iDreamPost
android-app
ios-app

Yashasvi Jaiswal: రోహిత్ శర్మను దాటేసిన జైస్వాల్! అగ్రస్థానంలోకి..

జింబాబ్వేతో జరిగిన మూడో టీ20లో టీమిండియా 23 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇక ఈ మ్యాచ్ లో అరుదైన ఘనతను సాధించాడు యశస్వీ జైస్వాల్. ఏకంగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మనే దాటేశాడు. ఆ వివరాల్లోకి వెళితే..

జింబాబ్వేతో జరిగిన మూడో టీ20లో టీమిండియా 23 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇక ఈ మ్యాచ్ లో అరుదైన ఘనతను సాధించాడు యశస్వీ జైస్వాల్. ఏకంగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మనే దాటేశాడు. ఆ వివరాల్లోకి వెళితే..

Yashasvi Jaiswal: రోహిత్ శర్మను దాటేసిన జైస్వాల్! అగ్రస్థానంలోకి..

జింబాబ్వే టూర్ లో ఉన్న యంగ్ టీమిండియా తన జోరును కొనసాగిస్తోంది. తొలి మ్యాచ్ లో దారుణ ఓటమి తర్వాత గొప్పగా పుంజుకున్న భారత్.. వరుసగా రెండు మ్యాచ్ ల్లో విజయం సాధించి.. సిరీస్ లో 1-2తో ముందంజలో ఉంది. తాజాగా జరిగిన మూడో టీ20లో 23 పరుగుల తేడాతో గెలిచింది. ఇక ఈ మ్యాచ్ లో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు టీమిండియా యంగ్ ఓపెనర్ యశస్వీ జైస్వాల్. ఏకంగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మనే దాటేసి.. అగ్రస్థానంలో నిలిచాడు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

యశస్వీ జైస్వాల్.. అతి తక్కువ కాలంలోనే టీమిండియాలో సుస్థిర స్థానం సంపాదించుకున్నాడు ఈ యంగ్ ప్లేయర్. ఓపెనర్ గా బరిలోకి దిగుతూ.. ప్రత్యర్థి బౌలర్లపై భారీ షాట్లతో విరుచుకుపడటం ఇతడి నైజాం. జింబాబ్వేతో జరిగిన తొలి రెండు మ్యాచ్ ల్లో జైస్వాల్ కు అవకాశం రాలేదు. ఇక మూడో మ్యాచ్ లో బరిలోకి దిగిన ఈ చిచ్చరపిడుగు 27 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సులతో 36 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. ఈ క్రమంలోనే ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఈ ఏడాది అంతర్జాతీయ క్రికెట్ లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ గా అగ్రస్థానంలో నిలిచాడు జైస్వాల్. ఈ సంవత్సరం అన్ని ఫార్మాట్స్ లో కలిపి 14 ఇన్నింగ్స్ ల్లో 848 పరుగులు చేశాడు.

కాగా.. ఈ లిస్ట్ లో జైస్వాల్ తర్వాత స్థానంలో ఆఫ్గానిస్తాన్ ప్లేయర్ ఇబ్రహీం జద్రాన్ ఉన్నాడు. అతడు 27 ఇన్నింగ్స్ ల్లో 844 పరుగులు చేశాడు. ఈ జాబితాలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ 22 ఇన్నింగ్స్ లు ఆడి 833 రన్స్ చేశాడు. దాంతో వీరిద్దరిని దాటుకుని అగ్రస్థానంలోకి దూసుకొచ్చాడు జైస్వాల్. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. జట్టులో శుబ్ మన్ గిల్(66), రుతురాజ్ గైక్వాడ్(49) పరుగులతో రాణించారు. అనంతరం 183 రన్స్ టార్గెట్ తో బరిలోకి దిగిన జింబాబ్వే.. 6 వికెట్లకు 159 పరుగులు చేసి.. 23 రన్స్ తేడాతో ఓడిపోయింది. మరి కెప్టెన్ రోహిత్ శర్మను యశస్వీ జైస్వాల్ దాటేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి