Nidhan
Gautam Gambhir Warning To Bangladesh: బంగ్లాదేశ్‌తో టెస్ట్ సిరీస్‌కు రెడీ అయిపోయింది టీమిండియా. చెన్నై వేదికగా గురువారం నుంచి జరిగే తొలి టెస్టులో ప్రత్యర్థితో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధంగా ఉంది రోహిత్ సేన.
Gautam Gambhir Warning To Bangladesh: బంగ్లాదేశ్‌తో టెస్ట్ సిరీస్‌కు రెడీ అయిపోయింది టీమిండియా. చెన్నై వేదికగా గురువారం నుంచి జరిగే తొలి టెస్టులో ప్రత్యర్థితో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధంగా ఉంది రోహిత్ సేన.
Nidhan
బంగ్లాదేశ్‌తో టెస్ట్ సిరీస్‌కు రెడీ అయిపోయింది టీమిండియా. చెన్నై వేదికగా గురువారం నుంచి జరిగే తొలి టెస్టులో ప్రత్యర్థితో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధంగా ఉంది రోహిత్ సేన. ఈ మ్యాచ్‌లో బంగ్లాను చిత్తు చేసి రెండు టెస్టుల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లాలని చూస్తోంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్.. ఇలా అన్ని విభాగాల్లోనూ సూపర్ స్ట్రాంగ్‌గా ఉండటంతో అపోజిషన్ టీమ్‌ను ఓ ఆటాడుకోవాలని చూస్తోంది. చెపాక్ పిచ్‌పై బంగ్లాను చిత్తు చిత్తుగా ఓడించాలని భావిస్తోంది. అయితే పాకిస్థాన్‌ను క్లీన్‌స్వీప్ చేశామన్న ఓవర్ కాన్ఫిడెన్స్‌తో ఈ మధ్య బంగ్లా కాస్త అతిగా ప్రవర్తించింది. సిరీస్‌కు ముందే మన టీమ్‌కు వార్నింగ్ ఇచ్చింది. దీనికి తాజాగా భారత కోచ్ గంభీర్ కౌంటర్ ఇచ్చాడు. తొలి టెస్ట్ మొదలవడానికి ముందే ఆ జట్టుకు హెచ్చరికలు పంపించాడు. అసలు గౌతీ ఏమన్నాడో ఇప్పుడు చూద్దాం..
చెపాక్‌లో తమ స్పిన్నర్లు చెలరేగడం ఖాయమని గంభీర్ అన్నాడు. టాప్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌తో పాటు రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్ త్రయంతో జాగ్రత్తగా ఉండాలంటూ బంగ్లాదేశ్‌ను హెచ్చరించాడు గౌతీ. తమ స్పిన్నర్లు మామూలోళ్లు కాదని.. వాళ్లతో పెట్టుకుంటే చిత్తవడం ఖాయమని స్పష్టం చేశాడు. చెన్నైలో ఈసారి మ్యాచ్ జరిగేది ఎర్ర మట్టి పిచ్ మీదే అయినప్పటికీ.. తమ దగ్గర క్వాలిటీ స్పిన్ అటాక్ ఉందన్నాడు భారత హెడ్ కోచ్. తమ స్పిన్నర్లు చెపాక్ పిచ్‌పై మ్యాజిక్ చేస్తారని.. వాళ్లతో బీ కేర్‌ఫుల్ అంటూ ప్రత్యర్థి జట్టుకు గట్టిగా ఇచ్చిపడేశాడు. కాగా, పాక్‌తో సిరీస్‌లో గెలిచాక బంగ్లా కెప్టెన్ షంటో ఓవరాక్షన్ చేశాడు. తమ స్పిన్నర్లు అద్భుతంగా రాణించారని.. ఇదే రీతిలో ఆడితే భారత్‌ను కూడా చిత్తు చేయడం పక్కా అంటూ వార్నింగ్ ఇచ్చాడు.
టీమిండియాను ఓడించేందుకే వస్తున్నామంటూ బంగ్లాదేశ్ కెప్టెన్ షంటో కామెంట్ చేయడంతో అప్పట్లో దుమారం రేగింది. భారత్‌ను భారత్‌లో అందునా టెస్టుల్లో ఓడించడం అంటే మాటలా! ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, సౌతాఫ్రికా లాంటి టాప్ టీమ్సే.. ఇండియా టూర్ అంటే వణికిపోతాయి. ఇక్కడ టెస్టుల్లో గెలవడం మాట పక్కనబెడితే.. మ్యాచ్‌ను కనీసం నాలుగో రోజుకు తీసుకెళ్లినా గొప్పగా భావిస్తారు. క్వాలిటీ స్పిన్ అటాక్, అద్భుతమైన పేస్ అటాక్ ఉన్న మెన్ ఇన్ బ్లూతో మ్యాచ్ అంటే భయపడతారు. కానీ బంగ్లాదేశ్ ఇవన్నీ మర్చిపోయి ఓడిస్తామంటూ ఓవరాక్షన్ చేసింది. అందుకే తాజాగా గంభీర్ ఆ టీమ్‌కు ఇచ్చిపడేశాడు. తమ స్పిన్ అటాక్‌ను తక్కువ అంచనా వేస్తే మట్టికరవడం ఖాయమని హెచ్చరించాడు. మరి.. ఈ మొత్తం వ్యవహారంపై మీ ఒపీనియన్‌ను కామెంట్ చేయండి.