iDreamPost
android-app
ios-app

సిక్స్ కొట్టడం రాదనుకున్నోడు.. సిక్సర్ల కింగ్ అయ్యాడు! సక్సెస్ అంటే ఇదే!

  • Author singhj Published - 04:21 PM, Thu - 12 October 23
  • Author singhj Published - 04:21 PM, Thu - 12 October 23
సిక్స్ కొట్టడం రాదనుకున్నోడు.. సిక్సర్ల కింగ్ అయ్యాడు! సక్సెస్ అంటే ఇదే!

వన్డే వరల్డ్ కప్​-2023లో టీమిండియా వరుస విజయాలతో దూసుకుపోతోంది. మొదటి మ్యాచ్​లో పటిష్టమైన ఆస్ట్రేలియాను ఓడించిన భారత్.. రెండో మ్యాచ్​లో ఆఫ్ఘానిస్థాన్​ను చిత్తు చేసింది. పాకిస్థాన్​తో కీలక మ్యాచ్​కు ముందు టీమిండియాకు మంచి ప్రాక్టీస్ దొరికినట్లయింది. వార్మప్ మ్యాచ్​లు లేకుండా వరల్డ్ కప్​ను స్టార్ట్ చేసింది రోహిత్ సేన. వర్షం వల్ల రెండు వార్మప్ మ్యాచ్​లు లేకపోవడంతో జట్టుకు సరైన ప్రాక్టీస్ దొరకలేదు. అయినా ఆసీస్​తో ఫస్ట్ మ్యాచ్​లో అన్ని విభాగాల్లోనూ భారత్ అదరగొట్టింది. అయితే ఆ మ్యాచ్​లో ఓపెనర్లు రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్​తో పాటు శ్రేయస్ అయ్యర్ ఫెయిలయ్యారు.

ఆఫ్ఘాన్​తో మ్యాచ్​లో రోహిత్, ఇషాన్, అయ్యర్​లకు సరైన ప్రాక్టీస్ లభించినట్లయింది. రోహిత్ సెంచరీతో చెలరేగగా.. ఇషాన్, అయ్యర్​లు కూడా రాణించారు. దీంతో పాక్​కు మ్యాచ్​కు భారత్ సై అంటోంది. దాయాది మ్యాచ్​కు ముందు రోహిత్ ఫామ్​లోకి రావడం టీమిండియాకు పెద్ద ప్లస్ కానుంది. ప్రత్యర్థి ఎవరైనా సరే హిట్​మ్యాన్ క్రీజులో కుదురుకుంటే మ్యాచ్ వన్​సైడ్ అవ్వడం ఖాయం. ఆఫ్ఘాన్​తో మ్యాచ్​లో ఇది మరోమారు ప్రూవ్ అయింది. ఫోర్లు, సిక్సులతో ఆఫ్ఘాన్ బౌలర్లను రోహిత్ ఓ ఆటాడుకున్నాడు. ఈ క్రమంలో విండీస్ లెజెండ్ క్రిస్ గేల్ (553 సిక్సులు) పేరు మీద ఉన్న అత్యధిక సిక్సుల రికార్డును బ్రేక్ చేశాడు. ఇప్పుడీ లిస్టులో రోహిత్ (555 సిక్సులు) ఫస్ట్ ప్లేసులో ఉన్నాడు.

ఇప్పుడు సిక్సులు మీద సిక్సులు కొడుతున్న రోహిత్ ఒకప్పుడు భారీ షాట్ కొట్టేందుకు భయపడేవాడట. ఈ విషయాన్ని స్వయంగా అతడే రివీల్ చేశాడు. కెరీర్ మొదట్లో అసలు సిక్సర్లు కొట్టలేనని భావించానన్నాడు. బాల్​ను ఫెన్సింగ్ దాటించడం చేతకాదని అనుకున్నానని హిట్​మ్యాన్ తెలిపాడు. అలాంటిది అత్యధిక సిక్సుల లాంటి రికార్డు తన పేరు మీద నమోదవుతుందని అప్పట్లో తాను అంచనా వేయలేదన్నాడు రోహిత్. క్రికెట్​లో తాను సాధించాల్సింది ఇంకా చాలా ఉందని.. తన జర్నీ ఇక్కడితో ఆగదన్నాడు. ఇలాంటి రికార్డులు నమోదవుతుంటాయని.. వాటి వల్ల హ్యాపీ ఫీలవుతానని, కానీ సంతృప్తి చెందబోనన్నాడు రోహిత్. హిట్​మ్యాన్ మాటలపై భారత ఫ్యాన్స్ స్పందిస్తున్నారు. సక్సెస్ అంటే ఇదేనని.. సిక్స్ కొట్టడం రాదనుకున్నోడు గేల్ రికార్డునే బ్రేక్ చేశాడని రోహిత్​ను మెచ్చుకుంటున్నారు.

ఇదీ చదవండి: ఇండియా మ్యాచ్​పై మైకేల్ వాన్ సెటైర్స్.. ఇచ్చిపడేసిన ఫ్యాన్స్!