iDreamPost

VIDEO: నేషనల్‌ క్రికెట్‌ అకాడమీలో రిషభ్‌ పంత్‌ రచ్చ!

  • Published Nov 02, 2023 | 12:57 PMUpdated Dec 11, 2023 | 11:50 AM

అంతా బాగుంట.. టీమిండియా యువ క్రికెటర్‌ రిషభ్‌ పంత్‌ ప్రస్తుతం వరల్డ్‌ కప్‌లో దేశానికి ప్రాతినిథ్యం వహించేవాడు. కానీ, దురదృష్టవశాత్తు.. కారు ప్రమాదానికి గురైన పంత్‌.. ప్రస్తుతం ఎన్‌సీఏలో కోలుకుంటున్నాడు. అయితే.. ఎన్‌సీఏలో పంత్‌ ఎంతో సందడిగా గడుపుతున్నాడు..

అంతా బాగుంట.. టీమిండియా యువ క్రికెటర్‌ రిషభ్‌ పంత్‌ ప్రస్తుతం వరల్డ్‌ కప్‌లో దేశానికి ప్రాతినిథ్యం వహించేవాడు. కానీ, దురదృష్టవశాత్తు.. కారు ప్రమాదానికి గురైన పంత్‌.. ప్రస్తుతం ఎన్‌సీఏలో కోలుకుంటున్నాడు. అయితే.. ఎన్‌సీఏలో పంత్‌ ఎంతో సందడిగా గడుపుతున్నాడు..

  • Published Nov 02, 2023 | 12:57 PMUpdated Dec 11, 2023 | 11:50 AM
VIDEO: నేషనల్‌ క్రికెట్‌ అకాడమీలో రిషభ్‌ పంత్‌ రచ్చ!

టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ రిషభ్‌ పంత్‌ ప్రస్తుతం గాయం నుంచి రికవరీ అవుతున్నాడు. పూర్తి ఫిట్‌నెస్‌ సాధించి, తిరిగి జట్టులోకి వచ్చేందుకు ఎంతో శ్రమిస్తున్నాడు. బెంగళూరులోని నేషనల్‌ క్రికెట్‌ అకాడమీలో పంత్‌ రీహ్యాబ్‌ అవుతున్నాడు. అయితే.. ఎన్‌సీఏకు టీమిండియా దిగ్గజ మాజీ క్రికెటర్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ డైరెక్టర్‌గా ఉన్న విషయం తెలిసిందే. కాగా, బుధవారం లక్ష్మణ్‌ పుట్టిన రోజు సందర్భంగా అకాడమీలో వేడుకలు నిర్వహించారు. ప్రస్తుతం అకాడమీలో గాయాల నుంచి తిరిగి కోలుకుంటున్న క్రికెటర్లు రిషభ్‌ పంత్‌, అక్షర్‌ పటేల్‌ ఈ వేడుకల్లో పాల్గొని లక్ష్మణ్‌తో కేక్‌ కట్‌ చేయించారు.

అయితే.. ఈ వేడుకల్లో పంత్‌ ఎంతో హుషారుగా కనిపించాడు. లక్ష్మణ్‌ ముఖానికి మొత్తం కేక్‌ పూసి.. రచ్చ రచ్చ చేశాడు. కాగా, పంత్‌ ఏడాది క్రితం కారు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఢిల్లీ నుంచి తన స్వస్థలం రూర్కీకి వెళ్తున్న క్రమంలో పంత్‌ ప్రయాణిస్తున్న కారు డివైడర్‌ను ఢీకొన్ని పెద్ద ప్రమాదం జరిగింది. ఆ సమయంలో పంతే స్వయంగా కారు నడుపుతున్నాడు. నిద్రమత్తులో ఆ ప్రమాదం చోటుచేసుకుంది. ఆ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పంత్‌.. టీమిండియాకు దూరం అయ్యాడు. చాలా కాలం ఆస్పత్రిలో ఉండి, ఇంట్లో విశ్రాంతి తీసుకుని ఇప్పుడిప్పుడే బ్యాట్‌ పట్టుకుని ప్రాక్టీస్‌ చేస్తున్నాడు.

కాగా, టీమిండియా క్రికెటర్లు గాయపడితే.. నేషనల్‌ క్రికెట్‌ అకాడమీలో రీహ్యాబ్‌ ట్రైనింగ్‌ ఇస్తారనే విషయం తెలిసిందే. ఇక్కడే చాలా మంది ఆటగాళ్లు గాయాల నుంచి తిరిగి వేగంగా కోలుకుని.. జట్టులోకి తిరిగి వచ్చారు. వరల్డ్‌ కప్‌కు ముందు కేఎల్‌ రాహుల్‌, శ్రేయస్‌ అయ్యర్‌ సైతం గాయాల బారిన పడి ఎన్‌సీఏలోనే మంచి ట్రైనింగ్‌తో వేగంగా ఫిట్‌నెస్‌ సాధించారు. ప్రస్తుతం టీమిండియా వరల్డ్‌ కప్‌లో ఇంత అద్భుతంగా రాణిస్తోందంటే.. అందుకు ప్రధాన కారణం ఎన్‌సీఏ అనే చెప్పుకోవాలి. కీలక ఆటగాళ్లను కంటికి రెప్పలా కాపాడుకుంటూ.. జట్టుకు అందిస్తోంది. అలాంటి అకాడమీని లక్ష్మణ్‌ ఎంతో సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. గతంలో రాహుల్‌ ద్రవిడ్‌ సైతం ఈ అకాడమీకి డైరెక్టర్‌గా పనిచేసిన విషయం తెలిసిందే. మరి ఎన్‌సీఏలో లక్ష్మణ్‌ బర్త్‌డే సందర్భంగా పంత్‌ చేసిన హడావిడిపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి