టీమిండియా లెజెండ్ మహేంద్ర సింగ్ ధోనీకి అరుదైన గౌరవం దక్కింది. ఇలాంటి గౌరవం మాహీకి దక్కుతుందని ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. ధోనీకి దక్కిన ఆ గౌరవం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
టీమిండియా లెజెండ్ మహేంద్ర సింగ్ ధోనీకి అరుదైన గౌరవం దక్కింది. ఇలాంటి గౌరవం మాహీకి దక్కుతుందని ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. ధోనీకి దక్కిన ఆ గౌరవం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
మహేంద్ర సింగ్ ధోని.. ఈ పేరు ప్రస్తావన రానిదే ఇండియన్ క్రికెట్ హిస్టరీ గురించి చెప్పలేం. అంతగా భారత క్రికెట్ పై తన ప్రభావం చూపించాడు ధోని. ఒక ప్లేయర్ గా, కెప్టెన్ గా అతడు సాధించిన ఘనతల గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. కెరీర్ కొత్తలో ధనాధన్ ఇన్నింగ్స్ లతో ఒక్కసారిగా క్రికెట్ వరల్డ్ దృష్టిని ఆకర్షించాడు మహీ. ఎంతటి భీకర బౌలింగ్ అటాక్ మీదైనా ఫోర్లు, సిక్సులు కొడుతూ మ్యాచ్ ను ఫినిష్ చేయడంలో ఎక్స్పర్ట్ గా మారాడు. యువరాజ్ సింగ్ తో కలిసి ఛేజింగ్ లో ఎన్నో మ్యాచుల్లో టీమిండియాను గెలిపించాడు ధోని. అతని టాలెంట్, ఒత్తిడి లేకుండా ఆడటం, కూల్ గా ఉండే తత్వాన్ని చూసి 2007 టీ20 వరల్డ్ కప్ లో జట్టు కెప్టెన్సీ బాధ్యతల్ని అప్పగించారు.
ఆ వరల్డ్ కప్ లో బ్యాటర్ గా, కెప్టెన్ గా ఫుల్ సక్సెస్ అయిన ధోని.. భారత్ ను ఛాంపియన్ గా నిలిపాడు. దీంతో భారత క్రికెట్ సేఫ్ హ్యాండ్స్ లో ఉందని అందరికీ అర్థమైపోయింది. ధోనీనే ఫ్యూచర్ స్టార్ అని.. టీమిండియాకు మరిన్ని విజయాలు అందిస్తాడని అందరూ డిసైడయ్యారు. వారి నమ్మకాన్ని మహీ వమ్ము చేయలేదు. దాదాపుగా మూడు దశాబ్దాలుగా అందని ద్రాక్షగా ఉన్న వరల్డ్ కప్ ను 2011లో భారత్ కు అందించాడు ధోని. స్వదేశంలో జరిగిన మెగా టోర్నీలో టీమిండియాను ఛాంపియన్ గా నిలిపి క్రికెట్ దేవుడు సచిన్ తీరని డ్రీమ్ ను నెరవేర్చాడు ధోని. అయితే ఇందులో యువరాజ్ సింగ్, వీరేంద్ర సెహ్వాగ్, గౌతం గంభీర్, సురేష్ రైనా, ఆశిష్ నెహ్రా, జహీర్ ఖాన్ లాంటి మిగతా ప్లేయర్ల కాంట్రిబ్యూషన్ ను తక్కువ చేయడానికి లేదు.
వరల్డ్ కప్-2011 విజయంలో యువరాజ్, గంభీర్ లాంటి ప్లేయర్ల పాత్ర ఎంతగానో ఉంది. అయితే సారథిగా టీమ్ ను ముందుండి నడపడం, కెప్టెన్సీ నాక్ తో అందరిలోనూ స్ఫూర్తిని నింపిన ధోనీకి ఎక్కువ క్రెడిట్ దక్కింది. ఆ ప్రపంచ కప్ లో కులశేఖర బౌలింగ్ లో మహీ కొట్టిన హెలికాప్టర్ షాట్ కి బాల్ వెళ్లి సిక్స్ బౌండరీలో పడింది. ఈ విన్నింగ్ షాట్ ఇప్పటికీ అభిమానుల మనసుల్లో మెదులుతూ ఉంటుంది. ఈ షాట్ ను ధోని కొట్టడం, భారత్ కప్పు గెలవడంతో ముంబై, వాంఖడే స్టేడియంలోని వేలాది మంది ఫ్యాన్స్ సంతోషంలో మునిగిపోయారు. ఆ మ్యాచ్ లో ధోని కొట్టిన సిక్స్ స్టేడియంలో దూరంగా ఉన్న సీట్లలో పడింది.
ప్రస్తుతం వరల్డ్ కప్-2023 మ్యాచుల నేపథ్యంలో అక్టోబర్ 21న ఇంగ్లాండ్-సౌతాఫ్రికా మ్యాచ్ కు ఆతిథ్యం ఇచ్చేందుకు వాంఖడే స్టేడియం రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో ధోని కొట్టిన సిక్స్ ల్యాండ్ అయిన సీట్ల దగ్గర వరల్డ్ కప్-2011 విన్నింగ్ టీమ్ ఫొటోను పెట్టి స్పెషల్ గా డిజైన్ చేశారు. ఆ సీట్లకు కింద నార్మల్ సీట్లను కేటాయించారు. క్రికెట్ లో ఇలా ఒక బాల్ పడిందని సీట్లను ప్రత్యేకంగా గౌరవిస్తూ, స్పెషల్ జోన్ గా రిజర్వ్డ్గా ఉంచడం బహుశా ఇదే ఫస్ట్ టైమ్ కావొచ్చు. ఈ న్యూస్ తెలిసిన ఫ్యాన్స్ ఇది ధోనీకి దక్కిన అరుదైన గౌరవం అని నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు. దీన్ని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదని చెబుతున్నారు. మరి.. ధోని కొట్టిన షాట్ కు వాంఖడే స్టేడియం ఈ విధంగా గౌరవించడంపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: మనం ఏది చేస్తే.. మనకు అదే జరుగుతుంది! కోహ్లీ విషయంలో అదే నిజమైంది!
The two special seats at Wankhede Stadium where Dhoni hit the winning six in the World Cup 2011 final. pic.twitter.com/0nQGnHvzLK
— Johns. (@CricCrazyJohns) October 21, 2023
The two iconic seats of the Wankhede Stadium where MS Dhoni’s World Cup winning six landed. pic.twitter.com/Hw79pKGJlt
— Mufaddal Vohra (@mufaddal_vohra) October 20, 2023