iDreamPost
android-app
ios-app

కోహ్లీని ప్రశంసల్లో ముంచెత్తిన పాక్ స్టార్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్!

  • Author singhj Published - 04:42 PM, Tue - 31 October 23

భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని పాక్ క్రికెటర్ మహ్మద్ రిజ్వాన్ ప్రశంసల్లో ముంచెత్తాడు. విరాట్ తన పుట్టిన రోజు నాడు అలా చేస్తే చూడాలని ఉందన్నాడు.

భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని పాక్ క్రికెటర్ మహ్మద్ రిజ్వాన్ ప్రశంసల్లో ముంచెత్తాడు. విరాట్ తన పుట్టిన రోజు నాడు అలా చేస్తే చూడాలని ఉందన్నాడు.

  • Author singhj Published - 04:42 PM, Tue - 31 October 23
కోహ్లీని ప్రశంసల్లో ముంచెత్తిన పాక్ స్టార్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్!

విరాట్ కోహ్లీ.. క్రికెట్ అభిమానులకు పరిచయం అక్కర్లేని పేరు. ప్రస్తుత తరంలో బెస్ట్ ప్లేయర్ లిస్ట్​లో ముందు వరుసలో ఉండే ప్లేయర్. తనకు నేమ్, ఫేమ్ ఇచ్చిన క్రికెట్​ గ్లోబల్ స్పోర్ట్స్​గా అవతరించడంలో కీలక పాత్ర పోషిస్తున్న ఆటగాడు. క్రికెట్ అంటే ఏంటో తెలియని వారికి కూడా కోహ్లీ తెలుసని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. అంతగా జెంటిల్మన్ గేమ్​తో పాటు వరల్డ్ స్పోర్ట్స్​ మీద తనదైన ముద్ర వేశాడు కోహ్లీ. ప్లేయర్​గా, కెప్టెన్​గా దూకుడు ప్రదర్శిస్తూ క్రికెట్​కు ఈతరంలో రియల్ బ్రాండ్ అంబాసిడర్​గా నిలిచాడు విరాట్. అతడో టోర్నమెంట్​లో లేదా మ్యాచ్​లో ఆడుతున్నాడంటే దానికి వచ్చే వ్యూయర్​షిప్ వేరే లెవల్లో ఉంటుందనే చెప్పాలి.

కోహ్లీ బ్యాటింగ్ చేస్తున్నాడంటే చాలు.. పనులన్నీ మానేసి ఫోన్, లేదా టీవీ స్క్రీన్​కు అతుక్కుపోవాల్సిందే. అతడి ఆట చూడటానికి అంత బాగుంటుంది. ఫార్మాట్ ఏదైనా పిచ్​పై సెటిల్ అయ్యే వరకు సింగిల్స్, డబుల్స్​తో స్ట్రైక్ రొటేట్ చేయడం.. మ్యాచ్ సిచ్యువేషన్​ను బట్టి గేర్లు మార్చి అవసరమైతే హిట్టింగ్​కు దిగడం విరాట్​కు వెన్నతో పెట్టిన విద్య. ఛేజింగ్​లోనైతే ఎన్ని వికెట్లు ఉన్నాయి, ఎన్ని బంతుల్లో ఎన్ని రన్స్ కొట్టాలనే పర్ఫెక్ట్ ఈక్వేషన్స్​తో అతడి బ్యాటింగ్ సాగుతుంది. చెత్త షాట్లు, అనవసర ప్రయోగాలు కోహ్లీ బ్యాటింగ్​లో కనిపించవు. క్రికెటింగ్ షాట్స్​తో పద్ధతిగా ఆడతాడు. అందుకే అతడ్ని ఔట్ చేయడం అంత ఈజీ కాదు.

క్రికెట్​లో ఎంతో సాధించిన విరాట్ కోహ్లీ.. మరిన్ని రికార్డులు బ్రేక్ దిశగా దూసుకెళ్తున్నాడు. నవంబర్ 5వ తేదీన అతడి బర్త్ డే అనేది తెలిసిందే. అదే రోజు సౌతాఫ్రికాతో కోల్​కతాలోని ఈడెన్ గార్డెన్స్​లో టీమిండియా తలపడనుంది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ స్టార్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. విరాట్​పై ప్రశంసల జల్లులు కురిపించిన పాక్ కీపర్.. అతడికి తన తరఫున పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశాడు. బర్త్ డే నాడు విరాట్ తన వన్డే కెరీర్​లో 49వ సెంచరీ సాధించాలని ఆశిస్తున్నానని చెప్పుకొచ్చాడు. ఈ వరల్డ్ కప్​లోనే కోహ్లీ 50వ సెంచరీ మార్క్​ను కూడా అందుకోవాలని కోరుకుంటున్నానని రిజ్వాన్ పేర్కొన్నాడు. మరి.. కోహ్లీపై రిజ్వాన్ చేసిన వ్యాఖ్యల మీద మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: IPL 2024పై బాంబు పేల్చిన ధోని.. అన్నీ బాగుంటేనే అంటూ..!

Jojobet GirişjojobetcasibomjojobetcasibomcasibomStarzbetMadridbetbetciomatbet girişjojobetgrandpashabetgrandpashabet belge numarasıgrandpashabet belge numarasıJojobet GirişGrandpashabet destekdeneme bonusuJojobetcasibom girişPoliwinGrandpashabetGrandpashabetcasibomjojobetcasibomCasibom Güncel Giriş