iDreamPost
android-app
ios-app

ద్రవిడ్​కో న్యాయం.. ప్లేయర్లకో న్యాయమా? BCCI తీరుపై నెటిజన్స్ ఫైర్!

  • Author singhj Published - 03:53 PM, Wed - 25 October 23

ఒక విషయంలో టీమ్ మేనేజ్​మెంట్​తో ఒకలా.. ప్లేయర్లతో మరోలా వ్యవహరించడం కరెక్ట్ కాదంటూ బీసీసీఐ ఇండియన్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. అసలేం జరిగింది.. భారత క్రికెట్ బోర్డుపై అభిమానులు ఎందుకు సీరియస్ అయ్యారనేది ఇప్పుడు తెలుసుకుందాం..

ఒక విషయంలో టీమ్ మేనేజ్​మెంట్​తో ఒకలా.. ప్లేయర్లతో మరోలా వ్యవహరించడం కరెక్ట్ కాదంటూ బీసీసీఐ ఇండియన్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. అసలేం జరిగింది.. భారత క్రికెట్ బోర్డుపై అభిమానులు ఎందుకు సీరియస్ అయ్యారనేది ఇప్పుడు తెలుసుకుందాం..

  • Author singhj Published - 03:53 PM, Wed - 25 October 23
ద్రవిడ్​కో న్యాయం.. ప్లేయర్లకో న్యాయమా? BCCI తీరుపై నెటిజన్స్ ఫైర్!

వన్డే వరల్డ్ కప్-2023లో ఎక్స్​పెక్ట్ చేసిన దాని కంటే టీమిండియా బాగా ఆడుతోంది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లాంటి ఫేవరెట్ టీమ్స్​తో రోహిత్ సేనకు ఇబ్బందులు తప్పక పోవచ్చని అంతా అనుకున్నారు. దాయాది పాకిస్థాన్​తో మ్యాచ్​ కూడా భారత్​కు టఫ్​గా ఉంటుందని భావించారు. కానీ మెగా టోర్నీలో టీమిండియా అంచనాలను తారుమారు చేసింది. ఆడిన ఐదు మ్యాచుల్లోనూ గెలిచి ఫేవరెట్స్ నుంచి హాట్ ఫేవరెట్స్​గా అవతరించింది. ఆసీస్, కివీస్, పాక్​తో పాటు డేంజరస్ టీమ్స్ అయిన బంగ్లాదేశ్, ఆఫ్ఘానిస్థాన్​ను కూడా రోహిత్ సేన మట్టికరిపించింది. దీంతో ఇండియాతో మ్యాచ్ అంటే ప్రత్యర్థులు భయపడుతున్నారు.

రీసెంట్​గా ధర్మశాలలో జరిగిన మ్యాచ్​లో న్యూజిలాండ్​పై భారత్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్​ తర్వాత టీమిండియా ప్లేయర్లు అక్కడే ఉండిపోయారు. నెక్స్ట్ ఇంగ్లండ్​తో మ్యాచ్​కు గ్యాప్ రావడం, దసరా సెలవులు కూడా ఉండటంతో ధర్మశాలలోనే ఉండి అక్కడి ప్రకృతిని ఎంజాయ్ చేయాలని భారత క్రికెటర్లు ఫిక్స్ అయ్యారు. అయితే హిమాలయాల చెంతనే ఉన్న ధర్మశాలలో ట్రెక్కింగ్ చేసేందుకు మాత్రం ఆటగాళ్లకు భారత క్రికెట్ బోర్డు పర్మిషన్ ఇవ్వలేదు. ట్రెక్కింగ్, పారా గ్లైడింగ్ లాంటివి చేస్తే గాయాలపాలయ్యే ప్రమాదం అవకాశం ఉన్నందున వాటికి దూరంగా ఉండాలని వార్నింగ్ ఇచ్చింది.

ఇండియన్ క్రికెటర్స్​కు ట్రెక్కింగ్ చేసేందుకు నిరాకరించిన బీసీసీఐ.. టీమ్ మేనేజ్​మెంట్, కోచింగ్ స్టాఫ్​కు మాత్రం నో చెప్పలేదు. దీంతో కోచ్ రాహుల్ ద్రవిడ్ సహా మిగిలిన కోచింగ్ స్టాఫ్​ అంతా కలసి ధర్మశాలలో ట్రెక్కింగ్ చేశారు. హిమాలయ పర్వత అందాలను మరింత దగ్గర నుంచి వీక్షించారు. ద్రవిడ్ అండ్ కో ట్రెక్కింగ్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఇది చూసిన నెటిజన్స్ బీసీసీఐ తీరుపై ఫైర్ అవుతున్నారు. ఆటగాళ్లను ట్రెక్కింగ్ చేయొద్దని చెప్పి.. టీమ్ మేనేజ్​మెంట్​కు ఎలా గ్రీన్ సిగ్నల్ ఇస్తారని ప్రశ్నిస్తున్నారు.

టీమ్ మేనేజ్​మెంట్​తో పాటు ప్లేయర్స్​ను కూడా అనుమతించి ఉంటే వాళ్లు ప్రకృతి అందాలను ఆస్వాదించి రిలాక్స్ అయ్యేవారు కదా అని కామెంట్స్ చేస్తున్నారు. ట్రెక్కింగ్ టైమ్​లో కోచింగ్ స్టాఫ్​కు ఏమైనా అయితే టీమ్​కు ఇబ్బందే కదా అని క్వశ్చన్ చేస్తున్నారు. ద్రవిడ్​కో న్యాయం.. ప్లేయర్లకో న్యాయమా అని నిలదీస్తున్నారు. అయితే మరికొందరు నెటిజన్స్ మాత్రం బీసీసీఐ నిర్ణయాన్ని సమర్థిస్తున్నారు. టోర్నీ మధ్యలో ప్లేయర్స్​కు ఇంజ్యురీలు కాకుండా కాపాడుకోవడం ముఖ్యమని చెబుతున్నారు. కప్పు గెలిచాక ఏదైనా చేసుకోవచ్చని కామెంట్స్ చేస్తున్నారు. మరి.. ప్లేయర్లు, కోచింగ్ స్టాఫ్​ విషయంలో బీసీసీఐ వ్యవహరించిన తీరు మీద మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: రోహిత్ సేనకు BCCI వార్నింగ్.. ఆ పనులు చేస్తే ఊరుకోబోమంటూ..!