పాకిస్థాన్ క్రికెట్ టీమ్‌పై ఆ దేశ మాజీ క్రికెటర్ రమీజ్ రాజా సెటైర్స్ వేశాడు. తనకు నవ్వొస్తోందని.. నవ్వేందుకు పర్మిషన్ ఉందా అంటూ సొంత జట్టుపై జోక్స్ వేశాడు.
పాకిస్థాన్ క్రికెట్ టీమ్‌పై ఆ దేశ మాజీ క్రికెటర్ రమీజ్ రాజా సెటైర్స్ వేశాడు. తనకు నవ్వొస్తోందని.. నవ్వేందుకు పర్మిషన్ ఉందా అంటూ సొంత జట్టుపై జోక్స్ వేశాడు.
ఓడలు బండ్లు అవ్వడం.. బండ్లు ఓడలు అవ్వడం అనే సామెత వినే ఉంటారు. క్రికెట్లో కొన్ని జట్లకు ఈ సామెత వర్తిస్తుందనే చెప్పాలి. 1970 నుంచి 1980వ దశకం వరకు క్రికెట్‌ను ఏలిన కరీబియన్ టీమ్ ఆ తర్వాత క్రమంగా ప్రాభవం కోల్పోతూ వచ్చింది. ఇప్పుడు వెస్టిండీస్ టీమ్ జాడే కనిపించడం లేదు. వన్డే వరల్డ్ కప్-2023కి క్వాలిఫై అవ్వడంలోనూ ఆ జట్టు ఫెయిలైంది. సీనియర్ క్రికెటర్లు టీమ్‌లో ఉండగానే కుర్రాళ్లను తయారు చేసుకోవడం, డొమెస్టిక్ లెవల్ నుంచి ప్లేయర్ల సెలక్షన్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌కు తగ్గట్లు కోచింగ్‌తో పాటు క్రికెట్ వ్యవస్థను రూపొందించుకోవడం చాలా కీలకం.
క్రికెట్ బోర్డులు ఆదాయ మార్గాలను పెంచుకుంటూ ఎవరి మీద డిపెండ్ అవ్వని సిస్టమ్‌ను సిద్ధం చేసుకోవడం చాలా ముఖ్యం. ఇలా చేయకపోతే వెస్టిండీస్లాగే మిగతా బడా టీమ్స్ కూడా కుదేలవ్వక తప్పని పరిస్థితి. ఈ మధ్య కాలంలో చూసుకుంటే వెస్టిండీస్లాగే శ్రీలంక తయారైనట్లు కనిపిస్తోంది. ఆ టీమ్‌లో సీనియర్లు లేరు, మ్యాచ్ విన్నర్లు కనిపించడం లేదు. జట్టులోని యువకులు సమష్టిగా ఆడితేనే విజయాలు దక్కుతున్నాయి. ఛాంపియన్ టీమ్ అయిన లంక వరల్డ్ కప్స్‌లో ఎంతో డేంజరస్‌గా ఆడుతుంది. అలాంటి ఆ టీమ్ ఈ వరల్డ్ కప్‌లో దారుణంగా పెర్ఫార్మ్ చేస్తోంది. అదే బాటలో ప్రయాణిస్తున్నాయి ఇంగ్లండ్, దాయాది పాకిస్థాన్. ఇంగ్లీష్ టీమ్ నిండా స్టార్ ప్లేయర్లు ఉన్నా ఫెయిల్ అవ్వడంతో వరల్డ్ కప్ రేసులో వెనుకబడిపోయింది. కానీ పాక్ పరిస్థితి వేరు.
పాకిస్థాన్‌లో క్రికెట్ వ్యవస్థ సరిగ్గా లేదు. కోచ్‌లుగా ఫారెనర్లను నమ్ముకుంటున్నారు. ఆ కోచ్‌లు కూడా ఆన్లైన్లో ప్లేయర్లకు సలహాలు, సూచనలు ఇస్తున్నారు. పాక్ టీమ్‌లో అంతర్గత విభేదాలు కూడా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. వీటన్నింటికి తోడు ప్లేయర్లు కూడా సరిగ్గా రాణించకపోవడంతో వరల్డ్ కప్ రేసులో పాక్ వెనుకంజలో ఉంది. ఆడిన ఐదు మ్యాచుల్లో నాలుగింట్లో ఓడి డేంజర్ జోన్లో ఉంది. దీంతో బాబర్ సేనపై అన్ని వైపుల నుంచి విమర్శలు వస్తున్నాయి. తాజాగా పాక్ మాజీ క్రికెటర్ రమీజ్ రాజా కూడా సొంత జట్టుపై జోకులు వేశాడు. 1992లో ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పాక్ టీమ్ వరల్డ్ కప్ గెలుచుకుంది.
1992 వరల్డ్ కప్‌లో తొలుత ఓటములు ఎదురైనా ఇమ్రాన్ ఖాన్ పాక్‌కు కప్పు అందజేశాడు. ఈ విషయాన్ని గుర్తుచేసిన కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ అదే మ్యాజిక్‌ను పాక్ కోచ్ మికీ ఆర్థర్ రిపీట్ చేస్తారా అని ప్రశ్నించారు. దీనికి పాక్ మాజీ క్రికెటర్ రమీజ్ రాజా స్పందిస్తూ.. ఇదో జోక్ అని.. దీనికి తాను నవ్వొచ్చా అని అడిగాడు. నవ్వేందుకు పర్మిషన్ ఉందా అని పాక్ టీమ్‌ను ఉద్దేశించి సెటైర్ వేశాడు. దీంతో పాక్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. సొంత దేశ క్రికెటర్ అయ్యుండి టీమ్ కోచ్‌ను ఉద్దేశించి ఇలా అనడం కరెక్ట్ కాదని సీరియస్ అవుతున్నారు. మరికొందరేమో కోచ్‌గా ఆర్థర్ సాధించిందేమీ లేదని.. అతడిపై జోక్స్ వేయడంలో తప్పే లేదని అంటున్నారు. మరి.. పాక్ పరువు తీసిన రమీజ్ రాజాపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: కోహ్లీని డామినేట్ చేస్తున్న రోహిత్! ఇన్నాళ్లకు సాధ్యం అయ్యిందా?
Sanjay Manjrekar – can Mickey Arthur repeat what Imran Khan did in 1992?
Ramiz Raja – can I laugh on this please? Is it allowed?! pic.twitter.com/N78uhQnXc5
— Mufaddal Vohra (@mufaddal_vohra) October 31, 2023