టీమిండియాపై జోష్ హేజల్​వుడ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. అదే వాళ్ల బలమంటూ..!

  • Author singhj Published - 04:09 PM, Sun - 15 October 23
  • Author singhj Published - 04:09 PM, Sun - 15 October 23
టీమిండియాపై జోష్ హేజల్​వుడ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. అదే వాళ్ల బలమంటూ..!

వన్డే వరల్డ్ కప్-2023లో భారత క్రికెట్ జట్టు జైత్రయాత్ర కొనసాగిస్తోంది. ఆడిన మూడు మ్యాచుల్లోనూ ప్రత్యర్థులను చిత్తు చేసి టోర్నీలో ఫేవరెట్స్ నుంచి హాట్ ఫేవరెట్స్​గా మారింది. టీమిండియాతో మ్యాచ్ అంటే అపోజిషన్ టీమ్స్ భయపడేలా మన ప్లేయర్లు ఆడుతున్నారు. బౌలర్లు ఏమాత్రం జంకకుండా బౌలింగ్ చేస్తున్నారు. రన్స్ పోయినా ఫర్వాలేదు.. వికెట్లే టార్గెట్​గా పెట్టుకొని బ్యాటర్లను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. భారత బ్యాట్స్​మెన్ కూడా ఎలాంటి బెరుకూ లేకుండా బ్యాటింగ్ చేస్తున్నారు. మ్యాచ్ కండీషన్స్​కు తగ్గట్లు ఆడుతూ ప్రత్యర్థులకే ఏమాత్రం కోలుకునే ఛాన్స్ ఇవ్వడం లేదు.

ఫస్ట్ మ్యాచ్​లో ఆస్ట్రేలియాను ఓడించిన భారత టీమ్.. సెకండ్ మ్యాచ్​లో ఆఫ్ఘానిస్థాన్​ఫై విక్టరీ సాధించింది. దాయాది పాకిస్థాన్​ను మూడో మ్యాచ్​లో చిత్తు చేసి ప్రపంచ కప్ పాయింట్స్ టేబుల్​లో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. మన జట్టు ఫామ్, ఆటగాళ్ల దూకుడు, కెప్టెన్ రోహిత్ శర్మ ముందుండి నడపడం, కోచ్ రాహుల్ ద్రవిడ్ వ్యూహాలు బాగా వర్కవుట్ అవుతున్నాయి. రోహిత్ సేన ఇలాగే జోరు కొనసాగిస్తే ఆపడం ప్రత్యర్థులకు మరింత కష్టమవుతుంది. తర్వాతి మ్యాచుల్లో బంగ్లాదేశ్, న్యూజిలాండ్ లాంటి టీమ్స్​ను టీమిండియా ఎలా ఎదుర్కొంటుందో చూడాలి.

ధర్మశాల లాంటి పేస్ బౌలింగ్​కు సహకరించే పిచ్​పై పదునైన పేస్ అటాక్ కలిగిన న్యూజిలాండ్ టీమ్​తో భారత్ గెలిస్తే ఇక టోర్నీలో తిరుగులేనట్లే. ఇదిలా ఉంటే.. వరుస విజయాలు సాధిస్తున్న టీమిండియాపై ఆసీస్ పేసర్ జోష్ హేజల్​వుడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత జట్టు బ్యాటింగ్ లైనప్ చాలా బలంగా ఉందన్నాడు. సూర్యకుమార్ యాదవ్ లాంటి పించ్​ హిట్టర్​కు టీమ్​లో ప్లేస్ లేక, బెంచ్ మీద కూర్చున్నాడంటేనే.. టీమిండియా ఎంత బలంగా ఉందో అర్థం చేసుకోవాలన్నాడు హేజల్​వుడ్. భారత్​ను ఎదుర్కోవడం అంత ఈజీ కాదన్నాడీ కంగారూ పేసర్. మరి.. టీమిండియాపై హేజల్​వుడ్ చేసిన వ్యాఖ్యల మీద మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: World Cup: పాకిస్థాన్ పేసర్ షాహిన్ అఫ్రిదీ గాలి తీసేసిన రవిశాస్త్రి!

Show comments