iDreamPost

World Cup 2023: పాక్ చెత్త పెర్ఫార్మెన్స్.. ఇంజమామ్ సంచలన నిర్ణయం!

  • Author singhj Published - 09:33 PM, Mon - 30 October 23

వరల్డ్ కప్​లో పాకిస్థాన్ టీమ్ చెత్తగా పెర్ఫార్మ్ చేస్తోంది. ఆడిన ఐదు మ్యాచుల్లో నాలుగింట్లో ఓడింది దాయాది జట్టు. దీంతో ఇంజమామ్ ఉల్ హక్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు.

వరల్డ్ కప్​లో పాకిస్థాన్ టీమ్ చెత్తగా పెర్ఫార్మ్ చేస్తోంది. ఆడిన ఐదు మ్యాచుల్లో నాలుగింట్లో ఓడింది దాయాది జట్టు. దీంతో ఇంజమామ్ ఉల్ హక్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు.

  • Author singhj Published - 09:33 PM, Mon - 30 October 23
World Cup 2023: పాక్ చెత్త పెర్ఫార్మెన్స్.. ఇంజమామ్ సంచలన నిర్ణయం!

మిగతా అన్ని టీమ్స్​లాగే ఎన్నో ఎక్స్​పెక్టేషన్స్​తో వరల్డ్ కప్-2023 టోర్నమెంట్​ను మొదలుపెట్టింది పాకిస్థాన్. అప్పటికే ఆసియా కప్ ఓటమితో కుంగిపోయిన బాబర్ సేన ఎలాగైనా మెగా టోర్నీలో గెలిచి తమ సత్తా ఏంటో వరల్డ్ క్రికెట్​కు చూపించాలని అనుకున్నారు. అందుకు తగ్గట్లే మొదటి మ్యాచ్​లో శ్రీలంకపై 6 వికెట్ల తేడాతో నెగ్గి సూపర్బ్​గా తమ జర్నీని స్టార్ట్ చేశారు. కానీ ఆ తర్వాత నుంచి పాక్ టీమ్​కు ఏదీ కలసి రావడం లేదు. వరుసగా ఇండియాతో పాటు ఆస్ట్రేలియా, ఆఫ్ఘానిస్థాన్​, సౌతాఫ్రికా చేతుల్లో ఓటమిపాలైంది పాకిస్థాన్. ఐదు మ్యాచుల్లో నాలుగు ఓటములతో సెమీఫైనల్ అవకాశాలను చేజేతులుగా మిస్ చేసుకుంది. ఒకవేళ మిగిలిన నాలుగు మ్యాచుల్లోనూ నెగ్గినా.. బాబర్ సేన సెమీఫైనల్​కు చేరుకోవడం అంత ఈజీగా కనిపించడం లేదు.

టీమిండియా, ఆసీస్, సౌతాఫ్రికా లాంటి బడా టీమ్స్ చేతిలో ఓడినా ఫర్వాలేదు గానీ పసికూన ఆఫ్ఘాన్ చేతుల్లోనూ పాక్ ఓటమిపాలవ్వడాన్ని ఆ జట్టు అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. బాబర్ ఆజం తన కెప్టెన్సీకి గుడ్​బై చెప్పాలని సోషల్ మీడియాలో నెటిజన్స్ డిమాండ్ చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో పాకిస్థాన్ చీఫ్​ సెలెక్టర్, లెజెండరీ బ్యాటర్ ఇంజమామ్ ఉల్ హక్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. పాక్ వరుస ఓటములకు బాధ్యతగా చీఫ్ సెలెక్టర్ పదవికి రాజీనామా చేశాడు. తన రెసిగ్నేషన్ లెటర్​ను పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చీఫ్ జాకా అష్రాఫ్​కు పంపించాడు.

ఇంజమామ్ తీసుకున్న తాజా నిర్ణయంతో పీసీబీపై ఆర్థిక భారం పడనుందని తెలుస్తోంది. ఈ మాజీ క్రికెటర్​కు పీసీబీ 15 మిలియన్ల పాకిస్థాన్ రూపాయలను నష్టపరిహారంగా చెల్లించాల్సి ఉంటుందని ఆ దేశ మీడియా పేర్కొంది. ఇది ఇంజమామ్ ఆరు నెలల జీతానికి సమానమని తెలిసింది. ఇదిలా ఉంటే.. ఇంజమామ్ మీద పరస్పర విరుద్ధ ప్రయోజనాలు ఆరోపణలు వచ్చాయి. ప్లేయర్ల ఏజెంట్ అయిన తల్హా రెహ్మాన్​కు చెందిన యాజో ఇంటర్నేషనల్ లిమిటెడ్ కంపెనీలో అతడికి వాటా ఉందని ప్రచారం జరిగింది. తల్హా రెహ్మాన్ సంస్థ పాక్ కెప్టెన్ బాబర్ ఆజం సహా రిజ్వాన్, షాహిన్ షా అఫ్రిది లాంటి స్టార్ ఆటగాళ్లకు ప్రాతినిధ్యం వహిస్తోంది.

ఇక, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)కి ఆటగాళ్లకు మధ్య సెంట్రల్ కాంట్రాక్ట్​కు సంబంధించి కాంట్రవర్సీ నెలకొంది. ఐసీసీ నుంచి పీసీబీకి అందే సొమ్ములో తమకు వాటా ఇవ్వాలని పాక్ ప్లేయర్లు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకున్న ఇంజమామ్.. పీసీబీకి, ప్లేయర్లకు నడుమ మధ్యవర్తిత్వం వహించి వివాదానికి ముగింపు పలికాడట. క్రికెటర్ల తరఫున మధ్యవర్తిత్వం వహించడం పరస్పర ప్రయోజనాల కిందకే వస్తుందట. సెలెక్టర్ పదవి నుంచి ఇంజమామ్ తప్పుకోవడానికి ఇది కూడా ఒక కారణమని సమాచారం. మరి.. పాక్ వరుస ఓటములు, ఇంజమామ్ రాజీనామాపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: కోహ్లీ మరో ఘనత.. సచిన్ టెండూల్కర్​తో సమానంగా నిలిచిన విరాట్!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి