iDreamPost
android-app
ios-app

Yashasvi Jaiswal: జైస్వాల్‌ డబుల్‌ ధమాకా.. ఇంగ్లండ్‌ను ఉతికేశాడు!

  • Published Feb 03, 2024 | 10:19 AM Updated Updated Feb 03, 2024 | 10:40 AM

ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా యువ ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ డబుల్‌ సెంచరీతో చెలరేగాడు. ఇంగ్లండ్‌ బౌలింగ్‌ ఎటాక్‌ను ఉతికి ఆరేస్తూ.. సంచలన బ్యాటింగ్‌ చేశాడు.

ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా యువ ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ డబుల్‌ సెంచరీతో చెలరేగాడు. ఇంగ్లండ్‌ బౌలింగ్‌ ఎటాక్‌ను ఉతికి ఆరేస్తూ.. సంచలన బ్యాటింగ్‌ చేశాడు.

  • Published Feb 03, 2024 | 10:19 AMUpdated Feb 03, 2024 | 10:40 AM
Yashasvi Jaiswal: జైస్వాల్‌ డబుల్‌ ధమాకా.. ఇంగ్లండ్‌ను ఉతికేశాడు!

‘జై’ స్వాల్‌.. ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ఈ కుర్రాడి ఆట చూసిన తర్వాత అందరి నోట వినిపిస్తున్న మాట. సంచలన బ్యాటింగ్‌తో ఇంగ్లండ్‌ బౌలింగ్‌ను చీల్చిచెండాడు. జట్టులోని మిగతా బ్యాటర్లంతా విఫలం అవుతున్నా కూడా ఒక్కటే ఒంటరి పోరాటం చేస్తూ.. డబుల్‌ సెంచరీతో చెలరేగాడు. 277 బంతుల్లో 18 ఫోర్లు, 7 సిక్సులతో 201 పరుగులు చేశాడు. 94 పరుగుల వద్ద ఉన్నప్పుడు సిక్స్‌తో సెంచరీని అందుకున్నట్లే.. 191 పరుగుల వద్ద ఉన్న సమయంలో వరుసగా సిక్స్‌, ఫోర్‌ కొట్టి తనదైన అగ్రెసివ్‌ ఇంటెంట్‌తోనే డబుల్‌ సెంచరీ మార్క్‌ను అందుకోవడం విశేషం. కాగా, జైస్వాల్‌కు ఇది తొలి డబుల్‌ సెంచరీ. ఇండియా నెక్ట్స్‌ సూపర్‌ స్టార్‌ అంటూ ఆరంభంలోనే ప్రశంసలు అందుకున్న జైస్వాల్‌.. అదే ఆట తీరును గ్రౌండ్‌లో కొనసాగిస్తున్నాడు. ప్రస్తుతం రెండో టెస్టులో ఇండియా పటిష్టస్థితిలో నిలిచిందంటే అందుకు కారణం.. జైస్వాలే.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ తొలుత బ్యాటింగ్‌ చేసేందుకు నిర్ణయించాడు. జైస్వాల్‌తో కలిసి ఇన్నింగ్స్‌ ఆరంభించిన రోహిత్‌ శర్మ తన బ్యాటింగ్‌ ఫామ్‌నే కొనసాగించాడు. కేవలం 14 పరుగులు మాత్రమే చేసి అవుట్‌ అయ్యాడు. అప్పటికే మంచి టచ్‌లో కనిపించి జైస్వాల్‌ మాత్రం.. తర్వాత వచ్చిన బ్యాటర్లతో భాగస్వామ్యాలు నెలకొల్పుతూ.. ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. కానీ, జైస్వాల్‌కు మిగతా బ్యాటర్ల నుంచి అంతగా మద్దతు దక్కలేదు. వన్‌ డౌన్‌లో వచ్చిన శుబ్‌మన్‌ గిల్‌ 34 పరుగులు మాత్రమే చేసి అవుట్‌ అయ్యాడు. తర్వాత వచ్చిన శ్రేయస్‌ అయ్యర్‌ సైతం 27 పరుగులే చేసి వికెట్‌ పారేసుకున్నాడు. గిల్‌, అయ్యర్‌ గత కొంతకాలంగా ఫామ్‌లో లేరు. అదే బ్యాడ్‌ ఫామ్‌ను ఈ టెస్టులో కూడా కొనసాగించారు.

ఇక ఈ మ్యాచ్‌తో అరంగేట్రం చేసిన రజత్‌ పాటిదార్‌ ఉన్నంత సేపు ఆకట్టుకున్నాడు. జైస్వాల్‌కు మంచి సపోర్ట్ అందించాడు. కానీ, దురదృష్టవశాత్తు 32 పరుగులు చేసిన తర్వాత అవుట్‌ అయ్యాడు. పాటిదార్‌ తర్వాత అక్షర్‌ పటేల్‌ 27, కేఎస్‌ భరత్‌ 17 పరుగులు చేసి అవుట్‌ అయ్యారు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 6 వికెట్లు నష్టపోయి 336 పరుగులు చేసింది. జైస్వాల్‌ 179, అశ్విన్‌ 10 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచి తొలి రోజు ముగించారు. రెండో రోజు ఆట ప్రారంభించి.. జైస్వాల్‌, అశ్విన్‌ నిలకడగానే బ్యాటింగ్‌ చేశారు. 20 పరుగులు చేసిన తర్వాత అశ్విన్‌ అవుట్‌ అయ్యాడు.కానీ, జైస్వాల్‌ డబుల్‌ సెంచరీ పూర్తి చేసుకుని.. 290 బంతుల్లో 19 ఫోర్లు, 7 సిక్సులతో 209 పరుగులు చేసి అండర్సన్‌ బౌలింగ్‌లో బెయిర్‌స్టోకి క్యాచ్‌ ఇచ్చి అవుట్‌ అయ్యాడు. మరి ఈ మ్యాచ్‌లో ప్రధాన బ్యాటర్లంతా విఫలమైనా.. జైస్వాల్‌ డబుల్‌ సెంచరీతో చెలరేగడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.