iDreamPost
android-app
ios-app

జింబాబ్వే బౌలర్లను చీల్చిచెండాడిన టీమిండియా ఓపెనర్లు! జైస్వాల్‌ విధ్వంసం..

  • Published Jul 13, 2024 | 8:08 PM Updated Updated Jul 13, 2024 | 8:08 PM

Yashasvi Jaiswal, Shubman Gill, IND vs ZIM: జింబాబ్వే పర్యటనతో యంగ్‌ టీమిండియా దుమ్ములేపింది. ఐదు టీ20ల సిరీస్‌లో మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే సిరీస్‌ను 3-1తో కైవసం చేసుకుంది. నాలుగో టీ20లో జైస్వాల్‌, గిల్‌ అదరగొట్టారు. వారి విధ్వంసం గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

Yashasvi Jaiswal, Shubman Gill, IND vs ZIM: జింబాబ్వే పర్యటనతో యంగ్‌ టీమిండియా దుమ్ములేపింది. ఐదు టీ20ల సిరీస్‌లో మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే సిరీస్‌ను 3-1తో కైవసం చేసుకుంది. నాలుగో టీ20లో జైస్వాల్‌, గిల్‌ అదరగొట్టారు. వారి విధ్వంసం గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

  • Published Jul 13, 2024 | 8:08 PMUpdated Jul 13, 2024 | 8:08 PM
జింబాబ్వే బౌలర్లను చీల్చిచెండాడిన టీమిండియా ఓపెనర్లు! జైస్వాల్‌ విధ్వంసం..

పసికూన జింబాబ్వేను భారత యువ క్రికెటర్లు ఏ మాత్రం కనికరం లేకుండా పిచ్చికొట్టుడు కొట్టారు. వాళల​ సొంత గడ్డపై ఒక్క వికెట్‌ కూడా కోల్పోకుండా.. 150కి పైగా టార్గెట్‌ను ఊది పడేశారు. కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌తో పాటు, యువ ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ సునామీ ఇన్నింగ్స్‌లో చెలరేగిపోయారు. పాపం జింబాబ్వే బౌలర్లను చీల్చిచెండాడుతూ.. 153 పరుగుల టార్గెట్‌ను కేవలం 15.2 ఓవర్లలోనే కొట్టిపడేశారు. ఇద్దరు ఓపెనర్లు వేటకొచ్చిన సింహాల్లా మీద పడుతుంటే.. జింబాబ్వే బౌలర్లు చేసేదేం లేక చేతులెత్తేశారు. ఇద్దరు హాఫ్‌ సెంచరీలు పూర్తి చేసుకుని.. ఐదు టీ20ల సిరీస్‌లో టీమిండియాకు 3-1తో మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే సిరీస్‌ విజయం సాధించారు.

జింబాబ్వే నిర్దేశించిన 153 పరుగుల టార్గెట్‌ను ఛేదించేందుకు బరిలోకి దిగిన టీమిండియా ఓపెనర్లు యశస్వి జైస్వాల్‌, శుబ్‌మన్‌ గిల్‌.. తొలి ఓవర్‌ నుంచే ప్రత్యర్థిపై విరుచుకుపడ్డారు. జైస్వాల్‌ 53 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్సులతో 93 పరుగులు సాధించాడు. మరో ఓపెనర్‌, కెప్టెన్‌ గిల్‌ 39 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సులతో 58 పరుగులు చేసి అదరగొట్టాడు. ఇలా ఇద్దరు ఒక్క వికెట్‌ కూడా ఇవ్వకుండా 15.2 ఓవర్లలో 156 పరుగులు కొట్టేసి.. దుమ్ములేపారు. ఇద్దరి పోటాపోటీగా బౌండరీలు, సిక్సులు కొడుతుంటే.. క్రికెట్‌ అభిమానులు పండుగ చేసుకున్నారు. అయితే.. జైస్వాల్‌ సెంచరీ పూర్తి చేసి ఉంటే బాగుండేదని క్రికెట్‌ అభిమానులు అనుకుంటున్నారు.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. కెప్టెన్‌ సికందర్‌ రజా 28 బంతుల్లో 46 పరుగులు చేసి రాణించాడు. ఓపెనర్లు మాధేవేరే 25, మారుమణి 32 పరుగులతో పర్వాలేదనిపించారు. భారత బౌలర్లలో ఖలీల్‌ అహ్మద్‌ 2 వికెట్లతో సత్తా చాటాడు. ఈ మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన తుషార్‌ దేశ్‌పాండే ఒక వికెట్‌, వాషింగ్టన్‌ సుందర్‌, అభిషేక్‌ శర్మ, శివమ్‌ దూబే కూడా తలో వికెట్‌ పడగొట్టారు. ఇక 153 పరుగుల టార్గెట్‌ను భారత ఓపెనర్లు జైస్వాల్‌, శుబ్‌మన్‌ గిల్‌ సూపర్‌ బ్యాటింగ్‌తో 15.2 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా ఛేదించారు. మరి ఈ మ్యాచ్‌లో మన ఓపెనర్ల బ్యాటింగ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.