iDreamPost
android-app
ios-app

Team India: చరిత్ర సృష్టించిన టీమిండియా.. వరల్డ్ క్రికెట్​లో ఏకైక జట్టుగా రికార్డు!

  • Published Jul 10, 2024 | 10:08 PM Updated Updated Jul 10, 2024 | 10:08 PM

India vs Zimbabwe: భారత జట్టు చరిత్ర సృష్టించింది. జింబాబ్వేతో జరిగిన మూడో టీ20లో బంపర్ విక్టరీ కొట్టిన యంగ్ ఇండియా అరుదైన ఘనతను అందుకుంది. వరల్డ్ క్రికెట్​లో ఏకైక జట్టుగా రికార్డ్ క్రియేట్ చేసింది.

India vs Zimbabwe: భారత జట్టు చరిత్ర సృష్టించింది. జింబాబ్వేతో జరిగిన మూడో టీ20లో బంపర్ విక్టరీ కొట్టిన యంగ్ ఇండియా అరుదైన ఘనతను అందుకుంది. వరల్డ్ క్రికెట్​లో ఏకైక జట్టుగా రికార్డ్ క్రియేట్ చేసింది.

  • Published Jul 10, 2024 | 10:08 PMUpdated Jul 10, 2024 | 10:08 PM
Team India: చరిత్ర సృష్టించిన టీమిండియా.. వరల్డ్ క్రికెట్​లో ఏకైక జట్టుగా రికార్డు!

భారత జట్టు చరిత్ర సృష్టించింది. జింబాబ్వేతో జరిగిన మ్యాచ్​లో బంపర్ విక్టరీ కొట్టిన యంగ్ ఇండియా అరుదైన ఘనతను అందుకుంది. వరల్డ్ క్రికెట్​లో ఏకైక జట్టుగా రికార్డ్ క్రియేట్ చేసింది. జింబాబ్వేతో హరారే స్పోర్ట్స్ క్లబ్​లో ఇవాళ జరిగిన మూడో టీ20లో విక్టరీ కొట్టింది భారత్. 23 పరుగుల తేడాతో నెగ్గి సిరీస్​లో 2-1తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఈ మ్యాచ్​లో విజయం ద్వారా ప్రపంచ క్రికెట్​లో ఎవరికీ సాధ్యం కాని ఓ ఫీట్​ను నమోదు చేసింది. టీ20 హిస్టరీలో 150 విజయాలు అందుకున్న ఏకైక జట్టుగా మెన్ ఇన్ బ్లూ నిలిచింది.

మూడో టీ20లో గెలుపుతో పొట్టి ఫార్మాట్​లో 150 విజయాలు అందుకున్న తొలి జట్టుగా ఆల్​టైమ్ రికార్డును క్రియేట్ చేసింది టీమిండియా. ఇప్పటికే టీ20 వరల్డ్ కప్ గెలుపును సెలబ్రేట్ చేసుకుంటున్న ఫ్యాన్స్.. ఈ న్యూస్ విని మరింత సంతోషపడుతున్నారు. మన జట్టుకు ఢోకా లేదని అంటున్నారు. ఇక, మూడో టీ20లో తొలుత బ్యాటింగ్​కు దిగిన గిల్ సేన.. ఓవర్లన్నీ ఆడి 4 వికెట్లకు 182 పరుగులు చేసింది. ఆ తర్వాత ఛేదనకు దిగిన ఆతిథ్య జట్టు.. 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేయగలిగింది. సిరీస్​లో ఇంకో రెండు మ్యాచ్​లు మిగిలి ఉన్నాయి. నాలుగో టీ20లో నెగ్గితే సిరీస్​ భారత్ వశమవుతుంది. మరి.. టీమిండియా ఆల్​టైమ్ రికార్డ్​పై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.