SNP
SNP
వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్టులో టీమిండియా యువ క్రికెటర్ యశస్వి జైస్వాల్ సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన తొలి మ్యాచ్‌లోనే ఏకంగా సెంచరీతో చెలరేగాడు. ఇలా తొలి టెస్ట్ మ్యాచ్‌లోనే సెంచరీ చేసిన 16 మంది భారత క్రికెటర్ల సరసన నిలిచాడు. 171 పరుగులతో జీవితాంతం గుర్తుండిపోయే ఇన్నింగ్స్‌తో తన కెరీర్‌కు బలమైన పునాది వేసుకున్నాడు. 21 ఏళ్ల జైస్వాల్ ప్రస్తుతం టాక్ ఆఫ్‌ది క్రికెట్ టౌన్‌గా మారిపోయాడు.
అయితే.. వెస్టిండీస్‌పై సెంచరీ చేసిన తర్వాత జైస్వాల్ తన తండ్రికి ఫోన్ చేసి కన్నీటి పర్యంతమైయ్యాడు. టీమిండియా జెర్సీ ధరించి, దేశానికి ప్రాతినిధ్యం వహించడం ఏ యువ క్రికెటర్‌కైనా అంతిమ లక్ష్యం.. ఆ టార్గెట్‌ను ఎన్నో కష్టాలను భరించి అందుకుంటే.. అందులో ఉంటే కిక్కే వేరు. అలాంటి మధురమైన అనుభూతిని ఆస్వాదిస్తున్న జైస్వాల్.. ఆ సంతోషాన్ని కన్నీళ్ల రూపంలో తన తండ్రితో పంచుకున్నాడు.
సెంచరీ చేసిన రోజు భారత కాలమానం ప్రకారం ఉదయం 4.30 నిమిషాలకు తండ్రి భూపేంద్ర జైస్వాల్‌కు ఫోన్ చేసిన యశస్వి జైస్వాల్ ‘ఇప్పడు సంతోషంగా ఉందా?’ అని అడిగి.. కన్నీళ్లు పెట్టుకున్నాడు. కుమారుడు అడిగిన ప్రశ్నకు తండ్రి కూడా భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఈ ఎమోషనల్ ఫోన్ సంభాషణ గురించి జైస్వాల్ తండ్రి భూపేంద్ర జైస్వాల్ మీడియాకు తెలిపారు. అయితే కొడుకు సెంచరీ చేయడంతో.. ఆయన హరిద్వార్‌కు యూపీ నుంచి కాలినడకన యాత్ర చేపట్టిన విషయం తెలిసిందే. మరి జైస్వాల్ ఇన్నింగ్స్, ఎమోషనల్ మూమెంట్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: తెలుగు సినిమాలో యాక్ట్ చేసిన యశస్వి జైస్వాల్! ఆ సీన్లో ఉన్నది అతడేనా?