న్యూజిలాండ్‌తో మ్యాచ్‌కు ముందు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్‌పై టీమిండియా కోచ్ రాహుల్ ద్రవిడ్ సీరియస్ అయ్యాడు. ఐసీసీ తీరు సరికాదన్నాడు.
న్యూజిలాండ్‌తో మ్యాచ్‌కు ముందు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్‌పై టీమిండియా కోచ్ రాహుల్ ద్రవిడ్ సీరియస్ అయ్యాడు. ఐసీసీ తీరు సరికాదన్నాడు.
వన్డే వరల్డ్ కప్-2023 వరుస విజయాలతో దూసుకెళ్తున్న టీమిండియా.. ఆదివారం జరిగే మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో తలపడనుంది. ఆడిన నాలుగు మ్యాచుల్లోనూ నెగ్గిన కివీస్‌ను రోహిత్ సేన ఎలా ఎదుర్కొంటుందో చూడాలి. ధర్మశాల వేదికగా జరిగే ఈ మ్యాచ్ ఇరు టీమ్స్‌కు కీలకంగా మారనుంది. అలాంటి ఇంట్రెస్టింగ్ మ్యాచ్‌కు ముందు భారత కోచ్ రాహుల్ ద్రవిడ్ ఐసీసీపై సీరియస్ అయ్యాడు. టీమిండియా మ్యాచులు ఆడిన నాలుగు వేదికల్లో రెండింటికి ‘యావరేజ్’ రేటింగ్ ఇవ్వడమే దీనికి కారణం. ఫస్ట్ మ్యాచ్ ఆడిన చెన్నైతో పాటు పాకిస్థాన్‌తో పోరుకు వేదకైన అహ్మదాబాద్ గ్రౌండ్‌కు ఐసీసీ యావరేజ్ రేటింగ్ ఇవ్వడంపై ద్రవిడ్ రియాక్ట్ అయ్యాడు.
ఐసీసీ డెసిషన్ సరైంది కాదంటూ విమర్శలు గుప్పించాడు ద్రవిడ్. తనకు ఐసీసీ మీద గౌరవం ఉందని.. అయితే ఈ రేటింగ్ ఇవ్వడం మాత్రం కరెక్ట్ కాదన్నాడు ద్రవిడ్. అహ్మదాబాద్, చెన్నై పిచ్‌లకు యావరేజ్ రేటింగ్ ఇవ్వడం సరికాదన్నాడు. ఈ రెండు గ్రౌండ్స్ చాలా బాగున్నాయని.. 350 రన్స్ చేసే వికెట్ అయితేనే మంచి రేటింగ్ ఇస్తామనడం కరెక్ట్ కాదన్నాడు ద్రవిడ్. పిచ్ రియాక్ట్ అయిన తీరే కాకుండా ప్లేయర్ల పెర్ఫార్మెన్స్నూ పరిశీలించాలన్నాడు. ఫోర్లు, సిక్సులు మాత్రమే చూస్తామంటే కుదరదన్నాడు భారత కోచ్. బౌండరీలు, సిక్సులే కావాలనుకుంటే టీ20 వికెట్లను తయారు చేసుకోవచ్చని విమర్శించాడు.
‘ఢిల్లీ, పుణె వికెట్లు టీ20 లాంటి వికెట్లే. అక్కడ 350 ప్లస్ స్కోర్లు కొట్టొచ్చు. అలాంటప్పుడు ఇక బౌలర్లు ఎందుకు? స్పిన్నర్లు ఎందుకు? వచ్చీరాగానే బ్యాట్స్‌మెన్ ధనాధన షాట్లతో విరుచుకుపడేలా ఉంటేనే మంచి వికెట్ అనిపించుకోదు. వన్డే ఫార్మాట్ అంటే ప్లేయర్ల అసలైన టాలెంట్‌ను టెస్ట్ చేసే వేదిక. స్ట్రయిక్ రొటేట్ చేయడం, స్పిన్‌ను ఫేస్ చేయడాన్ని ఎంజాయ్ చేయాలి. రవీంద్ర జడేజా, మిచెల్ శాంట్నర్, ఆడమ్ జాంపా బౌలింగ్‌లోని క్వాలిటీతో పాటు కేన్ విలియమ్సన్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ లాంటి బ్యాటర్ల స్ట్రైక్ రొటేషన్ కీలకం. ఫోర్లు, సిక్సులు కొట్టేలా ఉండే పిచ్‌కే మంచి రేటింగ్ ఇవ్వడమనే దాన్ని నేను సపోర్ట్ చేయను. పిచ్ రేటింగ్ మీద ఇంకా బెటర్ సిస్టమ్ ఉంటే బాగుంటుంది’ అని ద్రవిడ్ సూచించాడు. మరి.. ఐసీసీపై ద్రవిడ్ సీరియస్ అవ్వడం మీద మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: క్రికెట్ దేవుడు రిటైరై 10 ఏళ్లవుతున్నా అదే అభిమానం.. ఫ్యాన్స్ అంతే బాస్!