Nidhan
ముంబై ఇండియన్స్ జట్టు హవా నడుస్తోంది. వరుసగా రెండో విజయం సాధించిన ఆ టీమ్.. విమెన్స్ ప్రీమియర్ లీగ్-2024లో ప్రత్యర్థి జట్లకు హెచ్చరికలు పంపించింది.
ముంబై ఇండియన్స్ జట్టు హవా నడుస్తోంది. వరుసగా రెండో విజయం సాధించిన ఆ టీమ్.. విమెన్స్ ప్రీమియర్ లీగ్-2024లో ప్రత్యర్థి జట్లకు హెచ్చరికలు పంపించింది.
Nidhan
విమెన్స్ ప్రీమియర్ లీగ్-2024లో ముంబై ఇండియన్స్ హవా నడుస్తోంది. ఆ జట్టు వరుసగా రెండో విక్టరీ కొట్టింది. డిఫెండింగ్ ఛాంపియన్ అయిన ముంబై నయా సీజన్‌ను అనుకున్నట్లే బాగా స్టార్ట్ చేసింది. తొలి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను చిత్తు చేసిన ముంబై.. రెండో మ్యాచ్‌లో గుజరాత్ జియాంట్స్ మీద అలవోకగా నెగ్గింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ ఓవర్లన్నీ ఆడి 9 వికెట్లకు కేవలం 126 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆ టీమ్‌లో కెప్టెన్ బెత్ మూనీ (24), ఎమ్మా బ్రైస్ (25), తనూజా కన్వార్ (28) ఫర్వాలేదనిపించారు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ముంబై 18.1 ఓవర్లలోనే టార్గెట్‌ను ఉఫ్‌మని ఊదిపారేసింది. ముంబై బ్యాటర్ల జోరు ముందు గుజరాత్ బౌలర్లు తేలిపోయారు. హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్సీ నాక్‌తో చెలరేగిపోయింది.
126 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబైకి సరైన స్టార్ట్ దొరకలేదు. యషికా భాటియా (7), హేలీ మాథ్యూస్ (7) తక్కువ స్కోర్లకే వెనుదిరిగారు. అయితే సారథి హర్మన్‌ప్రీత్ (46 నాటౌట్) ఒక ఎండ్‌లో పాతుకుపోయింది. సీవర్ బ్రంట్ (22), అమెలియా కెర్ (31) సాయంతో టీమ్‌ను విజయతీరాలకు చేర్చింది. ఏ దశలోనూ స్ట్రయిక్ రేట్ పడిపోకుండా చూస్తూ గుజరాత్ బౌలర్లను డిఫెన్స్‌లో పడేసింది. స్ట్రయిక్ రొటేషన్ చేస్తూనే చెత్త బంతుల్ని బౌండరీలకు తరలించింది ముంబై సారథి. ఒకవేళ హర్మన్ గనుక ఔట్ అయి ఉంటే ముంబైకి ఛేజ్ చేయడం కష్టమయ్యేది. కానీ తను మాత్రం ఒక ఎండ్‌లో చకచకా పరుగులు చేస్తూ మిగతా బ్యాటర్ల మీద ఏమాత్రం ప్రెజర్ రాకుండా చూసుకుంది. ఆఖర్లో సిక్స్ కొట్టి మ్యాచ్‌ను ఫినిష్ చేసింది. తను బ్యాటింగ్‌తో పాటు ఫీల్డింగ్ టైమ్‌లో సరైన టైమ్‌లో సరైన డిసిషన్స్ తీసుకుంటూ కెప్టెన్‌గానూ ఆకట్టుకుంది.
గుజరాత్ బౌలర్లలో తనూజా కన్వార్ 2 వికెట్లు తీసింది. కాథరిన్ బ్రైస్, లీ తాహుహుకు చెరో వికెట్ దక్కింది. బౌలింగ్‌లో ఫర్వాలేదనిపించినా.. బ్యాటింగ్‌లో ఫెయిలవడమే జియాంట్స్ కొంప ముంచింది. ఆ జట్టు బ్యాటర్లలో కనీసం ఒక్కరు కూడా హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకోలేకపోయారు. బెత్ మూనీకి మంచి స్టార్ట్ దొరికినా దాన్ని భారీ స్కోరుగా మలచలేకపోయింది. ఆఖర్లో కాథరిన్, తనూజా కన్వార్ పోరాడకపోయి ఉంటే ఆ మాత్రం టార్గెట్‌ను కూడా సెట్ చేసి ఉండేది కాదు. ముంబై బౌలర్లలో అమెలియా కెర్ (4/17), షబ్నిమ్ ఇస్మాయిల్ (3/18) అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారు. వాళ్ల దెబ్బకు గుజరాత్ ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. వీళ్లిద్దరికీ తోడు నాట్ బ్రంట్, హేలీ మాథ్యూస్ చెరో వికెట్‌తో మంచి సపోర్ట్ అందించారు. ఈ విజయంతో ముంబై లీగ్‌లో ఫుల్ జోష్‌లో కనిపిస్తోంది. మరి.. డబ్ల్యూపీఎల్‌లో ముంబై వరుసగా రెండో విక్టరీ కొట్టడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: RCB ప్లేయర్స్‌కు మాత్రమే దక్కే క్రేజ్ ఇది.. వైరల్ వీడియో!
Captain Harmanpreet Kaur with a six to finish the game! ⭐
– 2 in 2 for Mumbai Indians!! pic.twitter.com/wMD51VPr1S
— Mufaddal Vohra (@mufaddal_vohra) February 25, 2024