క్రికెట్ ఇప్పుడు కాసుల క్రీడగా మారిపోయింది. ఈ గేమ్‌ను బంగారు గుడ్లు పెట్టే బాతులా అందరూ చూస్తున్నారు. లీగ్‌ల పుణ్యమా అని క్రికెట్లో డబ్బుల వర్షం కురుస్తోంది. యాడ్స్, స్ట్రీమింగ్ రైట్స్, స్పాన్సర్షిప్స్ రూపంలో బోర్డులతో పాటు ప్లేయర్లు బాగా సంపాదిస్తున్నారు. ఆటగాళ్ల నికర సంపద ఏటేటా అంతకంతకూ పెరుగుతూ పోతోంది. జాతీయ జట్టుకు ఆడితే వచ్చే డబ్బుల కంటే లీగ్స్, యాడ్స్ ద్వారా వచ్చే రెవెన్యూనే అధికంగా ఉంటోంది. అందుకే పలు దేశాల క్రికెటర్లు లీగ్స్‌పై ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. తమ సంపాదనను రెట్టింపు చేసుకోవాలని చూస్తున్నారు. ప్రస్తుత క్రికెట్లో ధనార్జనలో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ దూసుకెళ్తున్నాడు. అతడి నికర సంపద ఇటీవలే రూ.1,000 కోట్లు దాటిన సంగతి తెలిసిందే.
ఏ ప్లస్ గ్రేడ్ కాంట్రాక్ట్ కలిగిన విరాట్ కోహ్లీకి బీసీసీఐ నుంచి ఏటా రూ.7 కోట్లు అందుతాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ద్వారా ఆర్సీబీ నుంచి అతడికి ఏటా రూ.15 కోట్లు వేతనంగా అందుతోంది. వీటితో పాటు యాడ్స్, బిజినెస్ ద్వారా కోహ్లి భారీ మొత్తంలో ఆర్జిస్తున్నాడు. విరాట్ తర్వాత చూసుకుంటే.. భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ సంపాదనలో తానేమీ తక్కువ కాదంటున్నాడు. ఈ బ్యాటింగ్ లెజెండ్ జెంటిల్మన్ గేమ్‌కు వీడ్కోలు చెప్పి చాలా కాలమే అయింది. కానీ ఆర్జనలో మాత్రం ఇప్పటికీ ముందున్నాడు. మాస్టర్ బ్లాస్టర్ నికర సంపద రూ.1,250 కోట్లుగా ఉంది. ఆ తర్వాత చూసుకుంటే.. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఉన్నాడు. మాహీ నికర సంపద రూ.1,040 కోట్లుగా ఉంది.
కోహ్లి, సచిన్, ధోనీలను ప్రపంచ క్రికెట్లో అత్యంత సంపన్న క్రికెటర్లుగా అందరూ భావిస్తారు. కానీ వరల్డ్ క్రికెట్లో అత్యంత సంపన్నుడు మరొకరు ఉన్నారు. ఆ ప్లేయరే సమర్జిత్సిన్హ్ రంజిత్ సిన్హ్ గైక్వాడ్. 1967వ సంవత్సరం ఏప్రిల్ 25న పుట్టిన ఈయన.. ఫస్ట్‌క్లాస్ క్రికెటర్‌గా గుర్తింపు పొందారు. ఈయన బరోడా రాజు కావడం విశేషం. వారసత్వంగానే రంజిత్సిన్హ్కు రూ.20 వేల కోట్ల సంపద సంక్రమించింది. వరల్డ్‌లోని అతిపెద్ద ప్రైవేట్ నివాసమైన లక్ష్మీ విలాస్ ప్యాలెస్ యజమాని ఈయనే కావడం గమనార్హం. గుజరాత్‌తో పాటు వారణాసిలోని 17 ఆలయాలను నడిపే ట్రస్టుల బాధ్యతలను ఈయనే చూసుకుంటున్నారు. రంజీ ట్రోఫీలో బరోడా జట్టుకు ప్రాతినిధ్యం వహించారు రంజిత్‌సిన్హ్. సచిన్, కోహ్లి, ధోని లాంటి వాళ్లు క్రికెట్ ఆడటం ద్వారా డబ్బులు సంపాదిస్తే.. ఈయనకు మాత్రం వారసత్వంగానే వేల కోట్ల ఆస్తులు సంక్రమించాయి.
HH Samarjitsinh Ranjitsinh Gaekwad is the Maharaja of Baroda. A former first-class cricketer, he resides in the Laxmi Vilas Palace in the city of Vadodara. He is the current head of the Gaekwad dynasty and also heads a temple trust that controls 17 temples in across North India. pic.twitter.com/9Ph7sgkVQw
— 🦚. (@AhamadNooh) May 8, 2021