Nidhan
Team India: టీమిండియా యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఇప్పుడు భీకర ఫామ్‌లో ఉన్నాడు. జింబాబ్వేతో సిరీస్‌లో అతడు పరుగుల వరద పారిస్తున్నాడు. క్లీన్ హిట్టింగ్తో అలరిస్తున్నాడు.
Team India: టీమిండియా యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఇప్పుడు భీకర ఫామ్‌లో ఉన్నాడు. జింబాబ్వేతో సిరీస్‌లో అతడు పరుగుల వరద పారిస్తున్నాడు. క్లీన్ హిట్టింగ్తో అలరిస్తున్నాడు.
Nidhan
టీమిండియా యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఇప్పుడు భీకర ఫామ్‌లో ఉన్నాడు. జింబాబ్వేతో సిరీస్‌లో అతడు పరుగుల వరద పారిస్తున్నాడు. క్లీన్ హిట్టింగ్తో అలరిస్తున్నాడు. నాలుగో టీ20లో 53 బంతుల్లోనే 93 పరుగులు బాదేశాడు. ఇందులో 13 బౌండరీలతో పాటు 2 భారీ సిక్సులు ఉన్నాయి. ఇన్నింగ్స్ తొలి బంతి నుంచే దంచుడు స్టార్ట్ చేసిన ఈ 22 ఏళ్ల బ్యాటర్.. మ్యాచ్ ముగిసే వరకు బాదుడు ఆపలేదు. ఫోర్ల మీద ఫోర్లు కొడుతూ అపోజిషన్ బౌలర్లకు ఊపిరాడనివ్వలేదు. అతడి ఇన్నింగ్స్‌తో జింబాబ్వేకు కనీసం ఫైట్ చేసేందుకు కూడా ఛాన్స్ లేకపోయింది. పిడుగు వచ్చి మీద పడ్డట్లు జైస్వాల్ వాళ్ల మీద పడటంతో ఆతిథ్య జట్టు బౌలర్లు గుడ్లు తేలేశారు. అయితే అతడు సెంచరీ మిస్ అవడం అభిమానులకు బాధ కలిగించింది.
వన్డేలు, టెస్టుల్లో సెంచరీ చేయడం కామనే. కానీ టీ20 క్రికెట్లో మూడంకెల మార్క్‌ను అందుకోవడం అంత ఈజీ కాదు. ఆ అవకాశం వచ్చినప్పుడు సెంచరీ చేస్తే ఫ్యాన్స్ కూడా హ్యాపీ ఫీలవుతారు. మొన్న జింబాబ్వేతో మ్యాచ్‌లో సరిగ్గా ప్లాన్ చేస్తే జైస్వాల్ శతకం పూర్తయ్యేది. అవతల ఉన్న కెప్టెన్ శుబ్‌మన్ గిల్ సరైన వ్యూహంతో అతడికి సపోర్ట్ చేస్తే ఆ ఫీట్‌ను అందుకునేవాడే. కానీ రికార్డులు, మైల్‌స్టోన్స్ కంటే జట్టు విజయం, డామినేషన్ ముఖ్యమనే రోహిత్ శర్మ సిద్ధాంతాన్ని ఫాలో అయ్యాడు గిల్. మ్యాచ్‌ను వేగంగా ముగించేశాడు. దీంతో అతడు సెల్ఫిష్ అని, జైస్వాల్ సెంచరీ మిస్ అవడానికి అతడే కారణంటూ కొందరు విమర్శలు చేశారు. ఇంత అసూయ ఎందుకంటూ తిట్టిపోశారు. ఈ కాంట్రవర్సీపై తాజాగా జైస్వాల్ రియాక్ట్ అయ్యాడు. ఇందులో గిల్ తప్పేమీ లేదన్నాడు.
‘మ్యాచ్‌ను సాధ్యమైనంత వేగంగా పూర్తి చేయాలనే ఉద్దేశంతోనే కెప్టెన్ గిల్‌తో కలసి నేను బ్యాటింగ్ చేశా. వికెట్ కోల్పోకుండా మ్యాచ్‌ను ముగించాలని, వేగంగా మ్యాచ్‌ను ఫినిష్ చేయాలని మేం ముందే డిసైడ్ అయ్యాం. అందుకు తగ్గట్లే ఆడుతూ పోయాం’ అని జైస్వాల్ స్పష్టం చేశాడు. అంతేగానీ ఈ విషయంలో గిల్‌ను విమర్శించడం కరెక్ట్ కాదన్నాడు. భారత జట్టుకు ఆడటాన్ని ఎంతో ఆస్వాదిస్తున్నానని తెలిపాడీ యంగ్ ఓపెనర్. వరల్డ్ కప్ నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నానని జైస్వాల్ చెప్పుకొచ్చాడు. టీమిండియాకు ఎప్పుడు ఆడే అవకాశం దొరికినా తన బెస్ట్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తానని పేర్కొన్నాడీ లెఫ్టాండ్ బ్యాటర్. టీమ్‌ను గెలిపించేందుకు తన సైడ్ నుంచి హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెడతానని వివరించాడు. మరి.. ఈ మొత్తం ఉదంతంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.