మ్యాచ్‌ను అపోజిషన్ టీమ్స్ నుంచి లాక్కుంటున్నాడు. బంగ్లాదేశ్‌తో టెస్ట్ సిరీస్‌లోనూ ఇదే రీతిలో అదరగొట్టాలని భావిస్తున్నాడు. అయితే టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీకే అతడు ఎసరు పెడుతున్నాడు. కింగ్ వల్ల కానిది జైస్వాల్ సాధించేలా ఉన్నాడు. అదేంటో ఇప్పుడు మనం చూద్దాం..
సాధారణంగా రికార్డులు అనగానే ప్రస్తుత క్రికెట్లో విరాట్ కోహ్లీ పేరే వినిపిస్తుంది. ఎన్నో అన్బ్రేకబుల్ రికార్డ్స్‌ను అతడు బద్దలు కొట్టాడు. అయితే అతడితో పాటు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు సాధ్యం కాని ఓ అరుదైన ఘనతను అందుకునేందుకు వడివడిగా పరుగులు పెడుతున్నాడు యశస్వి జైస్వాల్. బంగ్లాదేశ్‌తో సిరీస్‌లో టీమిండియా ప్లేయర్లను కొన్ని రేర్ రికార్డ్స్ ఊరిస్తున్నాయి. 22 ఏళ్ల జైస్వాల్ కూడా ఓ క్రేజీ రికార్డుకు దగ్గర్లో ఉన్నాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ సింగిల్ ఎడిషన్‌లో అత్యధిక రన్స్ చేసిన భారత బ్యాటర్‌గా నిలిచేందుకు జైస్వాల్ మరో 132 రన్స్ దూరంలో ఉన్నాడు. ఇప్పుడీ రికార్డు సీనియర్ బ్యాటర్ అజింక్యా రహానె పేరు మీద ఉంది. 2019-21 డబ్ల్యూటీసీ ఎడిషన్‌లో రహానె 1159 పరుగులు చేశాడు. డబ్ల్యూటీసీ 2023-25 ఎడిషన్‌లో జైస్వాల్ 1028 పరుగులు చేశాడు.
రహానేను దాటాలంటే జైస్వాల్ మరో 132 రన్స్ చేస్తే చాలు. బంగ్లాదేశ్‌తో తొలి టెస్ట్‌లోనే ఈ ఫీట్‌ను యంగ్ ఓపెనర్ అందుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో పాటు మరో రికార్డు కూడా అతడి కోసం ఎదురు చూస్తోంది. ఒక క్యాలెండర్ ఇయర్లో టెస్టుల్లో అత్యధిక సిక్సులు కొట్టిన బ్యాటర్‌గా నిలిచేందుకు జైస్వాల్ ఉవ్విళ్లూరుతున్నాడు. అందుకోసం అతడు మరో 8 సిక్సులు బాదాల్సి ఉంటుంది. ఈ సంవత్సరం జైస్వాల్ 26 సిక్సులు కొట్టాడు. మోస్ట్ సిక్సెస్ లిస్ట్‌లో బ్రెండన్ మెకల్లమ్ (33 సిక్సులు, 2014) టాప్‌లో ఉన్నాడు. అతడ్ని దాటాలంటే జైస్వాల్ మరో ఎనిమిది సిక్సులు బాదితే సరిపోతుంది. బంగ్లా సిరీస్‌లోనే ఈ క్రేజీ వరల్డ్ రికార్డును అతడు బ్రేక్ చేసే ఛాన్స్ ఉంది. ఇదే జరిగితే రోహిత్-కోహ్లీ వల్ల కాని మరో రికార్డును అతడు బద్దలు కొట్టినట్లవుతుంది. ముఖ్యంగా రికార్డ్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా చెప్పుకునే కింగ్‌కు సాధ్యం కానివి జైస్వాల్ చేసి చూపిస్తే అతడి వారసుడు అనిపించుకోవడం ఖాయం.