iDreamPost

RCB ప్లేయర్స్​కు మాత్రమే దక్కే క్రేజ్ ఇది.. వైరల్ వీడియో!

  • Published Feb 26, 2024 | 8:09 AMUpdated Feb 26, 2024 | 8:09 AM

లాయల్టీకి అంతగా ప్రాధాన్యం ఇవ్వని ఫ్రాంచైజీ క్రికెట్​లో ప్లేయర్లను ప్రాణంలా చూసేవాళ్లు, ప్రేమించే వాళ్లు తక్కువేనని చెప్పాలి. కానీ అలాంటి అభిమానులు ఆర్సీబీలో ఎంతో మంది ఉన్నారు. తాజాగా ఇది మరోమారు ప్రూవ్ అయింది.

లాయల్టీకి అంతగా ప్రాధాన్యం ఇవ్వని ఫ్రాంచైజీ క్రికెట్​లో ప్లేయర్లను ప్రాణంలా చూసేవాళ్లు, ప్రేమించే వాళ్లు తక్కువేనని చెప్పాలి. కానీ అలాంటి అభిమానులు ఆర్సీబీలో ఎంతో మంది ఉన్నారు. తాజాగా ఇది మరోమారు ప్రూవ్ అయింది.

  • Published Feb 26, 2024 | 8:09 AMUpdated Feb 26, 2024 | 8:09 AM
RCB ప్లేయర్స్​కు మాత్రమే దక్కే క్రేజ్ ఇది.. వైరల్ వీడియో!

నేషనల్ టీమ్స్​కు ఆడే ప్లేయర్లకు అభిమానులు ఇచ్చే గౌరవం, వాళ్ల మీద చూపించే లవ్ వేరే లెవల్లో ఉంటుంది. దేశం తరఫున ఆడుతున్నారు కాబట్టి వాళ్లను చాలా ఇష్టపడతారు. కానీ ఫ్రాంచైజీ క్రికెట్​ దీనికి పూర్తి భిన్నంగా ఉంటుంది. లీగ్స్​లో ఫలానా ఆటగాడు ఫలానా జట్టుకే ఆడాలని రూల్ లేదు. ఫ్రాంచైజీకి ఇష్టం లేకున్నా ప్లేయర్​కు ఇష్టం లేకున్నా తప్పుకోవచ్చు, ఇతర జట్టుకు మారొచ్చు. లీగ్స్​లో లాయల్టీ అనే పదానికి అంతగా విలువ ఉండదు. అభిమానులు కూడా దీన్ని లైట్ తీసుకుంటారు. కానీ ఐపీఎల్​లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీ ఫ్యాన్స్ మాత్రం వేరు అనే చెప్పాలి. ఆర్సీబీ ఒక్కసారి కప్ గెలవకున్నా ఆ టీమ్​ను వాళ్లు సపోర్ట్ చేస్తూనే వస్తున్నారు. ఆ జట్టు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మీద ప్రేమ చూపిస్తూనే ఉన్నారు. అదే రేంజ్​లో బెంగళూరు విమెన్స్ టీమ్ కెప్టెన్ స్మృతి మందానపై లవ్ చూపిస్తున్నారు.

విమెన్స్ ప్రీమియర్ లీగ్-2024 ఇటీవలే స్టార్ట్ అయింది. ఈ లీగ్​లో ఆర్సీబీ బోణీ కొట్టింది. ఆడిన మొదటి మ్యాచ్​లో వారియర్జ్ మీద లాస్ట్ బాల్​కు థ్రిల్లింగ్ విక్టరీ కొట్టింది. చివరి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్​లో 2 పరుగుల తేడాతో గెలుపొందింది. అయితే ఈ మ్యాచ్​లో ఆర్సీబీ కెప్టెన్ స్మృతి మందానకు ఉన్న క్రేజ్ చూసి అంతా షాకయ్యారు. బెంగళూరు హోమ్ గ్రౌండ్ అయిన చిన్నస్వామి స్టేడియంలో ఈ మ్యాచ్ జరిగింది. మ్యాచ్​కు ముందు టాస్ టైమ్​లో స్మృతి కాసేపు కామెంటేటర్​తో ముచ్చటించారు. ఆ సమయంలో ఆమెను అభిమానులు మాట్లాడనివ్వలేదు. స్మృతి.. స్మృతి అంటూ గట్టిగా అరిచారు. ఆర్సీబీ.. ఆర్సీబీ అంటూ కేకలు వేస్తూ, చప్పట్లు కొట్టారు. ఫ్యాన్స్ చూపిస్తున్న లవ్​కు ఆమె నోటి వెంట మాట రాలేదు. దీంతో నవ్వుతూ అభిమానుల వైపు చూస్తూ ఎలాగోలా మాట్లాడేందుకు ప్రయత్నించారు.

గ్రౌండ్​లో స్మృతి మందాన క్రేజ్ చూసి అంతా షాకవుతున్నారు. ఆర్సీబీ ఫ్యాన్స్ స్మృతిని ఎంకరేజ్ చేస్తూ, ఆమెపై తమకు ఉన్న అభిమానం, ప్రేమను చూపించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైర​ల్ అవుతోంది. దీన్ని చూసిన నెటిజన్స్.. కోహ్లీ స్థాయిలో స్మృతిపై ఫ్యాన్స్ లవ్ చూపిస్తున్నారని కామెంట్స్ చేస్తున్నారు. బెంగళూరులో విరాట్​కు ఎంత క్రేజ్ ఉందో అంతే క్రేజ్ స్మృతికి ఉందని.. అందుకు ఇదే ప్రూఫ్ అని అంటున్నారు. అక్కడి అభిమానులు లాయల్టీని రాయల్టీగా భావిస్తారని.. ఇంత నమ్మకంగా ఉండే ఫ్యాన్​బేస్ దొరకడం ఆర్సీబీ, కోహ్లీ, స్మృతి లక్ అని చెబుతున్నారు. ఒక్క ట్రోఫీ గెలవకున్నా అభిమానులు ఆర్సీబీపై, ఆ టీమ్ ఆటగాళ్ల మీద చూపించే ప్రేమ నమ్మశక్యం కానిదని అంటున్నారు. విమెన్ క్రికెటర్స్​లో స్మృతి క్రేజ్ నెక్స్ట్ లెవల్​లో ఉందని చెబుతున్నారు. మరి.. స్మృతి మందాన క్రేజ్ చూశాక మీకేం అనిపించిందో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: వీడియో: సర్ఫరాజ్ నువ్వు హీరోవి కాదు.. రోహిత్ మాస్ వార్నింగ్!

 

View this post on Instagram

 

A post shared by Sikku (@sikku.edits)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి