iDreamPost
android-app
ios-app

కోహ్లీకి ఎసరు పెడుతున్న జైస్వాల్! కింగ్ వల్ల కానిది సాధించేలా ఉన్నాడు!

  • Published Sep 18, 2024 | 10:02 PM Updated Updated Sep 18, 2024 | 10:11 PM

Virat Kohli, Rohit Sharma, Yashasvi Jaiswal: టీమిండియా యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ అరుదైన ఘనతకు అడుగు దూరంలో ఉన్నాడు. బంగ్లాదేశ్​తో జరిగే తొలి టెస్ట్​లోనే అతడు ఈ ఫీట్ నమోదు చేయడం ఖాయంగా కనిపిస్తోంది.

Virat Kohli, Rohit Sharma, Yashasvi Jaiswal: టీమిండియా యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ అరుదైన ఘనతకు అడుగు దూరంలో ఉన్నాడు. బంగ్లాదేశ్​తో జరిగే తొలి టెస్ట్​లోనే అతడు ఈ ఫీట్ నమోదు చేయడం ఖాయంగా కనిపిస్తోంది.

  • Published Sep 18, 2024 | 10:02 PMUpdated Sep 18, 2024 | 10:11 PM
కోహ్లీకి ఎసరు పెడుతున్న జైస్వాల్! కింగ్ వల్ల కానిది సాధించేలా ఉన్నాడు!

ఈ మధ్య కాలంలో భారత క్రికెట్​లో రివ్వున దూసుకొచ్చిన ఆటగాళ్ల ప్రస్తావన తీసుకొస్తే.. అందులో ముందంజలో ఉంటాడు యశస్వి జైస్వాల్. ఈ యంగ్ ఓపెనర్ అద్భుతమైన ఆటతీరుతో మూడు ఫార్మాట్లలోనూ కీలక ప్లేయర్​గా ఎదుగుతున్నాడు. టీ20లు, టెస్టుల్లో అతడు బాగా రాణిస్తున్నాడు. ముఖ్యంగా లాంగ్ ఫార్మాట్​లో అతడి బ్యాటింగ్ నెక్స్ట్ లెవల్​లో ఉంది. కెప్టెన్ రోహిత్ శర్మతో కలసి ఓపెనింగ్​ చేస్తున్న ఈ యువ కెరటం భారీ ఇన్నింగ్స్​లతో ప్రత్యర్థులకు వణుకు పుట్టిస్తున్నాడు. మెరుపు సెంచరీలు బాదుతూ మ్యాచ్​ను అపోజిషన్ టీమ్స్ నుంచి లాక్కుంటున్నాడు. బంగ్లాదేశ్​తో టెస్ట్ సిరీస్​లోనూ ఇదే రీతిలో అదరగొట్టాలని భావిస్తున్నాడు. అయితే టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీకే అతడు ఎసరు పెడుతున్నాడు. కింగ్ వల్ల కానిది జైస్వాల్ సాధించేలా ఉన్నాడు. అదేంటో ఇప్పుడు మనం చూద్దాం..

సాధారణంగా రికార్డులు అనగానే ప్రస్తుత క్రికెట్​లో విరాట్ కోహ్లీ పేరే వినిపిస్తుంది. ఎన్నో అన్​బ్రేకబుల్ రికార్డ్స్​ను అతడు బద్దలు కొట్టాడు. అయితే అతడితో పాటు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు సాధ్యం కాని ఓ అరుదైన ఘనతను అందుకునేందుకు వడివడిగా పరుగులు పెడుతున్నాడు యశస్వి జైస్వాల్. బంగ్లాదేశ్​తో సిరీస్​లో టీమిండియా ప్లేయర్లను కొన్ని రేర్ రికార్డ్స్​ ఊరిస్తున్నాయి. 22 ఏళ్ల జైస్వాల్ కూడా ఓ క్రేజీ రికార్డుకు దగ్గర్లో ఉన్నాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్​షిప్ సింగిల్ ఎడిషన్​లో అత్యధిక రన్స్ చేసిన భారత బ్యాటర్​గా నిలిచేందుకు జైస్వాల్ మరో 132 రన్స్ దూరంలో ఉన్నాడు. ఇప్పుడీ రికార్డు సీనియర్ బ్యాటర్ అజింక్యా రహానె పేరు మీద ఉంది. 2019-21 డబ్ల్యూటీసీ ఎడిషన్​లో రహానె 1159 పరుగులు చేశాడు. డబ్ల్యూటీసీ 2023-25 ఎడిషన్​లో జైస్వాల్ 1028 పరుగులు చేశాడు.

రహానేను దాటాలంటే జైస్వాల్ మరో 132 రన్స్ చేస్తే చాలు. బంగ్లాదేశ్​తో తొలి టెస్ట్​లోనే ఈ ఫీట్​ను యంగ్ ఓపెనర్ అందుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో పాటు మరో రికార్డు కూడా అతడి కోసం ఎదురు చూస్తోంది. ఒక క్యాలెండర్ ఇయర్​లో టెస్టుల్లో అత్యధిక సిక్సులు కొట్టిన బ్యాటర్​గా నిలిచేందుకు జైస్వాల్ ఉవ్విళ్లూరుతున్నాడు. అందుకోసం అతడు మరో 8 సిక్సులు బాదాల్సి ఉంటుంది. ఈ సంవత్సరం జైస్వాల్ 26 సిక్సులు కొట్టాడు. మోస్ట్ సిక్సెస్ లిస్ట్​లో బ్రెండన్ మెకల్లమ్ (33 సిక్సులు, 2014) టాప్​లో ఉన్నాడు. అతడ్ని దాటాలంటే జైస్వాల్ మరో ఎనిమిది సిక్సులు బాదితే సరిపోతుంది. బంగ్లా సిరీస్​లోనే ఈ క్రేజీ వరల్డ్ రికార్డును అతడు బ్రేక్ చేసే ఛాన్స్ ఉంది. ఇదే జరిగితే రోహిత్-కోహ్లీ వల్ల కాని మరో రికార్డును అతడు బద్దలు కొట్టినట్లవుతుంది. ముఖ్యంగా రికార్డ్స్​కు కేరాఫ్​ అడ్రస్​గా చెప్పుకునే కింగ్​కు సాధ్యం కానివి జైస్వాల్ చేసి చూపిస్తే అతడి వారసుడు అనిపించుకోవడం ఖాయం.