iDreamPost
android-app
ios-app

Yashasvi Jaiswal: సెహ్వాగ్ సరసన జైస్వాల్.. ఈ సెంచరీ స్పెషల్ ఏంటో తెలుసా?

  • Published Feb 17, 2024 | 6:11 PM Updated Updated Feb 17, 2024 | 6:11 PM

ఇంగ్లాండ్ తో జరుగుతున్న మూడో టెస్ట్ లో అద్భుతమైన సెంచరీతో మరోసారి సత్తా చాటాడు జైస్వాల్. ఇక ఈ శతకంతో సెహ్వాగ్ సరసన చేరాడు. మరి ఈ సెంచరీ స్పెషల్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

ఇంగ్లాండ్ తో జరుగుతున్న మూడో టెస్ట్ లో అద్భుతమైన సెంచరీతో మరోసారి సత్తా చాటాడు జైస్వాల్. ఇక ఈ శతకంతో సెహ్వాగ్ సరసన చేరాడు. మరి ఈ సెంచరీ స్పెషల్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

Yashasvi Jaiswal: సెహ్వాగ్ సరసన జైస్వాల్.. ఈ సెంచరీ స్పెషల్ ఏంటో తెలుసా?

వీరేంద్ర సెహ్వాగ్.. ప్రపంచ క్రికెట్ చరిత్రలో అరివీర భయంకరమైన బ్యాటర్ గా ప్రసిద్ధి చెందిన విషయం తెలిసిందే. ఇంగ్లాండ్ టీమ్ ఇప్పుడు బజ్ బాల్ స్ట్రాటజీ అంటూ కోతలు కోస్తూ ఉంది. కానీ ఈ థియరీని ఎప్పుడో ప్రపంచ క్రికెట్ కు పరిచయం చేశాడు. తన డాషింగ్ బ్యాటింగ్ తో ప్రత్యర్థి బౌలర్లకు వణుకుపుట్టించేవాడు వీరేంద్రుడు. ప్రస్తుతం ఇదే తరహాలో రెచ్చిపోయి ఆడుతున్నాడు టీమిండియా యువ సంచలనం యశస్వీ జైస్వాల్. తాజాగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న మూడో టెస్ట్ లో అద్భుతమైన సెంచరీతో మరోసారి సత్తా చాటాడు జైస్వాల్. ఇక ఈ శతకంతో సెహ్వాగ్ సరసన చేరాడు. మరి ఈ సెంచరీ స్పెషల్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

యశస్వీ జైస్వాల్.. టీమిండియాకు దొరికిన మరో వీరేంద్ర సెహ్వాగ్. అచ్చం అతడిలానే ప్రత్యర్థి బౌలర్లపై ఆరంభంలోనే ఎదురుదాడికి దిగి.. వారిని ఒత్తిడిలోకి నెట్టడంలో దిట్ట. ఈ విషయం చాలా తొందరగానే ప్రపంచ క్రికెట్ కు తెలియజెప్పాడు ఈ యువ క్రికెటర్. పట్టుమని పది టెస్టులు కూడా ఆడకుండానే రికార్డుల మీద రికార్డులు బద్దలుకొడుతూ వస్తున్నాడు. రెండో టెస్ట్ లో కెరీర్ లో తొలి డబుల్ సెంచరీ సాధించిన జైస్వాల్.. అదే జోరును మూడో మ్యాచ్ లో సైతం చూపించాడు. 122 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్సులతో సెంచరీ మార్క్ ను అందుకున్నాడు.

ఈ క్రమంలోనే టీమిండియా దిగ్గజం, మాజీ డాషింగ్ బ్యాటర్ వీరేంద్ర సెహ్వాగ్ రికార్డ్ ను సమం చేశాడు జైస్వాల్. ఇంతకీ ఆ ఘనత ఏంటంటే? వీరేంద్ర సెహ్వాగ్ మూడు సెంచరీ చేయడానికి 13 ఇన్నింగ్స్ లు తీసుకున్నాడు. 53.31 సగటుతో,66.63 స్ట్రైక్ రేట్ తో 3 సెంచరీలు సాధించాడు. ఇతడితో పాటుగా టీమిండియా మాజీ ఆటగాడు సంజయ్ మంజ్రేకర్ కూడా ఈ ఘనత సాధించాడు. తాజాగా ఈ మ్యాచ్ లో సెంచరీ చేయడం ద్వారా జైస్వాల్ సైతం వీరి సరసన నిలిచాడు. 13 ఇన్నింగ్స్ ల్లో 62.25 యావరేజ్ తో 65.87 స్ట్రైక్ రేట్ తో మూడో సెంచరీ సాధించిన ఏడో ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు ఈ యువ ఆటగాడు. దీంతో జైస్వాల్ కెరీర్ లో ఇదో స్పెషల్ సెంచరీగా నిలిచింది.

ఇక ఈ మ్యాచ్ లో 133 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్సర్లతో 104 పరుగులు చేసి రిటైర్డ్ హర్ట్ గా వెనుదిరిగాడు జైస్వాల్. అతడికి తోడు శుబ్ మన్ గిల్(65) పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. రెండో రోజు ఆటముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసి.. 322 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది టీమిండియా. మరి ఈ సెంచరీతో డాషింగ్ బ్యాటర్ వీరేంద్ర సెహ్వాగ్ సరసన నిలిచిన యశస్వీ జైస్వాల్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: IND vs ENG: సై సినిమా సీన్ రిపీట్‌.. బ్రేక్‌ తర్వాత రెచ్చిపోయిన టీమిండియా!