ఒకరి మీదే డిపెండ్ అవ్వం.. రోహిత్ సపోర్ట్ చేస్తున్నాడా? వార్నింగ్ ఇస్తున్నాడా?

  • Author singhj Published - 03:12 PM, Thu - 2 November 23

వరల్డ్ కప్ సెమీస్​కు టైమ్ దగ్గరపడుతోంది. ఏ టీమ్ సెమీఫైనల్​కు చేరుకుంటుందనే దానిపై మరో వారం రోజుల్లో క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. ఈ నేపథ్యంలో నెక్స్ట్ ఆడే మ్యాచుల్లో టీమ్ కాంబినేషన్స్ గురించి భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

వరల్డ్ కప్ సెమీస్​కు టైమ్ దగ్గరపడుతోంది. ఏ టీమ్ సెమీఫైనల్​కు చేరుకుంటుందనే దానిపై మరో వారం రోజుల్లో క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. ఈ నేపథ్యంలో నెక్స్ట్ ఆడే మ్యాచుల్లో టీమ్ కాంబినేషన్స్ గురించి భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

  • Author singhj Published - 03:12 PM, Thu - 2 November 23

వన్డే వరల్డ్ కప్​లో టీమిండియా జోరును ఆపడం ఎవ్వరి వల్లా కావడం లేదు. బ్రేకుల్లేని బుల్డోజర్ మాదిరిగా వరుస విజయాలతో దూసుకెళ్తోంది రోహిత్ సేన. ఎదురొచ్చిన ప్రతి ప్రత్యర్థిని చిత్తు చేస్తూ ప్రపంచ కప్పును చేజిక్కించుకునే దిశగా పరుగులు తీస్తోంది. ఇప్పటికే డబుల్ హ్యాట్రిక్ విజయాలు సాధించిన భారత టీమ్.. ఇవాళ శ్రీలంకతో జరిగే మ్యాచ్​లోనూ నెగ్గి సెమీస్ బెర్త్​ను అఫీషియల్​గా ఖాయం చేసుకోవాలని చూస్తోంది. ఈ నేపథ్యంలో వరల్డ్ కప్​లో టీమ్ కాంబినేషన్లకు సంబంధించి కెప్టెన్ రోహిత్ శర్మ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

టీమ్ కాంబినేషన్ విషయంలో తమ ముందు చాలా ఆప్షన్లు ఉన్నాయని రోహిత్ శర్మ అన్నాడు. టీమిండియాలో ప్రతి ప్లేయర్ కూడా రెడీగా ఉన్నాడని.. ఎప్పుడు ఛాన్స్ వచ్చినా వాళ్లు తమ సత్తా ప్రూవ్ చేసుకుంటారని పేర్కొన్నాడు. స్టార్ ఆల్​రౌండర్ హార్దిక్ పాండ్యా లీగ్ దశలోని మ్యాచులకు దూరంగా ఉంటాడనే వార్తలు వచ్చాయి. దీనిపై హిట్​మ్యాన్ రియాక్ట్ అయ్యాడు. ఒకరి మీదే ఓవర్​గా డిపెండ్ అయ్యే ప్రసక్తే లేదని వ్యాఖ్యానించాడు. క్రికెట్​లో ప్రతి కాంబినేషన్ కూడా ఎంతో ముఖ్యమని రోహిత్ శర్మ పేర్కొన్నాడు.

క్రికెట్​లో కాంబినేషన్లు చాలా కీలకం. కాంబినేషన్లను ప్లాన్ ప్రకారం అమలు చేయడం సాధ్యమే. అవసరమైతే ముగ్గురు స్పిన్నర్లు, ఇద్దరు పేసర్లతో ఆడే అవకాశం మా​కు ఉంది. ఇప్పటిదాకా మెగా టోర్నీలో స్పిన్నర్లు కీలక పాత్ర పోషించారు. మిడిల్ ఓవర్లలో వికెట్లు తీస్తూ టీమ్స్​కు వాళ్లు అండగా నిలిచారు. హార్దిక్ పాండ్యా లాంటి ఆల్​రౌండర్ అందుబాటులో ఉన్నా? లేకపోయినా? మా ముందు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సిచ్యువేషన్స్​కు తగ్గట్లు ముగ్గురు స్పిన్నర్లను ఆడిస్తాం. ఒకవేళ కావాలనుకుంటే ముగ్గురు పేసర్లను బరిలోకి దింపుతాం. అయితే, ప్లేయర్లకు తగినంత రెస్ట్ ఇవ్వడం కూడా ముఖ్యమే. కానీ మా పేసర్లు మంచి రిథమ్​తో బౌలింగ్ చేస్తున్నారు. కాబట్టి రెస్ట్ అవసరం లేదని వాళ్లే భావిస్తున్నారు. ఇప్పటికే దీనిపై ఆటగాళ్ల నుంచి ఫీడ్​బ్యాక్ తీసుకున్నా. మ్యాచుల్లో ఆడాలని వారు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు’ అని రోహిత్ చెప్పుకొచ్చాడు.

జట్టు కూర్పు గురించి రోహిత్ చేసిన కామెంట్స్ వైరల్​గా మారాయి. ఎవరి మీదా ఓవర్​గా డిపెండ్ అవ్వబోమని అతడు చెప్పడం ఇంట్రెస్టింగ్​గా మారింది. ఒకవేళ ఎవరైనా ఫెయిలైనా బెంచ్ స్ట్రెంగ్త్ బలంగా ఉందని.. కాబట్టి టీమ్​లో ప్లేస్ విషయంలో పోటీ ఎంత గట్టిగా ఉందో హిట్​మ్యాన్ చెప్పకనే చెప్పాడు. బాగా ఆడిన వారికే టీమ్​లో చోటు ఉంటుందని.. లేకపోతే ప్రత్యామ్నాయాల వైపు చూడాల్సి ఉంటుందని ఇన్​డైరెక్ట్​గా రోహిత్ చెప్పినట్లు కనిపిస్తోంది. పాండ్యాకు సపోర్ట్ చేస్తూనే అతడిపై అతిగా ఆధారపడట్లేదన్నాడు రోహిత్. ఇది అతడికి మాత్రమే కాదు.. టీమ్​లోని అందరు ప్లేయర్లకు వార్నింగ్ ఇచ్చినట్లుగా ఉందని సోషల్ మీడియాలో నెటిజన్స్ అంటున్నారు. మరి.. టీమ్ కాంబినేషన్ విషయంలో రోహిత్ చేసిన వ్యాఖ్యలపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: VIDEO: నేషనల్‌ క్రికెట్‌ అకాడమీలో రిషభ్‌ పంత్‌ రచ్చ!

Show comments