భారత స్టార్ ఓపెనర్ శుబ్‌మన్ గిల్ వరల్డ్ కప్‌లో అంతగా రాణించడం లేదు. తన మీద ఫ్యాన్స్ పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్కు తగ్గట్లు అతడి బ్యాటింగ్ లేదు.
భారత స్టార్ ఓపెనర్ శుబ్‌మన్ గిల్ వరల్డ్ కప్‌లో అంతగా రాణించడం లేదు. తన మీద ఫ్యాన్స్ పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్కు తగ్గట్లు అతడి బ్యాటింగ్ లేదు.
భారత క్రికెట్ టీమ్ వన్డే వరల్డ్ కప్‌లో అదరగొడుతోంది. వరుస విజయాలతో సెమీస్ బెర్త్‌ను ఖాయం చేసుకుంది రోహిత్ సేన. ఆడిన ఆరు మ్యాచుల్లోనూ నెగ్గి జైత్రయాత్రను కొనసాగిస్తోంది టీమిండియా. నెక్స్ట్ ఆడబోయే మూడు మ్యాచులు ఒకరకంగా భారత టీమ్‌కు ప్రయోగాలు చేసేందుకు ఛాన్స్ అనే చెప్పాలి. ఎక్కడైతే లోపాలు ఉన్నాయో వాటిని సరిచేసుకొని సెమీఫైనల్ కల్లా రెడీగా ఉండాలి. అందుకోసం అవసరమైతే ఈ మ్యాచుల్లో కొందరికి రెస్ట్ ఇచ్చి.. బెంచ్ మీద ఉన్న ప్లేయర్లను పరీక్షించొచ్చు. వరుసగా విఫలమవుతున్న శ్రేయస్ అయ్యర్, శుబ్‌మన్ గిల్‌ను పక్కనపెట్టి ఇషాన్ కిషన్‌కు ఛాన్స్ ఇవ్వాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.
ముఖ్యంగా ఓపెనర్ శుబ్‌మన్ గిల్‌ను టీమ్‌లో నుంచి తీసేయాలని కామెంట్స్ బాగా వినిపిస్తున్నాయి. దీనికి కారణం అతడు ఫెయిల్ అవుతుండటమే. ఇప్పుడిప్పుడే టీమ్‌లో సెటిల్ అవుతున్న గిల్‌కు ఇదే ఫస్ట్ వరల్డ్ కప్. ఎన్నో ఎక్స్‌పెక్టేషన్స్‌తో మెగా టోర్నీలోకి అడుగుపెట్టాడు గిల్. కానీ డెంగ్యూ కారణంగా తొలి రెండు మ్యాచుల్లో అతడు ఆడలేదు. ఆ తర్వాత నాలుగు మ్యాచుల్లో ఆడినా.. కేవలం బంగ్లాదేశ్‌పై 53 రన్స్ చేసి ఆకట్టుకున్నాడు. పాకిస్థాన్‌పై 16 పరుగులు, న్యూజిలాండ్ మీద 26 పరుగులు, ఇంగ్లండ్‌పై 9 రన్స్ మాత్రమే చేశాడు. మరో ఓపెనర్ రోహిత్ శర్మ చెలరేగిపోతుంటే.. గిల్ కనీసం అతడికి తోడుగా నిలబడలేకపోతున్నాడు. అతడు ఇలాగే ఆడితే సెమీస్‌లో భారత్‌కు కష్టాలు తప్పవని క్రికెట్ అనలిస్టులు అంటున్నారు.
డెంగ్యూ వల్లే గిల్ పెర్ఫార్మెన్స్ తగ్గిందని కొందరు అనలిస్టులు అంటున్నారు. ఈ నేపథ్యంలో గిల్ కీలక వ్యాఖ్యలు చేశాడు. తనకు డెంగ్యూ ఎప్పుడు సోకిందో తెలియలేదన్నాడు. త్రివేండ్రంలో ప్రాక్టీస్ సందర్భంగా డెంగ్యూకు సంబంధించిన కొన్ని సింప్టమ్స్ బయటపడ్డాయని తెలిపాడు. తనకేమీ అర్థం కాలేదని.. డెంగ్యూ కారణంగా టీమ్‌కు దూరమవ్వాల్సి వచ్చిందన్నాడు గిల్. ఇది తనను బాధించిందని.. డెంగ్యూ వల్ల సన్నబడ్డానని యంగ్ బ్యాటర్ పేర్కొన్నాడు. దాదాపు 6 కిలోల బరువు తగ్గానన్నాడు. దేశానికి ప్రాతినిధ్యం వహించడం గొప్ప విషయమని గిల్ చెప్పుకొచ్చాడు. కన్సిస్టెంట్గా రాణిస్తేనే ఛాన్సులు వస్తాయని.. ఇది పెద్ద ఛాలెంజ్ అని వివరించాడు. మరి.. గిల్ వ్యాఖ్యలపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: World Cup 2023: పాక్ చెత్త పెర్ఫార్మెన్స్.. ఇంజమామ్ సంచలన నిర్ణయం!