iDreamPost
android-app
ios-app

చరిత్ర సృష్టించిన జైస్వాల్.. సచిన్ రికార్డుకు ఎసరు!

  • Published Feb 24, 2024 | 4:09 PM Updated Updated Feb 24, 2024 | 4:09 PM

ఇంగ్లండ్ తో జరుగుతున్న 4వ టెస్ట్ లో టీమిండియా యువ బ్యాటర్ చరిత్ర సృష్టించాడు. రోహిత్ శర్మ రికార్డు బద్దలు కొట్టడమే కాకుండా.. ఏకంగా సచిన్ రికార్డుకే ఎసరు పెట్టాడు.

ఇంగ్లండ్ తో జరుగుతున్న 4వ టెస్ట్ లో టీమిండియా యువ బ్యాటర్ చరిత్ర సృష్టించాడు. రోహిత్ శర్మ రికార్డు బద్దలు కొట్టడమే కాకుండా.. ఏకంగా సచిన్ రికార్డుకే ఎసరు పెట్టాడు.

చరిత్ర సృష్టించిన జైస్వాల్.. సచిన్ రికార్డుకు ఎసరు!

టీమిండియా యంగ్ ప్లేయర్ యశస్వీ జైస్వాల్ ఇంగ్లండ్ తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో దుమ్మురేపుతున్నాడు. పరుగులవరదపారిస్తూ.. దూసుకెళ్తున్నాడు. ఈ క్రమంలోనే పలు రికార్డులను బద్దలు కొడుతూ.. సరికొత్త చరిత్రలు సృష్టిస్తున్నాడు. తాజాగా జరుగుతున్న 4వ టెస్టు తొలి ఇన్నింగ్స్ లో హాఫ్ సెంచరీతో సత్తాచాటాడు జైస్వాల్. దీంతో రోహిత్ శర్మ, కపిల్ దేవ్ లాంటి దిగ్గజాల రికార్డులను బద్దలుకొడుతూ టెస్ట్ క్రికెట్ లో సరికొత్త చరిత్రను సృష్టించాడు.

యశస్వీ జైస్వాల్.. ప్రస్తుతం టీమిండియాలో స్టార్ బ్యాటర్ గా వెలుగొందుతున్నాడు. తనదైన ఆటతీరుతో ఇంగ్గండ్ తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో పరుగుల వేటను కొనసాగిస్తున్నాడు. తాజాగా రాంచీ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో 117 బంతుల్లో 8 ఫోర్లు, ఓ సిక్సర్ తో 73 పరుగులు చేశాడు. ఇక ఈ ఇన్నింగ్స్ లో బాదిన సిక్సర్ తో మరో భారీ రికార్డును సాధించాడు. ఒక టెస్ట్ సిరీస్ లో అత్యధిక సిక్సర్లు బాదిన ఏకైక ప్లేయర్ గా నిలిచాడు జైస్వాల్. అతడు ఈ సిరీస్ లో ఇప్పటికే 23 సిక్సర్లు బాదాడు. తర్వాత ప్లేస్ లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఉన్నాడు. రోహిత్ 2019లో సౌతాఫ్రికాతో జరిగిన టెస్ట్ సిరీస్ లో 19 సిక్సర్లు బాదాడు.

దీంతో పాటుగా ఒకే జట్టుపై అత్యధిక సిక్సర్లు బాదిన రెండో ఇండియన్ ప్లేయర్ గా జైస్వాల్ సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ఈ క్రమంలోనే రోహిత్, కపిల్ దేవ్, రిషబ్ పంత్ రికార్డులను బద్దలుకొట్టాడు. మరో రెండు సిక్సర్లు కొడితే.. ఏకంగా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ రికార్డునే బ్రేక్ చేస్తాడు ఈ యంగ్ ప్లేయర్. సచిన్ ఆస్ట్రేలియాపై 25 సిక్సర్లు బాది అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఇంగ్లండ్ యంగ్ బౌలర్ బషీర్ ధాటికి టీమిండియా టాపార్డర్ కుప్పకూలింది. ప్రస్తుతం 7 వికెట్లకు 183 పరుగులు చేసి.. ఇంకా 170 రన్స్ వెనుకంజలో ఉంది. టీమ్ లో జైస్వాల్ ఒక్కడే 73 రన్స్ తో రాణించాడు. మరి ఈ ఏజ్ లోనే రికార్డుల మీద రికార్డులు బద్దలుకొడుతున్న జైస్వాల్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: నిన్న లాస్ట్ బాల్ సిక్స్ కొట్టిన సజనా.. ఓ తెలుగు సినిమాలో హీరోయిన్!