iDreamPost
android-app
ios-app

ఆ నాలుగు టీమ్స్ సెమీస్​కు చేరతాయి.. వరల్డ్ కప్​పై సచిన్ ప్రెడిక్షన్!

  • Author singhj Published - 03:44 PM, Fri - 6 October 23
  • Author singhj Published - 03:44 PM, Fri - 6 October 23
ఆ నాలుగు టీమ్స్ సెమీస్​కు చేరతాయి.. వరల్డ్ కప్​పై సచిన్ ప్రెడిక్షన్!

వన్డే వరల్డ్ కప్ సందడి మొదలైపోయింది. ఈసారి మెగాటోర్నీలో తొలి మ్యాచులోనే అనూహ్యమైన రిజల్ట్ వచ్చింది. ఎవరూ ఎక్స్​పెక్ట్ చేయని విధంగా డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్​ను రన్నరప్ న్యూజిలాండ్ మట్టికరిపించింది. ఈ మ్యాచులో కివీస్​పై ఎవరూ పెద్దగా అంచనాలు పెట్టుకోలేదు. పటిష్టమైన ఇంగ్లీష్ టీమ్ ముందు న్యూజిలాండ్ నిలబడటం కష్టమేనని అంతా అనుకున్నారు. కానీ ఇంగ్లండ్​ను 9 వికెట్ల తేడాతో చిత్తుచేసింది కివీస్. 282 రన్స్ టార్గెట్​ను మరో 82 బంతులు మిగిలి ఉండగానే ఒక వికెట్ మాత్రమే కోల్పోయి ఛేజ్ చేసేసింది. దీంతో అంతా షాక్ అయ్యారు. ఇక, ఈ వరల్డ్ కప్​ అంబాసిడర్​గా క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్​ను నియమించిన విషయం తెలిసిందే.

ఇంగ్లండ్-న్యూజిలాండ్ మధ్య జరిగిన ప్రపంచ కప్ ఓపెనింగ్ మ్యాచ్​కు సచిన్ వచ్చాడు. మ్యాచ్ మొదలవ్వడానికి ముందు ట్రోఫీని తానే తీసుకొచ్చి స్టేడియంలో ఉంచాడు. అనంతరం కాసేపు కామెంట్రీ కూడా చెప్పాడు. ఇంగ్లండ్ జట్టు బ్యాటింగ్ చేస్తున్న టైమ్​లో సచిన్ కామెంట్రీ బాక్సులో సందడి చేశాడు. ఈ సమయంలో అతడితో పాటు వెస్టిండీస్ లెజెండ్ ఇయాన్ బిషప్ తదితరులు ఉన్నారు. ఈ టైమ్​లో టీమిండియా వరల్డ్ కప్ గెలుస్తుందా? అని బిషప్ సచిన్​ను ప్రశ్నించాడు. దీనికి రిప్లయ్ ఇచ్చిన మాస్టర్.. ప్రస్తుతం భారత జట్టు మంచి బ్యాలెన్స్​తో ఉందన్నాడు. టీమిండియా గనుక అనుకున్న స్థాయిలో రాణిస్తే 2011 తరహాలోనే వన్డే ప్రపంచ కప్​ గెలుస్తారని సచిన్ ధీమా వ్యక్తం చేశాడు. అదే టైమ్​లో ఈసారి సెమీఫైనల్స్​కు చేరే టీమ్స్ ఏవో చెప్పాలని బిషన్ సచిన్​ను అడిగాడు.

మంచి బ్యాలెన్స్ ఉన్న టీమ్స్ మాత్రమే సెమీస్​కు చేరతాయని సచిన్ చెప్పుకొచ్చాడు. టాప్-4లో పాకిస్థాన్​కు ఆయన చోటు ఇవ్వలేదు. కచ్చితంగా టీమిండియా సెమీస్​కు చేరుతుందన్న ఆయన.. ఆస్ట్రేలియా కూడా మంచి బ్యాలెన్స్​తో కనిపిస్తోందన్నాడు. యంగ్​స్టర్స్​తో పాటు ఎక్స్​పీరియెన్స్​డ్ ప్లేయర్లతో బలంగా కనిపిస్తున్న ఇంగ్లండ్ సెమీస్​కు చేరుతుందన్నాడు సచిన్. ఈ లిస్టులో లాస్ట్ ప్లేసును న్యూజిలాండ్​కు ఇచ్చాడీ లెజెండ్. కివీస్ చాలా డేంజర్ టీమ్ అని చెప్పుకొచ్చాడు సచిన్. మరి.. సచిన్ సెలెక్ట్ చేసిన నాలుగు జట్లు సెమీస్​కు వెళ్తాయని మీరు అనుకుంటున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: ఇండియాను అవమానించే కుట్ర! పాక్‌ ఫ్యాన్స్‌.. ఈ లెక్కలు చూడండ్రా బాబు!