iDreamPost
android-app
ios-app

వాళ్లిద్దరి వల్లే ఈ విజయం.. కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీపై రోహిత్ ప్రశంసలు!

  • Author singhj Published - 10:16 AM, Mon - 9 October 23
  • Author singhj Published - 10:16 AM, Mon - 9 October 23
వాళ్లిద్దరి వల్లే ఈ విజయం.. కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీపై రోహిత్ ప్రశంసలు!

వన్డే ప్రపంచ కప్-2023ను టీమిండియా గ్రాండ్ విక్టరీతో మొదలుపెట్టింది. చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా ఆస్ట్రేలియాతో ఆదివారం నాడు జరిగిన మ్యాచ్​లో భారత్ 6 ఇకెట్ల తేడాతో గెలుపొందింది. టీమ్​కు ఓటమి తప్పదనే పరిస్థితుల్లో సీనియర్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ (85), కేఎల్ రాహుల్ (97 నాటౌట్)లు అద్భుతంగా బ్యాటింగ్​ చేశారు. ఆసీస్​పై మ్యాచ్​ గెలవడంలో కీలక పాత్ర పోషించిన కోహ్లీ-రాహుల్​ మీద కెప్టెన్ రోహిత్ శర్మ ప్రశంసల జల్లులు కురిపించాడు. వీళ్లిద్దరి వల్లే వరల్డ్ కప్​లో శుభారంభం చేశామన్నాడు హిట్​మ్యాన్. ఈ విజయానికి క్రెడిట్ కోహ్లీ, రాహుల్​దేనని స్పష్టం చేశాడు. ఛేజింగ్​లో భారత్​కు దక్కిన ఆరంభం చూసి భయపడ్డానని.. అయితే కోహ్లీ, రాహుల్ సూపర్ పార్ట్​నర్​షిప్​తో టీమ్​ను గెలిపించారని మెచ్చుకున్నాడు.

‘మేం బౌలింగ్​తో పాటు ఫీల్డింగ్​లో అద్భుత ప్రదర్శన కనబర్చాం. కీలకమైన ఈ రెండు విభాగాల్లో టాప్ క్లాస్ పెర్ఫార్మెన్స్​ ఇచ్చినందుకు హ్యాపీ. కఠినమైన పిచ్ మీద బ్యాటర్లకు రన్స్ ఇవ్వకుండా ఫీల్డింగ్ ద్వారా బాగా కట్టడి చేశాం. ఈ వికెట్​ స్పిన్​తో పాటు పేస్​కు అనుకూలంగా ఉంది. ముఖ్యంగా సీమర్స్​కు రివర్స్ స్వింగ్ వర్కౌట్ అయింది. మా బౌలర్లు సరైన ఏరియాల్లో బౌలింగ్ చేశారు. మేం ఆల్​రౌండ్ ప్రదర్శన కనబర్చాం. బ్యాటింగ్​లో సరైన ఆరంభాన్ని ఇవ్వలేకపోయాం. రెండు రన్స్​కే 3 వికెట్లు పడటంతో టెన్షన్ పడ్డా. అయితే కోహ్లీ, రాహుల్​కు హ్యాట్సాఫ్. తీవ్రమైన ఒత్తిడిలోనూ మంచి భాగస్వామ్యంతో టీమ్ గెలుపుకు బాటలు వేశారు’ అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.

టీమిండియాకు అసలైన సవాల్ నెక్స్ట్ ఎదురు కానుందన్నాడు కెప్టెన్ రోహిత్ శర్మ. ఇతర వేదికలపై ఆడటం తమకు ఛాలెంజ్​తో కూడుకున్నదన్నాడు. దేశవ్యాప్తంగా వేర్వేరు వేదికల్లో విభిన్నమైన పరిస్థితుల్లో ఆడాల్సి ఉందన్నాడు హిట్​మ్యాన్. భిన్నమైన పరిస్థితుల్లో ఆడాల్సి ఉన్నందున టీమ్ కాంబినేషన్ కూడా మారే అవకాశం ఉందని తెలిపాడు. అయితే అన్ని సవాళ్లకు తాము రెడీ ఉన్నామన్నాడు. తీవ్ర ఉక్కపోత మధ్యలో కూడా మ్యాచ్​కు హాజరై తమకు అండగా నిలిచిన చెన్నై ఫ్యాన్స్​కు రోహిత్ థ్యాంక్స్ చెప్పాడు. మరి.. ఆసీస్​తో మ్యాచ్​లో టీమిండియా పెర్ఫార్మెన్స్​పై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: కోహ్లీ దగ్గర నుంచి ఆ టెక్నిక్​ను యంగ్​స్టర్స్ నేర్చుకోవాలి: గంభీర్