iDreamPost
android-app
ios-app

భార్య అనుష్క కంటే ఆమెనే తనకు ముఖ్యం అంటున్న కోహ్లీ!

  • Author singhj Published - 04:42 PM, Thu - 26 October 23

భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ తన లైఫ్​లో ఒక వ్యక్తి గురించి ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ఆమె తనకు చాలా ముఖ్యమని చెప్పాడు. కోహ్లీ ఎవరి గురించి మాట్లాడాడో ఇప్పుడు తెలుసుకుందాం..

భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ తన లైఫ్​లో ఒక వ్యక్తి గురించి ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ఆమె తనకు చాలా ముఖ్యమని చెప్పాడు. కోహ్లీ ఎవరి గురించి మాట్లాడాడో ఇప్పుడు తెలుసుకుందాం..

  • Author singhj Published - 04:42 PM, Thu - 26 October 23
భార్య అనుష్క కంటే ఆమెనే తనకు ముఖ్యం అంటున్న కోహ్లీ!

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ వరల్డ్ కప్​లో దుమ్మురేపుతున్నాడు. ఒకదాన్ని మించి మరో అద్భుతమైన ఇన్నింగ్స్​లతో భారత జట్టును సింగిల్ హ్యాండ్​తో గెలిపిస్తున్నాడు. ఈ వరల్డ్ కప్​లో ఇప్పటిదాకా ఆడిన ఐదు మ్యాచుల్లో కలిపి 354 రన్స్ చేసిన విరాట్.. అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల లిస్టులో రెండో ప్లేసులో ఉన్నాడు. ఈ జాబితాలో సౌతాఫ్రికా వికెట్ కీపర్ క్వింటన్ డికాక్ (407 రన్స్) అగ్రస్థానంలో ఉన్నాడు. ఆస్ట్రేలియాతో ఆడిన తొలి మ్యాచ్​లో 85 రన్స్ చేసిన కోహ్లీ.. ఆఫ్ఘానిస్థాన్​పై మరో హాఫ్ సెంచరీ బాదాడు. పాకిస్థాన్​తో మ్యాచ్​లో పెద్దగా స్కోర్ చేయకపోయినా.. బంగ్లాదేశ్​తో మ్యాచ్​లో కోహ్లీ (103 నాటౌట్) సెంచరీతో చెలరేగాడు.

బంగ్లాపై ఆడిన ఊపునే న్యూజిలాండ్​తో మ్యాచ్​లోనూ కంటిన్యూ చేశాడు కోహ్లీ. కివీస్​పై 95 రన్స్ చేసి గెలుపులో కీలక పాత్ర పోషించాడు. ఈ ఇన్నింగ్స్ ద్వారా తనను ఛేజింగ్ కింగ్ అని ఎందుకు పిలుస్తారో మరోమారు ప్రూవ్ చేశాడు విరాట్. నెక్స్ట్ ఇంగ్లండ్​తో జరిగే మ్యాచ్ కోసం అతడు ప్రిపేర్ అవుతున్నాడు. ఆదివారం నాడు జరిగే మ్యాచ్​లో ఇదే ఊపును కొనసాగించాలని అనుకుంటున్నాడు. అలాంటి కోహ్లీ తాజాగా తన లైఫ్ గురించి పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. భార్య అనుష్క శర్మ కంటే కూడా ఒక మహిళ తన జీవితంలో చాలా ముఖ్యమన్నాడు విరాట్. ఆమెనే తన తల్లి సరోజ్ కోహ్లీ అని తెలిపాడు.

‘మా అమ్మ బాగోగులు చూసుకోవడం నాకు చాలా ఇంపార్టెంట్. ఆమె సంతోషమే నాకు ముఖ్యం. మా అమ్మను ఆనందంగా ఉంచే ప్రతి చిన్న విషయం నాకు ఎంతో కీలకం’ అని కోహ్లీ చెప్పుకొచ్చాడు. ఫిట్​గా మారే క్రమంలో కాస్త బక్కచిక్కినట్లు కనిపించానని.. దీంతో అమ్మ టెన్షన్ పడిందన్నాడు కోహ్లీ. ‘ఎందుకింత బలహీనంగా కనిపిస్తున్నావని అమ్మ ఎప్పుడూ అడుగుతూ ఉంటుంది. సరిగ్గా తింటున్నావా లేదా అని రోజూ ఫోన్ చేస్తుంది. గత 8 నుంచి 9 ఏళ్లుగా నేను హెల్తీగా లేనని.. నాకేదో అయిపోయిందని ఆమె అనుకుంటోంది. కానీ ఆమెకు ఎన్నోసార్లు చెప్పా. ఇది నా ఫిట్​నెస్​లో భాగమని నచ్చజెప్పా. ఇదంతా నాకో వరం లాంటిది’ అని కోహ్లీ పేర్కొన్నాడు. మరి.. తన తల్లి గురించి కోహ్లీ చేసిన కామెంట్స్​పై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: కోహ్లీని ప్రశంసల్లో ముంచెత్తిన వార్నర్.. విరాట్ నుంచి అది నేర్చుకున్నానంటూ..!